Posts

Showing posts from December, 2021

కంటిమీద కునుకు కరవైన నువ్వుల స్టాకిస్టులు

Image
  19-12-2021  ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఉత్పత్తి తగ్గినందున ఇప్పడిముబ్బడిగా సరుకు నిల్వ చేశారు. అయితే, ఎగుమతి వ్యాపారం డీలా పడినందున ధరలు చైతన్యం కోల్పోయాయని వ్యాపారులు పేర్కొన్నారు. తద్వారా జనవరి మూడో వారం నుండి స్టాకిస్టులు తమ సరుకు బయటకు తీసే అవకాశం ఉంది. ఎందుకనగా జనవరి నుండి రబీ సీజన్ పంట రాబడులు మరియు మే నెల నుండి గ్రీష్మకాలం పంట రాబడులు ప్రారంభం కానుండడమే ఇందుకు నిదర్శనం.

పత్తి స్తిరం - రైతుల దగ్గరే పత్తి నిల్వలు

Image
  19-12-2021 వరంగల్ 10 వేల బస్తాల రాబడిపై రూ. 7000-8120, ఖమ్మంలో 8-10 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 8400, మీడియం రూ. 7500-8000, కర్నాటకలో 10-11 వేల బస్తాల రాబడిపై రూ.7000-8850, గింజలు రూ.2700-3450 ప్రతిక్వింటాలు మరియు మహారాష్ట్రలో 35-40 వేల బేళ్ల రాబడిపై రూ. 6000-8600, మధ్య ప్రదేశ్లో 14-15 వేల బేళ్ల రాబడిపై రూ. 6000-8500, మధ్య ప్రదేశ్లో 14–15 వేల బేళ్ల రాబడిపై రూ. 6000-8500, రాజస్తాన్లో 4-5 వేల బేళ్ల రాబడిపై రూ. 7000-8600 ధరతో వ్యాపారమయింది.

రబీలో పెరిగిన మొక్కజొన్న సేద్యం

Image
  19-12-2021 ప్రస్తుత సీజన్లో డిసెంబర్ 17 వరకు మొక్కజొన్న సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 10.25 ల.హె. నుండి పెరిగి 11.22 ల.హె.కు విస్తరించింది. వచ్చే గ్రీష్మకాలం కోసం బీహార్తో పాటు మరికొన్ని తూర్పు రాష్ట్రాలలో మొక్కజొన్న సేద్యం భారీగా విస్తరించగలదని భావిస్తున్నారు. తద్వారా ఫిబ్రవరి చివరి వారంలో ధరలు ఇనుమడించిన తరుణంలో స్టాకిస్టులు తమ సరుకు నిల్వలు ఖాళీ చేయడం శ్రేయస్కరం. 

శనగల ధరలు తగ్గుదల

Image
  19-12-2021 ప్రస్తుత సీజన్లో 17, డిసెంబర్ వరకు అపరాల విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 137.26 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 137.19 లక్షల హెక్టార్లకు చేరింది. అయితే, శనగ విస్తీర్ణం 96.60 లక్షల హెక్టార్ల నుండి పెరిగి 97.99 లక్షల హెక్టార్లకు చేరింది. గుజరాత్, రాజస్తాన్, మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో పంటవిత్తడం కొనసాగుతున్నది. దీనితో విస్తీర్ణం గత ఏడాది మాదిరిగా ఉండే అవకాశం కలదు. వర్షాల వలన ఆంధ్ర, కర్నాటకలలో పంటకు నష్టం వాటిల్లింది. అయితే, కొత్త సీజన్ మిగులు నిల్వలతో ప్రారంభమవుతున్నది. రాజస్తాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో మద్దతు ధరకంటే ధరలు తక్కువగా ఉన్నందున కొత్త సీజన్లో మందకొడికి అవకాశం కలదు. 

రబీ వేరుశనగ... రికార్డు సేద్యం

Image
  19-12-2021 దేశంలో ఖరీఫ్ సీజన్  వేరుసెనగ ఉత్పత్తి గణనీయంగా వృద్ధి చెందినప్పటికీ స్వేచ్ఛా విపణిలో కనీస మద్దతు ధర అధిగమించాయి. తద్వారా రబీ సీజన్ కోసం డిసెంబర్ 17 వరకు దేశంలో వేరుసెనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 3.12 ల.హె. నుండి పెరిగి 3.25 ల.హె.కు విస్తరించింది. గ్రీష్మ కాలంలో కూడా భారీగా విస్తరించే అవకాశం కనిపిస్తున్నది. ఎందుకనగా, గత రెండు సీజన్లలో కూడా రైతులకు లాభసాటి ధరలు గిట్టుబాటు కావడమే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది కురిసిన కుండపోత వర్షాలకు నేలలో సంతృప్తికరమైన తేమ నిక్షిప్తమైన ఉన్నందున సేద్యం భారీగా విస్తరించే అంచనాతో మున్ముందు ధరలపై ఒత్తిడి కొనసాగే అంచనాతో స్టాకిస్టు వ్యాపారులు సరుకు కొనుగోలుకు ఆసక్తి కనబరచడంలేదు. అయితే, దేశంలో డిమాండ్ కు అనుగుణంగా సరఫరా అందుబాటులో ఉన్నందున ధరలు ఒడిదొడుకులకు లోనుకావడంలేదు. ఎగుమతులు కూడా ఆశించిన స్థాయిలో లేవు.

రబీలో తగ్గిన పెసర విస్తీర్ణం

Image
  19-12-2021 గత నెలలో పెసల ధరలలో ఎక్కువగా హెచ్చుతగ్గులు చోటుచేసుకోనందున రైతులు పంట వేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపకపోవడంతో రబీ సీజన్ కోసం పంట విత్తడంలో వేగం పుంజుకోలేదు. 17, డిసెంబర్ వరకు దేశంలో విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1.36 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 96000 హెక్టార్లకు చేరింది. ఇందుకు ముఖ్య కారణమేమనగా, రైతులు నూనెగింజలు, ముతకధాన్యాల సాగుకు మొగ్గుచూపుతున్నారు. 

అంతర్జాతీయ మార్కెట్ లో తగ్గిన మినుముల ధరలు

Image
  19-12-2021 డిసెంబర్ వరకు దేశంలో రబీ మినుము పంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 4.47 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 4.25 లక్షల హెక్టార్లకు చేరింది. అయితే, ఇతర ఉత్పాదక దేశాలలో కంది, మినుము పంటల విస్తీర్ణం పెరగడం మరియు ఫిబ్రవరి నుండి అంతర్జాతీయ మార్కెట్లో సరఫరా పెరిగే అవకాశం ఉండడంతో మయన్మార్ ఎఫ్ఎక్యూ 70 డాలర్లు తగ్గి 810 డాలర్లు మరియు ఎస్యూ 900 డాలర్లు ప్రతిటన్ను ప్రతిపాదించబడడంతో ముంబాయిలో ఎఫ్ఎక్యూ కొత్త రూ.150 తగ్గి రూ. 6800, పాత రూ. 6700, చెన్నైలో ఎస్యూ రూ. 7300, ఎఫ్ఎక్యూ రూ. 6700, కోల్కత్తాలో ఎఫ్ఎక్యూ రూ. 6850 ధరతో వ్యాపారమయింది.

పెరుగుతున్న పసుపు వాయిదా ధరలు

Image
  19-12-2021 దేశంలోని ప్రముఖ పసుపు ఉత్పాదక రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సేద్యం భారీగా విస్తరించిన తర్వాత కురిసిన భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాలలో పంటకు కీటక సంక్రమణం వలన పంట దిగుబడులు 15-20 శాతం తగ్గే అంచనా వ్యక్తమవుతున్నది. మరి కొద్ది నెలలలో కొత్త సీజన్ ప్రారంభం కానుండగా, 25-30 లక్షల బస్తాల పాత సరుకు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఉత్పత్తి 30-40 శాతం తగ్గుతుందని వదంతులు ప్రచారం చేస్తూ స్టాకిస్టు వ్యాపారులు ధరలు భారీగా పెంచి సరుకు విక్రయించి బయట పడుతున్నారు. అంతేకాకుండా, అధిక ధరతో వాయిదా విక్రయించి లాభాలు మూటగట్టుకుంటున్నారు. 

పెరిగిన ధరలతో హోరెత్తిన మిర్చి వ్యాపారం

Image
  19-12-2021 గత వారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాంటి మిర్చి ఉత్పాదక రాష్ట్రాలలోని శీతల గిడ్డంగుల నుండి 4 లక్షల బస్తాలు మరియు 3 లక్షల కొత్త మిర్చి కలిసి మొత్తం 7 లక్షల బస్తాలకు పైగా సరుకు రాబడి అయినప్పటికీ గడిచిన వారంలో నాణ్యమైన రకాల ధరలు రూ. 4000-5000, మీడియం రకాలు రూ. 1000 -1500 ప్రతి క్వింటాలుకు వృద్ధి చెందాయి. ఎందుకనగా, దక్షిణాది రాష్ట్రాలలో సేద్యం గణనీయంగా విస్తరించినప్పటికీ అతివృష్టి మరియు కీటక సంక్రమణం వలన పంటకు తీరని నష్టం వాటిల్లడమే ఇందుకు నిదర్శనం. దీనితో స్టాకిస్టులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. 

వాతావరణ సానుకులతతో శరవేగంగా చేపడుతున్న రబీ సేద్యం

Image
07-12-2021  దీర్ఘకాలం పాటు రుతుపవనాల వర్షాలు కురిసినందున నేలలో సమృ ద్ధిగా నిక్షిప్తమైన తేమ వలన ప్రస్తుత రబీ సీజన్లో డిసెంబర్ 3 వరకు దేశవ్యాప్తంగా సాధారణ సేద్యంతో పోలిస్తే 625.14 ల.హె.కు గాను 70 శాతం వృద్ధి చెందింది. మరియు గత ఏడాదితో పోలిస్తే 413.11 ల.హె. నుండి 438.51 ల.హె. కు విస్తరించింది. వాతావరణం సానుకూలంగా పరిణమించినందున ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి సేద్యం మొత్తం సాధారణ ప్రాంతాలకు కూడా విస్తరించగలదు.

ధనియాలు డల్

Image
  07-12-2021 గతవారం దక్షిణ భారత్లో గిరాకీ తక్కువగా ఉండడంతో ధనియాల ధర రూ. 150-200 మరియు వాయిదా ధరలు రూ. 400-500 ప్రతిక్వింటా లుకు తగ్గాయి. లభించిన సమాచారం ప్రకారం రాజస్తాన్, మధ్య ప్రదేశ్, గుజ రాత్ లలో విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే తగ్గడంతో ప్రస్తుతం స్టాకిస్టులు నెమ్మదిగా సరుకు విక్రయిస్తున్నారు. అయితే, పొంగల్ పండుగ కోసం డిసెంబర్ రెండవ వారం నుండి గిరాకీ వచ్చే అవకాశముంది. ఎన్ సిడి ఇఎ క్స్ సోమవారం డిసెంబర్ వాయిదా రూ.8722 తో ప్రారంభమైన తరువాత శుక్రవారం వరకు రూ.402 తగ్గి రూ. 8320, జనవరి వాయిదా రూ. 524 తగ్గి రూ. 8406తో ముగిసింది.

బొబ్బర్లు వృద్ధి

Image
  07-12-2021 ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని రాయచోటిలో ప్రతి రోజు 1-2 వాహనాల బొబ్బర్ల అమ్మకంపై ధర రూ.200-300 వృద్ధి చెంది నలుపు రూ. 7000, తెలుపు రూ. 5800, ఎరుపు రూ.5500, పొదిలిలో రూ. 5800-5900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

మార్చి ఏప్రిల్ నుండి పామాయిల్ ధరలు తగ్గే అవకాశం

Image
  దేశంలో మార్చి-ఏప్రిల్ నుండి పామాయిల్ ధరలు తగ్గనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఎందుకనగా, మలేషియాలో పామాయిల్ కొత్త సీజన్ ప్రారంభం కానుండడమే ఇందుకు నిదర్శనం. ఇదే వ్యవధిలో భారతదేశంలో రబీ సీజన్ పంట రాబడులు పోటెత్తనున్న ఆవాలు, వేరుసెనగ, కుసుమలు, నువ్వులు లాంటి రాబడులు మరియు రైస్-బ్రాన్ తౌడూనూనె అమ్మకాలపై ఒత్తిడి పెరగగలదు. అంతేకాకుండా, రష్యా, ఉక్రెయిన్తో పాటు ఇతర అన్ని సన్ఫ్లవర్ ఉత్పాదక దేశాల నుండి వృద్ధి చెందనున్న సరఫరా మరియు ప్రపంచ సోయా స్టాకిస్టులు కూడా తమ సరుకు విక్రయించేందుకు సన్నద్ధం కాగలరు.

కొబ్బరిలో మందగమనం లేనట్లే

Image
  07-12-2021 దక్షిణాది రాష్ట్రాలలో కురిసిన కుండపోత వర్షాలు మరియు దేశవ్యాప్తంగా వివాహాల సీజన్ కొనసాగుతున్నందున కొబ్బరి ధరలు ఇనుమడి స్తున్నాయి. 

పెరిగిన శనగ విస్తీర్ణం - వర్షాల వలన నాణ్యతపై ప్రభావం

Image
  07-12-2021 ప్రస్తుత సీజన్లో 1, డిసెంబర్ వరకు దేశంలో శనగ విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 80.01 లక్షల హెక్టార్లతో పోలిస్తే పెరిగి 81.43 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో 

పెసరపప్పు గిరాకీ

Image
 07-12-2021 గతవారం పప్పు మిల్లర్ల డిమాండ్ పెరగడంతో పెసల ధరలు రూ. 150-200 ప్రతిక్వింటాలుకు పెరిగాయి. ఇందుకు ముఖ్య కారణమేమనగా, దేశంలో రబీ సీజన్ కోసం విస్తీర్ణం తగ్గింది మరియు ఖరీప్ సీజన్ సరుకు రాబడులు దాదాపు సమాప్తమయ్యాయి. ఆంధ్ర, తమిళనాడులలో జనవరి నుండి ప్రారంభ మయ్యే పంటకోసం భారీ వర్షాల వలన కొత్త సరుకు రాబడులు ఆలస్యం కావ డంతో పాటు దిగుబడి తగ్గే అవకాశం కలదు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి వివరాల ప్రకారం 2, డిసెంబర్ వరకు దేశంలో రబీ సీజన్ కోసం పెసర విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 85 వేల హెక్టార్ల నుండి తగ్గి 64 వేల హెక్టార్లకు చేరింది. ఇందులో ఒరిస్సాలో 45 వేల హెక్టార్ల నుండి తగ్గి 25 వేల హెక్టార్లకు మరియు ఆంధ్రప్రదేశ్లో 11 వేల హెక్టార్ల నుండి తగ్గి 9 వేల హెక్టార్లకు చేరింది. అయితే, తమిళనాడులో 23 వేల హెక్టార్ల నుండి పెరిగి 36 వేల హెక్టార్లకు చేరింది.

కొనుగోళ్లు లేని కందిపప్పు

Image
  07-12-2021 ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో ఇటీవల కుండపోత వర్షాలతో కంది పంటకు నష్టం వాటిల్లినందున కర్ణాటకలో కొత్త కందులు నాసిరకంగా వస్తున్నాయి. అయితే, సోలాపూర్లో కర్ణాటక నుండి వారంలో 4-5 వేల బస్తాల కొత్త కందుల రాబడిపై రూ.6300-6500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కల్బుర్గి, మహారాష్ట్రలోని లాతూర్, తెలంగాణలోని తాండూరు ప్రాంతాలలో ఇప్పటి వరకు కొత్త సరుకు రాబడులు ప్రారంభం కాలేదు. మరో 15 రోజులు పట్టగలదని భావిస్తున్నారు. పంట దిగుబడులు తగ్గగలవని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. కావున మహారాష్ట్రలో రైతులు మరియు వ్యాపారుల వద్ద నిల్వ సరుకు విక్రయించడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు.

రబీ సీజన్ నువ్వుల ఉత్పత్తి భేష్

Image
  06-12-2021  రబీ సీజన్ కోసం ప్రస్తుతం నువ్వుల సేద్యం 530 ఎకరాలకు విస్తరించగా సేద్యం చేపట్టడానికి మరో రెండు నెలల సమయం ఉంది. రేగడి నేలలో సాగుచేస్తున్న పత్తి పంట కోతలు జనవరిలో ముగిసిన వెంటనే నువ్వుల సేద్యం చేపట్టడం శ్రేయస్కరమని ప్రభుత్వం మరియు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. ఈ నేలలో సాగు చేపట్టిన ప్రతి హెక్టారు దిగుబడి 3-7 క్వింటాళ్లు సాధించవచ్చని, ధర రూ. 8000–10,000 ఆర్జించవచ్చని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

అతివృష్టి వలన చింతపండు రాబడులు ఆలస్యమయ్యే అవకాశం

Image
  06-12-2021 దక్షిణాదిలోని ప్రముఖ చింతపండు ఉత్పాదక రాష్ట్రాలలో తరచుగా కురుస్తున్న వర్షాల వలన చింతపండు పంటకు నష్టం వాటిలడంతో పాటు కొత్త సరుకు రాబడులు జాప్యం కాగలవని భావిస్తున్నారు. ఎందుకనగా, తాజాగా మరో తుపాను కేంద్రీకృతమై ఉన్నందున ఒడిశ్శా మరియు తీర ప్రాంతమైన విజయనగరం, శ్రీకాకుళం మరియు ఛత్తీస్గఢ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రస్తుత తరుణంలో చింతపండు పక్వానికి రావడానికి జాప్యం ఏర్పడుతున్నది. 

రాగులు

Image
  06-12-2021 కర్ణాటకలో ఖరీఫ్ పంటలకు నష్టం వాటిల్లిన తర్వాత రాగులు స్టాకిస్టులు ఒంటికాలు మీద లేచి నిలబడ్డారు. గత వారం మహబూబ్ నగర్ లో 2-3 వాహనాల రాగుల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 2500-3125, మీడియం రూ. 2300-2500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై విజయవాడ కోసం రవాణా అవుతున్నది. 

భారీగా యాలకుల రాబడులు

Image
  06-12-2021 దేశంలో ప్రముఖ యాలకుల ఉత్పాదక ప్రాంతమైన దక్షిణ భారత యాలకుల వేలం కేంద్రాల వద్ద నవంబర్ 29 నుండి డిసెంబర్ 4 వరకు వారంలో యాలకుల రాబడులు గత వారంతో పోలిస్తే 8,35,268 నుండి 3.10 లక్షల కిలోలు పెరిగి 11,45,316 కిలోలు సరుకు రాబడి అయింది. ఇందులో 10,28,423 కిలోల సరుకు విక్రయించబడింది. సోమవారం కనిష్ఠ ధర రూ. 1093.17 నుండి రూ. 100 తగ్గి శుక్రవారం 992.38 కు చేరగా శనివారం రూ. 10 వృద్ధి చెంది రూ. 1002.59 ప్రతి కిలో ధరతో అమ్మకమైంది. 

కొత్త వేరుశనగ పంట ధరకు ఢోకా లేదు - తమిళనాడు వేరుశనగ విత్తులకు గుజరాత్ లో భారీ డిమాండ్ - వేరుశనగ పంట కోసం లభ్యమైన కేంద్ర నిధులు

Image
  05-12-2021 2022 లో వేరుసెనగ ఉత్పత్తి గణనీయంగా రాణిస్తున్నప్పటికీ ధరలు చెప్పుకోదగ్గ స్థాయికి దిగజారే అవకాశం లేదని వ్యాపారులు భావిస్తున్నారు. దేశంలో సోయానూనె వినియోగం భారీగా వృద్ధి చెందినప్పటికీ సోయాచిక్కుడు ధరలు గత ఏడాదితో పోలిస్తే ఎగబాకాయి. సన్ఫ్లవర్ నూనె దిగువుతులకు కళ్లెం పడింది, నత్తనడకేశాయి. కుసుమల నిల్వలు దాదాపు లేవనే చెప్పవచ్చు. ఈ సారి నువ్వుల ఉత్పత్తి కూడా అంతంతమాత్రమే ఉంది. పామాయిల్ నూనె ధర మార్చి వరకు దిగివచ్చే అవకాశం లేదు. ఈ ప్రభావమే సోయాచిక్కుడు మరియు వేరుసెనగకు ప్రయోజనం చేకూరుతున్నది. భారత్ నుండి ఎగుమతులు మరియు రాబోయే సీజన్ సేద్యం చేపట్టేందుకు విత్తులకు డిమాండ్ నెలకొన్నందున ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుండే ధరలు ఇనుమడించాయి. కుసుమ లాంటి నూనెల ధరలు కూడా అధికంగానే ఉన్నాయి. ప్రభుత్వం నిల్వ పరిమితి విధించినందున ప్రతి వర్తకుడు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నందున నూనె మిల్లులకు ఎడతెరిపి లేకుండా క్రషింగ్ చేపడుతున్నాయి.

తగ్గిన మినుము సేద్యం - ధరలు బలోపేతం

Image
  05-12-2021 ప్రస్తుత రబీ సీజన్లో దేశంలో డిసెంబర్ 3 వరకు మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 3.50 ల.హె. నుండి తగ్గి 3.22 ల.హె.కు పరిమితమైందని కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది. ఇందులో తమిళనాడులో 2.23 ల.హె. నుండి తగ్గి 1.66 ల.హె.కు పరిమితం కాగా, ఆంధ్రప్రదేశ్లో 67 వేల హెక్టార్ల నుండి పెరిగి 82 వేల హెకార్లు,ఒడిశ్శాలో 40 వేల హెక్టార్ల నుండి 41 వేల హెక్టార్లకు విస్తరించింది. అయితే, భారీ వర్షాలు కురిసినందున ఆంధ్రప్రదేశ్లో పంటకు నష్టం వాటిల్లే అంచనా వ్యక్తమవుతున్నది. ఒడిశ్శాలో జవాద్ తుపాను సంభవించినందున వర్ధమాన పంటలకు నష్టం పొంచివున్నట్లు తెలుస్తోంది. ఖరీఫ్ సీజన్ పంట నిల్వలు అడుగంటాయి. వచ్చే ఏడాది కోసం తమిళనాడులో డిమాండ్ ఉండగలదు.కావున ఇలాంటి పరిస్థితులలో ధరలు కుంగుబాట పట్టే అవకాశం లేదు.

పెరిగిన బెల్లం రాబడులు - కొనుగోళ్లు తగ్గుదల

Image
  05-12-2021 దక్షిణాది రాష్ట్రాలలో ఇటీవల కురిసిన కుండపోత వర్షాలు మరియు ఒడిశ్శాతో పాటు తూర్పు ఆంధ్రప్రదేశ్లో తుపాను హెచ్చరికల నేపథ్యంలో బెల్లం తయారీ నిలిచిపోయింది. అయితే, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుల నుండి బెల్లం సరఫరా జోరందుకోవడంతో పాటు ఇప్పటి వరకు స్టాకిస్టుల కొనుగోళ్లు ప్రారంభం కానందున ధరలు ప్రభావితం చెందాయి. ఉత్తర ప్రదేశ్లోని ముజఫర్ నగర్ లో గత వారం 25-30 వేల బస్తాల కొత్త బెల్లం రాబడిపై 40 కిలోలు చాకూ బెల్లం రూ. 1100-1170, కురుపా రూ. 1100-1110, లడ్డు బెల్లం రూ. 1200-1240, పౌడర్ బెల్లం రూ. 1200, రస్కట్ రూ. 980-1040 మరియు హాపూర్లో 115–120 వాహనాల కొత్త బెల్లం రాబడి కాగా రూ. 1070-1100 ధరతో వ్యాపారమైంది.

ఒమిక్రాన్ థర్డ్ వేవ్ తో జడుస్తున్న పత్తి ధరలు

Image
  05-12-2021 ఒమ్రికాన్ ఉత్పరిణామం నేపథ్యంలో కరోనా వైరస్ మరోసారి విజృంభించే అంచనాతో ప్రపంచ మార్కెట్ పై దుష్ప్రభావం పొడసూపుతున్నది. గడిచిన రెండు వారాలుగా పత్తి ధరలు దాదాపు రూ. 2000 ప్రతి క్వింటాలుకు పతనమైంది. ప్రస్తుతం నాణ్యమైన సరుకు రూ. 9400-9500 నుండి తగ్గి 7500-7700, నాసిరకం సరుకు రూ.6200-6500 కు పరిమితమైంది.ఈ ఏడాది పత్తి పంటకు పింక్ బోల్వార్మ్ సంక్రమించినందున సరుకు నాణ్యత కోల్పోవడమే కాకుండా దిగుబడులు కూడా క్షీణించాయి. మార్కెట్లో రాబడులు గత ఏడాదితో పోలిస్తే 50 శాతం మేర తగ్గాయి. పత్తి తన సహజత్వం కోల్పోయి పసుపు వర్ణంలోకి మారింది.పంజాబ్ పత్తి సేద్యం 3.04 ల.హె.కు విస్తరించింది. రాష్ట్రంలోని ఏడు జిల్లాల మార్కెట్లో డిసెంబర్ 1 వరకు పత్తి రాబడులు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 19.96 లక్షల క్వింటాళ్ల నుండి తగ్గి 9.20 లక్షల క్వింటాళ్లకు పరిమితమయ్యాయి.

తగ్గిన పసుపు ఎగుమతులు - జనవరి లో కొత్త పసుపు రాబడులు

Image
  05-12-2021 విశ్లేషకుల కథనం ప్రకారం పసుపు ఉత్పాదక ప్రాంతాలలో మంచి వర్షాలు కురవడంతో, 2022 లో ఉత్పత్తి ముందు సంవత్సరంతో పోలిస్తే 10 శాతం అధికంగా ఉండే అంచనా కలదు. అయితే, కొందరు వ్యాపారులు పంటకు నష్టం వాటిల్లినట్లు ఇప్పటినుండే ప్రచారం చేస్తున్నటికీ, ధరలు పెరిగే అవకాశం కనిపించడంలేదు. ఇందుకు ముఖ్య కారణమేమనగా, దేశంలోని అన్ని ఉత్పాదక మరియు వినియోగ రాష్ట్రా లలో పాత సరుకు నిల్వలు ఉన్నాయి. మరియు మర ఆడించే మసాలా యూనిట్లు అవసరానికి అనుగు ణంగానే సరుకు కొనుగోలు చేస్తు న్నాయి. అన్ సీజన్ లో రూ. 400-500 హెచ్చుతగ్గుల ప్రభావం అధిక ధరలు గల సరుకులపై ఉండదు.

రికార్డు స్ధాయిలో మిరప సేద్యం - వర్షాలతో పంటకు నష్టం - గత వారం ధరలు

Image
  05-12-2021 వ్యాపారస్తుల కథనం ప్రకారం మధ్య ప్రదేశ్లోని అన్ని ఉత్పాదక కేంద్రాలలో కలిసి గతవారం 1.25 లక్షల బస్తాలకు పైగా మిరప రాబడిపై మర ఆడించే యూనిట్ల డిమాండ్తో  ధరలు హెచ్చుముఖంలో ఉన్నాయి. ఇందుకు ముఖ్య కారణమేమనగా, ఆంధ్రలో తరచుగా వస్తున్న తుఫానుల నేపథ్యంలో భారీ వర్షాల వలన పంటకు నష్టం చేకూరడంతో పాటు చీడపీడల బెడద వలన దిగుబడి తగ్గే అవకాశం ఉండడంతో పాటు మహారా ష్ట్రలోని బుల్జానా, చిక్లీ, డొండాగాంవ్ ప్రాంతాలలో 15 రోజులలో రాబడులు సమాప్తమయ్యే అవకాశం ఉంది. మరియు నందూర్ బార్, బుర్హాన్పూర్ తదితర ప్రాంతాలు, గుజరాత్లలో భారీ వర్షాల వలన పంటకు నష్టం చేకూరడంతో అలాగే రాబడులు ఆలస్యం కావడంతో మిరప వ్యాపారులు అప్రమత్తమయ్యారు. నాణ్యమైన సరుకు కోసం డిమాండ్ తో పోలిస్తే సరఫరా తక్కువగా ఉండడంతో ధరలు హెచ్చుముఖంలో ఉన్నాయి.