సరఫరా తగ్గే అంచనాతో పెరిగిన భారతీయ బియ్యం ధరలు

 


బెంగుళూరు - విస్తీర్ణం తగ్గినట్లు రిపోర్డు లభించిన నేపథ్యంలో కొత్త సీజన్లో సందేహాస్పద స్థితి ఉండడంతో భారతీయ బియ్యం ఎగుమతి ధరలు పెరిగాయి. అయితే వియత్నాం బియ్యం ధరలు అధికంగా ఉండడం, సరుకు నాణ్యంగా లేనందున ఎగుమతులు తగ్గాయి. ప్రముఖ ఎగుమతిదారులు 5 శాతం నూకలు గల పారాబాయిల్డ్ బియ్యం ధర ముందు వారంతో పోలిస్తే 360-366 డాలర్ల నుండి పెరిగి 365-371 డాలర్లు ప్రతి టన్నుకు చేరింది. దక్షిణ భారత ఎగుమతిదారుల కథనం ప్రకారం తూర్పు, ఉత్తర భారతాలలో వరి కోసం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు. దీనితో కొత్త సీజన్లో ఉత్పత్తి తగ్గే అవకాశం ఉండడంతో వ్యాపారులు అధిక ధరలను ప్రతిపాదిస్తున్నారు.


బంగ్లాదేశ్లో 50 లక్షల పేద కుటుంబాలకు చౌక ధరలతో బియ్యం అమ్మకాలు ప్రారంభం కాగలవు. మరియు స్థానిక మార్కెట్లో ధరల పెరుగుదలను అరికట్టడం కోసం సెప్టెంబర్ నుండి అమ్మకాలు ఉండగలవు. బంగ్లాదేశ్ ఆహార శాఖ మంత్రి కథనం ప్రకారరం సరుకు అమ్మకాలు ప్రారంభమైన తరువాత ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో 5 శాతం నూకలు గల వియత్నాం బియ్యం ధర 390-393 డాలర్లు ప్రతి టన్ను స్థాయిలో స్థిరంగా ఉంది. హోచిమిన్ సిటీ వ్యాపారుల కథనం ప్రకారం డిమాండ్ తగ్గడంతో పాటు యాసంగి సీజన్ పంట సరఫరా మెరుగ్గా ఉండడంతో వియత్నాం బియ్యం ధర థాయ్లాండ్ పోలిస్తే 420-428 డాలర్ల నుండి తగ్గి 416-420 డాలర్లు ప్రతి టన్నుకు చేరింది. అయితే ప్రముఖ ఎగుమతి మార్కెట్ గా ఉన్న చెనై, ఫిలిప్పిన్స్ల ద్వారా కొనుగోల్లు తగ్గాయి. ఫిలిప్పీన్స్ కొనుగోలుదారులు తక్కువ ధరతో బియ్యం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. యాసంగి పంట నాణ్యత తగ్గినందున కూడా ధరలపై ప్రభావం పడింది. షిప్రింగ్ ఖర్చులు తగ్గినప్పటికీ, పెద్ద ఆర్డర్లు లభించడం లేదు. అయితే, స్థానిక వ్యాపారం వలన థాయ్లాండ్ మార్కెట్లో ధరలకు మద్దతు లభించింది.

Comments

Popular posts from this blog