లభించిన సమాచారం ప్రకారం పండుగల సీజన్ ఉన్నప్పటికీ డిమాండ్ తక్కువగా ఉండడంతో కొబ్బరి ధరలు మందకొడిగా ఉన్నాయి. -వ్యాపారస్తుల కథనం ప్రకారం దక్షిణ భారత ఉత్పాదక కేంద్రాలలో రైతులవద్ద 2021 మరియు 2022 సంవత్సరాల మిగులు నిల్వలు ఉన్నాయి మరియు రాబోవు ఉత్పత్తి కూడా పెరిగే అంచనా కలదు. దీనితో నూనె తయారీ యూనిట్లు సరుకు నిల్వచేయడానికి ఆసక్తి చూపడం లేదు.
గతవారం అంబాజీపేటలో 6-7 లారీల రాబడి పె స్థానికంగా నాణ్యమైన సరుకు కొబ్బరి రూ. 8400-8500, మీడియం రూ. 7900-8000, యావ రేజ్ రూ. 6500-6600 మరియు 10 లారీల కొబ్బరికాయల రాబడిపె నాణ్యమైన సరుకు కొత్త రూ. 8000, మీడియం రూ. 7500, పాత రూ. 9500-9600, మీడియం రూ. 8500-900, యావరేజ్ రూ. 7000-7500 మరియు పాలకొల్లులో దినసరి 25-30 లారీల కొబ్బరికాయల రాబడిపె కొత్త పెద్ద కాయలు రూ. 9400-9600, మీడియం రూ. 8400-8500, యావ రేజ్ రూ. 6900-7000 మరియు పాత పెద్ద కాయలు రూ. 10450, మీడియం రూ. 8050, యావరేజ్ రూ. 6100 ధరతో వ్యాపారమె మహారాష్ట్ర, రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్ల కోసం రవాణా అవుతున్నది.
కర్నాటకలోని టిప్టూరులో వారంలో 3-4 వేల బస్తాలు, తుమ్కూరు, అరిసె కేరి, మంగనూరు, సీ ఆర్ పట్నం ప్రాంతాలలో 2-3 వేల బస్తాల రాబడిపె రూ. 13000-14000, మీడియం రూ. 11500-12000, ఎడిబుల్ రూ. 10100-10200, మెరికొ రూ. 7900 -8000, మీడియం రూ. 7300-7500, యావరేజ్ రూ. 5800-6000, బాల్ కొబ్బరి రూ. 13800-14000 ధరతో వ్యాపారమయింది. తమిళనాడులోని వెల్లకోవిల్, జల కందరం, అన్నామల్కె బొతప్పాడి, కొడుముడి, ఎలమత్తూరు ప్రాంతాలలో సంత రోజు కేవలం 6-7 వేల బస్తాల రాబడిపె రూ. 7600-8240, పెరుందరెల్లో 8-10 వేల బస్తాల రాబడిపె రూ. 8090-8250 ధరతో వ్యాపారమయింది. కేరళలోని కాలకట్ లో కొబ్బరి రూ. 8550, రాశీ రూ. 8150, దిల్ పసంద్ రూ. 8600, రాజాపురి కొబ్బరి రూ. 13,100, మిల్లింగ్ రూ. 8850, బాల్ కొబ్బరి రూ. 11300, దిల్ పసంద్ రూ. 8750, రాశీ రూ. 8250 మరియు కాంగేయంలో సాదా రూ. 7600, స్పెషల్ రకం రూ. 7600-7700, మెరికొ రూ. 7700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమయింది. కాంగేయం, ఊటుకులి లలో రూ. 1730-1750 ప్రతి 15 కిలోల డబ్బా ధరతో వ్యాపారమయింది.
09-01-2022 7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు