రాబడులు అదుపు చేయడంతో పురోగమిస్తోన్న యాలకుల ధరలు
20-02-2022 భారతదేశంలో ఫిబ్రవరి మొదలుకొని ఆరు నెలల పాటు సంతృప్తికరమైన వర్షాలు కురవగలవని దక్షిణ కొరియా వాతావరణం శాఖ పేర్కొన్నది. వాతావరణం కూడా సానుకూలంగా పరిణమించండంతో పాటు ఈ ఏడాది వసంతకాలం మరియు గ్రీష్మకాలంలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లోని ప్రథమార్ధంలో రెండు నెలలు (జూన్-జూలై) వరకు సాధారణంతో పోలిస్తే అధిక వర్షపాతం నమోదు కాగలదని దక్షిణ కొరియాకు చెందిన వాతావరణ శాఖ ఎపిఇసి పేర్కొన్నది. కావున ఈసారి కూడా కేరళలో యాలకుల ఉత్పత్తి సమృద్ధిగా రాణించే అవకాశం ఉన్నందున మరియు భారీగా పేరుకుపోయిన పాత నిల్వలను దృష్టిలో పెట్టుకొని ధరలు ఇనుమడించే అవకాశం కనిపించడంలేదు.