పటిష్టంగా మినుముల ధరలు

 

09-01-2022

దేశంలో 7, జనవరి వరకు మినుము పంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 6.94 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 6.34 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణం గత ఏడాది మాదిరిగానే 2.68 లక్షల హెక్టార్లు, తమిళనాడులో 2.23 లక్షల హెక్టార్లు, ఒరిస్సాలో 44 వేల హెక్టార్లు తగ్గి కేవలం 99 వేల హెక్టార్లు ఉంది. లభించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం మినుమలు ఎక్కువగా ఉపయోగించే దక్షిణాది రాష్ట్రాలలో పొంగల్ గిరాకీ కారణంగా పప్పు ధరలు పెరిగాయి.


 అంతర్జాతీయ మార్కెట్లో మయన్మార్ ఎఫ్ఎక్యూ 10 డాలర్లు పెరిగి 805 డాలర్లు, ఎస్క్యూ 890 డాలర్లు ప్రతి టన్ను ప్రతిపాదించడంతో ముంబాయిలో ఎఫ్ఎక్యూ కొత్త రూ.100 పెరిగి రూ. 6600, పాత రూ. 6500, చెన్నైలో ఎస్క్యూ రూ.6800, ఎఫ్ ఎక్యూ రూ. 6300, ఢిల్లీలో ఎస్క్యూ రూ. 7150, ఎఫ్ఎక్యూ రూ. 6650-6675 మరియు కోల్కత్తాలో ఎఫ్ఎక్యూ రూ. 6450-6500 ధరతో వ్యాపారమయింది.


విజయవాడలో కృష్ణా జిల్లా పాలిష్ మినుములు రూ. 7000, సాదా రూ. 6800, నంద్యా లలో పాలిష్ రూ. 6900, సాదా రూ. 6700, ప్రొద్దుటూర, కడప ప్రాంతాలలో పాలిష్ రూ. 6800, సాదా రూ. 6600, విజయవాడలో గుండు పాలిష్ రూ.11700, పప్పు రూ. 8200–9200 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ 1400-1500 బస్తాల రాబడిపై రూ. 4400-7400, సోలాపూర్లో 3-4 లారీల కొత్త సరుకు రాబడిపై రూ. 5000-7300 లోకల్లూజు, అకోలాలో బిల్జీ రూ. 6500-6800, మినుములు మోగర్ బోల్డు రూ. 9900-10000, మీడియం రూ. 9500-9600 ధరతో వ్యాపారమయింది.


మధ్య ప్రదేశ్ లోని హరదా, జబల్పూర్, టికమ్డ్ ప్రాంతాలలో 4-5 వేల బస్తాల రాబడిపై రూ. 4000-5800 క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది. రాజస్తాన్లోని కేక్షి, సవాయిమదా పూర్, కోటా, సుమేర్పూర్ ప్రాంతాలలో 5-6 వేల బస్తాల రాబడిపై రూ. 5000-6500 ధరతో వ్యాపారమయింది.

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు