Posts

Showing posts with the label Coconut

కొబ్బరి ధరలపై ఆశలు లేనట్లే

Image
  దేశంలో పితృ పక్షం ముగిసింది. దసరా, దీపావళి పండుగల కోసం దక్షిణాది రాష్ట్రాలలో కొబ్బరి,కొబ్బరికాయల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే ఈసారి చెప్పుకోదగ్గ స్థాయిలో కొనుగోళ్లు లేవని చెప్పవచ్చు. ఎందుకనగా ఈ ఏడాది కొత్త సీజన్లో ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులు ముందస్తుగానే భారీగా సరుకు కొనుగోలు చేయడమే ఇందుకు నిదర్శనం. అటు తర్వాత ధరలు దిగ జారుతున్నందున సరుకు కొనుగోలుకు బదులు విక్రయించేందుకు దృష్టి సారిస్తున్నారు. ఉత్పాదక రాష్ట్రాలలోని రైతులు కూడా తమ సరుకు విక్రయించేందుకు ఆసక్తి కనబరచడంలేదు. కావున 2022-23 సీజన్ పర్యంతం కొనుగోళ్లకు అనుగుణంగా సరుకు సరఫరా అయ్యే అవకాశం కనిపిస్తున్నది. కేవలం 5-10 శాతం లాభంతో క్రయ విక్రయాలు జరిగే అవకాశం ఉంది.

ఉత్పత్తి పెరగడంతో తగ్గిన కొబ్బరి ధరలు

Image
   లభించిన సమాచారం ప్రకారం పండుగల సీజన్ ఉన్నప్పటికీ డిమాండ్ తక్కువగా ఉండడంతో కొబ్బరి ధరలు మందకొడిగా ఉన్నాయి. -వ్యాపారస్తుల కథనం ప్రకారం దక్షిణ భారత ఉత్పాదక కేంద్రాలలో రైతులవద్ద 2021 మరియు 2022 సంవత్సరాల మిగులు నిల్వలు ఉన్నాయి మరియు రాబోవు ఉత్పత్తి కూడా పెరిగే అంచనా కలదు. దీనితో నూనె తయారీ యూనిట్లు సరుకు నిల్వచేయడానికి ఆసక్తి చూపడం లేదు.

కొబ్బరికాయలు - కొబ్బరిలో పెరుగుదలకు అవకాశం లేదు

Image
  కొచ్చి- దక్షిణ భారతంలో ఉత్పత్తి పెరిగిన నేపథ్యంలో మార్కెట్లో రాబడులు పెరగడంతో రాబోవు ఓనం సహా అన్ని పండుగల కోసం కొబ్బరినూనె ధరలు పెరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి మరియు భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశాలు కనిపించడంలేదు.

స్థిరత్వం చేకూరిన కొబ్బరి ధరలు

Image
   ఆంధ్రప్రదేశ్లోని అంబాజీపేటలో గత వారం స్థానికంగా నాణ్యమైన కొబ్బరి రూ. 8500-9000, మీడియం సరుకు రూ.7000-7500, యావరేజ్ కు రూ. 6800-7000 మరియు 8-9 వాహనాల: కొబ్బరికాయలు నాణ్యమైన సరుకు ప్రతి 1000 కాయలు రూ. 8500-9000, మీడియం రూ. 7900-8000, పాత సరుకు రూ.9000-9500, మీడియం రూ. 8000-8500, యావరేజ్ రూ. 7000-7500 ధరతో వ్యాపారమైంది. పాలకొల్లులో ప్రతీ రోజు 18-20 వాహనాల కొబ్బరికాయల రాబడిపై నాణ్యమైన కొత్త సరుకు పెద్ద సైజు కాయలు రూ.9000, మీడియం రూ. 5. యావరేజ్ రూ. 6000-6500, పాత సరుకు పెద్ద సైజు కాయలు రూ. 10,000, మీడియం రూ.9500, యావరేజ్ సరుకు రూ. 7000-7500 ప్రతి 1000 కాయల ధరతో వ్యాపారమైంది.

కొబ్బరి

Image
  ఆంధ్రప్రదేశ్లోని అంబాజీపేటలో గత వారం 8-10 వాహనాల కొబ్బరి రాబడిపై స్థానికంగా రూ. 8300-8400, మీడియం రూ.7800-7900, యావరేజ్ సరుకు రూ. 6900 మరియు 10-12 వాహనాలు కొబ్బరికాయలు నాణ్యమైన సరుకు ప్రతి 1000 కాయలు రూ. 7900-8000, మీడియం రూ. 7200-7400, పాత సరుకు రూ.8800-8900, మీడియం రూ.8300-8400 మరియు పాలకొల్లులో ప్రతి రోజు 25-30 వాహనాలు పెద్ద కాయలు రూ. 9800-9000, మీడియం రూ. 7500-8000, యావరేజ్ సరుకు రూ.5600-8000, పాత సరుకు రూ. 9400, మీడియం రూ.8500-8600, యావరేజ్ సరుకు రూ. 8900–7000 ధరతో మహారాష్ట్ర, రాజస్తాన్ కోసం రవాణా అవుతున్నది. తమిళనాడులోని వెల్లకోవిల్, జలకందాపురం, అన్నామలై, బోతపాడి, కొడుముడి ప్రాంతాలలో గత వారం కేవలం 5 వేల బస్తాల కొబ్బరి రాబడిపై రూ.8300–8760, పెరుందురైలో 8 వేల బస్తాలు రూ. 8656-8935 ప్రతి క్వింటాలుధరతో వ్యాపారమైంది.

కొబ్బరి ధరలు పెరిగే అవకాశం లేదు?

Image
   వ్యాపారస్తుల కథనం ప్రకారం ఈ ఏడాది దక్షిణాది రాష్ట్రాలలో కొబ్బరి పంట ఉత్పత్తి భారీగా పెరగడంతో పాటు మార్చి వరకు పాత నిరవధికంగా సరఫరా కావడంతో మరియు తమిళనాడు, కేరళలలో రాబ డులు పెరగడంతో పాటు ఏడాది పొడగునా సరఫరా ఉండడంతో పెద్ద కంపెనీల కొనుగోళ్లు తగ్గడంతో కొబ్బరి ధరలు పెరగడం లేదు.

కొబ్బరికి తగ్గిన గిరాకి

Image
  ఉగాది మరియు రామనవమి కోసం వ్యాపారుల కొనుగోళ్లు సమాప్తం కావడంతో ధరలు స్థిరంగా ఉన్నాయి. మరియు ధరలు పెరిగే అవకాశం కనిపించడం లేదు. ఎందుకనగా రాబడులతో పోలిస్తే వినియోగం తక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని అంబాజిపేటలో గత వారం 500-600 బస్తాల కొబ్బరి రాబడిపై ఎక్సో పోర్ట్ రకం రూ. 9500-10,000, మీడియం రూ. 8200- 8500, యావరేజ్ రూ. 7600-8000 మరియు ప్రతి రోజు 20-30 వాహనాల కొబ్బరికాయలు రాబడి కాగా, పాత సరుకు రూ. 9000, మీడియం రూ. 7900-8000, యావరేజ్ రూ. 6000-6750, మరియు మిల్లింగ్ రకం రూ. 8500-9000, ఎండు సరుకు రూ. 11,500–12,000 ధరతో వ్యాపారమైంది.

పెరిగిన కొబ్బరి సరఫరా

Image
  దేశంలో ప్రస్తుతం హోళి పండుగ డిమాండ్ తగ్గి, రాబోవు ఉగాది పండుగ కోసం ఎడ్వాన్స్ కొబ్బరి కాయలు కొబ్బరి కొనుగోలు చేశారు. తద్వారా డిమాండ్ కొరవడడంతో ధరలు స్థిరంగా మారాయి. ఈ ఏడాది ఉత్పత్తి అధికంగా ఉండడంతో పాటు ఇంతవరకు పాత సరుకు సప్లై కొనసాగుతున్నట్లు సమాచారం. దీనితో ధరలు నిలకడగా ఉన్నాయి.

ఉత్పత్తి పెరిగినప్పటికీ దిగిరాని కొబ్బరి ధరలు

Image
 రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో సన్ ఫ్లవర్ నూనె, పామాయిల్ పాటు అన్ని వంటనూనెల ధరలు నింగికెగిసి పడుతున్నందున ఈ ప్రభావం కొబ్బరినూనెపై ఉండగలదని ఆయిల్ మర్చంట్స్ అసోసియేషన్ ఆశాభావం వ్యక్తం చేసింది. గత ఏడాది కొబ్బరినూనె ధరలు బలోపేతం చెందినందున వినియోగదారులు చౌకరకం నూనెల వినియోగానికి మొగ్గు చూపారు. ప్రస్తుతం అన్ని వంటనూనెల ధరలు చుక్కలు చూపిస్తున్నందున కొబ్బరినూనె వినియోగం పెరగడంతో పాటు ధరలు కూడా ఇనుమడించగలవని వ్యాపారులు భావిస్తున్నారు.

కొబ్బరికాయలకు కొనుగోలు తాకిడి

Image
   దేశంలో కరోనా మహమ్మారి నుండి ఉపశమనం లభించినప్పటి నుండి దేవాలయాలలో అర్చనలు, పూజాధికాలు పునరుద్ధరించబడిన తర్వాత కొబ్బరికాయలు కొనుగోళ్లు జోరందుకున్నాయి. శివరాత్రి మరియు హోళీ పండుగను పురస్కరించుకొని కొబ్బరి మరియు కొబ్బరికాయలకు గిరాకీ నెలకొన్నది.

కొబ్బరి

Image
  15-02-2022 రాబోవు మహాశివరాత్రి మరియు హోళీ పండుగల కోసం డిమాండ్ రావడంతో ధర రూ. 400-500 పెరిగింది. అంబాజీపేటలో వారంలో 60-70 టన్నుల రాబడిపై ఎక్స్పోర్ట్ రకం రూ. 9000-9800, మీడియం రూ. 8200-8600, యావరేజ్ రూ. 7800-8000, పాలకొల్లులో దినసరి 35-40 లారీల కాయల బడి నా రాబడిపై నాణ్యమైన పాత కాయలు రూ. 9500, మీడియం రూ. 7500-8000, యావరేజూ. 6000-6400, కొత్త కాయలు నాణ్యమైన సరుకు రూ. 10500, 8500( సతి 100 ) మీడియం రూ. 9000-9200, యావరేజ్ రూ. 8500 ( ప్రతి 1000 కాయలు ) ధరతో వ్యాపారమయింది.

ఇనుమడించిన ఉత్పత్తితో పురోగమించని కొబ్బరి ధరలు

Image
  01-02-2022  ఈ ఏడాది గణనీయంగా కొబ్బరి ఉత్పత్తితో పాటు ఉత్పాదక కేంద్రాలు మరియు కిరాణా వ్యాపారుల వద్ద పాత సరుకు నిల్వలు అమ్మకం కాకుండా మూలుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ పాత సరుకు సరఫరా కొనసాగుతున్నందున ధరలు పురోగమించడంలేదు. అంతేకాకుండా, మార్చిలో రాబడులు పోటెత్తుతున్న తరుణంలో ధరలు మరింత దిగజారగలవని స్పష్టమవుతున్నది. దేశంలోని వినియోగ రాష్ట్రాలలో కిరాణా వ్యాపారులు ఈసారి సరుకు నిల్వ చేసేందుకు ఆసక్తి కనబరచడంలేదు.