రాబడులు అదుపు చేయడంతో పురోగమిస్తోన్న యాలకుల ధరలు

 


20-02-2022

భారతదేశంలో ఫిబ్రవరి మొదలుకొని ఆరు నెలల పాటు సంతృప్తికరమైన వర్షాలు కురవగలవని దక్షిణ కొరియా వాతావరణం శాఖ పేర్కొన్నది. వాతావరణం కూడా సానుకూలంగా పరిణమించండంతో పాటు ఈ ఏడాది వసంతకాలం మరియు గ్రీష్మకాలంలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లోని ప్రథమార్ధంలో రెండు నెలలు (జూన్-జూలై) వరకు సాధారణంతో పోలిస్తే అధిక వర్షపాతం నమోదు కాగలదని దక్షిణ కొరియాకు చెందిన వాతావరణ శాఖ ఎపిఇసి పేర్కొన్నది. కావున ఈసారి కూడా కేరళలో యాలకుల ఉత్పత్తి సమృద్ధిగా రాణించే అవకాశం ఉన్నందున మరియు భారీగా పేరుకుపోయిన పాత నిల్వలను దృష్టిలో పెట్టుకొని ధరలు ఇనుమడించే అవకాశం కనిపించడంలేదు.





జనవరి మొదటి వారంలో పుట్టాడిలోని మసాలా పార్కు వద్ద నిర్వహించిన వేలంలో యాలకులు ప్రతి కిలో ధర రూ. 756 అధిగమించకపోవడం గమనార్హం. దీనిని దృష్టిలో పెట్టుకొని ఉత్పాదకులలోని ఒక వర్గం పతనమవుతున్న యాలకుల ధరలను మసాలా బోర్డు అధికారుల దృష్టికితీసుకెళ్లారు. ధరలు పతనాన్ని అరికట్టాలని కోరారు. ఫలితంగా జనవరి 19న ఉత్పాదకులు మరియు విక్రేతలతో  సమావేశం ఏర్పాటు చేసేందుకు మసాలా బోర్డు ఉపక్రమించింది.

ఈ సమావేశంలో ఒక వేలంలో ఒక ఏజెన్సీ 65 వేల కిలోలకు మించి  విక్రయించకూడదని మసాలా బోర్డు ఆదేశించింది. అంతేకాకుండా అందులో ఉత్పాదుకుల సరుకు 70 శాతం ఉండాలని పేర్కొన్నది. ఈ పరిణామంతో ధర ప్రతి కిలోకు దాదాపు రూ.150 పురోగమించి సోమవారం సగటు ధర రూ. 985 కు ఎగబాకింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అత్యధిక గరిష్ఠ ధర చెప్పబడుచున్నది. అయితే, అటు తర్వాత రూ. 25-50 హెచ్చు తగ్గుల మధ్య కదలాడింది.


దేశంలోని ఇతర రాష్ట్రాల దిగ్గజ వ్యాపారులు సరుకు నిల్వ చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈసారి గ్వాటేమాలలో ఉత్పత్తి సంతృప్తికరంగా రాణిస్తుండడమే ఇందుకు నిదర్శనం. గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా చౌక ధరతో నేపాల్ మార్గాన సరుకు దిగుమతి కాగలదు. దక్షిణాదిలో ఇప్పటి వరకు అమ్మకం కాకుండా మూలుగుతున్న పాతసరుకు, ఈ ఏడాది ఇనుమడిస్తున్న ఉత్పత్తి మరియు రాబోయే సీజన్లో కూడా సానుకూలంగా పరిణమిస్తున్నందున భారీగా సరుకు నిల్వ చేసిన వ్యాపారులు నష్టాలను మూటగట్టుకోవడం తథ్యమని స్పష్టమవుతున్నది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు