కందుల దిగుమతి అవకాశంతో తగ్గిన గిరాకీ

 

 కేంద్ర ప్రభుత్వం అపరాల దిగుమతి విధానాన్ని సవరిస్తూ, 31 మార్చి 2023 వరకు కందులు, మినుముల స్వేచ్ఛా దిగుమతికి అనుమతించింది. దీనితో మయన్మార్ నుండి 2 నుండి 2.50 లక్షల టన్నుల సరుకు దిగుమతి అయ్యే అవకాశం కలదు. అంతేకాకుండా ఆఫ్రికాలో ఆగస్టు 2022లో పంట కోతలు ఉండగలవు. దీనితో దేశీయ మార్కెట్లో ధరలు మందకొడిగా మారుతున్నాయి. అయితే భారత్ ద్వారా డిమాండ్ ఉన్నందున మయన్మార్ లెమన్ కందుల ధర 20 డాలర్లు పెరిగి 850 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించబడింది. ప్రస్తుతం వేసవి సీజన్లో పప్పు వినియోగం తగ్గడంతో మిల్లుల కోసం డిమాండ్ తక్కువగా ఉంది. 


దీనితో ముంబెల్లో కొత్త లెమన్ కందులు రూ. 50 తగ్గి రూ.6250, అరుశ రూ.5500-5600, మొజాంబిక్, గజరి రూ. 5450-5500, మాలవి కందులు రూ. 4900-5000, సూడాన్ సరుకు రూ. 6500-6600, మట్వారా రూ. 5400-550 ధరతో వ్యాపారమెంది. 

మహారాష్ట్ర ప్రాంతం సరుకు చెన్నై డెలివరి రూ. 6950, గుజరాత్ ప్రాంతపు బిడిఎన్-2 రకం సరుకు రూ.7050, సోలాపూర్లో దినసరి 16-17 లారీల రాబడిపై రూ.5500-6400, మహారాష్ట్రలోని ఇతర ఉత్పాదక కేంద్రాలలో 20-25 వేల బస్తాల రాబడిప్పె లాతూర్ 63 నెంబర్, మారుతి రకాలు రూ. 6500-6625, తెలుపు రకం రూ.6000-6400, అకోలాలో గులాబీ మరియు దేశవాలి సరుకు రూ. నాణ్యమైన పట్కా పప్పు రూ. 9500-9600, మీడియం రూ. 9200-9300, సవానెంబర్ రూ. 8500-8600 ధరతో వ్యాపారమైంది. గత వారం విదర్భ, మరాఠ్వాడా, కర్ణాటక ప్రాంతాల కందులు కట్నీ డెలివరి రూ. 6900-7000, ఇండోర్లో మహారాష్ట్ర సరుకు రూ.6400, కర్ణాటక సరుకు రూ. 6500, కర్ణాటకలోని కల్బుర్గిలో దినసరి 1500 బస్తాల రాబడి కాగా, రూ. 6200-6500, పట్కా పప్పు రూ. 9100-9500, రాయిచూర్, యాద్గిర్, ముద్దెబిహాల్, బీదర్, బాల్కీ ప్రాంతా అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు 7-8 వేల బస్తాల కందుల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 5900-6500 ప్రతి క్వింటాలు ధరతో వాయ్పారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు