ఒమిక్రాన్ థర్డ్ వేవ్ తో జడుస్తున్న పత్తి ధరలు

 

05-12-2021

ఒమ్రికాన్ ఉత్పరిణామం నేపథ్యంలో కరోనా వైరస్ మరోసారి విజృంభించే అంచనాతో ప్రపంచ మార్కెట్ పై దుష్ప్రభావం పొడసూపుతున్నది. గడిచిన రెండు వారాలుగా పత్తి ధరలు దాదాపు రూ. 2000 ప్రతి క్వింటాలుకు పతనమైంది. ప్రస్తుతం నాణ్యమైన సరుకు రూ. 9400-9500 నుండి తగ్గి 7500-7700, నాసిరకం సరుకు రూ.6200-6500 కు పరిమితమైంది.ఈ ఏడాది పత్తి పంటకు పింక్ బోల్వార్మ్ సంక్రమించినందున సరుకు నాణ్యత కోల్పోవడమే కాకుండా దిగుబడులు కూడా క్షీణించాయి. మార్కెట్లో రాబడులు గత ఏడాదితో పోలిస్తే 50 శాతం మేర తగ్గాయి. పత్తి తన సహజత్వం కోల్పోయి పసుపు వర్ణంలోకి మారింది.పంజాబ్ పత్తి సేద్యం 3.04 ల.హె.కు విస్తరించింది. రాష్ట్రంలోని ఏడు జిల్లాల మార్కెట్లో డిసెంబర్ 1 వరకు పత్తి రాబడులు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 19.96 లక్షల క్వింటాళ్ల నుండి తగ్గి 9.20 లక్షల క్వింటాళ్లకు పరిమితమయ్యాయి.

Comments

Popular posts from this blog