సరఫరా తగ్గే అంచనాతో పెరిగిన భారతీయ బియ్యం ధరలు

బెంగుళూరు - విస్తీర్ణం తగ్గినట్లు రిపోర్డు లభించిన నేపథ్యంలో కొత్త సీజన్లో సందేహాస్పద స్థితి ఉండడంతో భారతీయ బియ్యం ఎగుమతి ధరలు పెరిగాయి. అయితే వియత్నాం బియ్యం ధరలు అధికంగా ఉండడం, సరుకు నాణ్యంగా లేనందున ఎగుమతులు తగ్గాయి. ప్రముఖ ఎగుమతిదారులు 5 శాతం నూకలు గల పారాబాయిల్డ్ బియ్యం ధర ముందు వారంతో పోలిస్తే 360-366 డాలర్ల నుండి పెరిగి 365-371 డాలర్లు ప్రతి టన్నుకు చేరింది. దక్షిణ భారత ఎగుమతిదారుల కథనం ప్రకారం తూర్పు, ఉత్తర భారతాలలో వరి కోసం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు. దీనితో కొత్త సీజన్లో ఉత్పత్తి తగ్గే అవకాశం ఉండడంతో వ్యాపారులు అధిక ధరలను ప్రతిపాదిస్తున్నారు.