రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
దీపావళి పండుగ కోసం దాదాపు ఒక నెల రోజుల గడువు మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితిలో సరుకు విక్రయాలు ఆశించినంతగా ఉండవని స్పష్టమవుతున్నది. రాబోయే ఉత్పత్తి గణనీయంగా ఉండగలదని అప్పుడే సంకేతాలు అందడం ప్రారంభమైంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ శనగ సేద్యం భారీగా వృద్ధి చెందడం తథ్యం. ఎందుకనగా, సమృద్ధిగా వర్షాలు కురిసినందున నేలలో నిక్షిప్తమైన తేమ, పెల్లుబికిన భూగర్భజలాలు యాసంగిలో శనగ సేద్యానికి బదులు స్వల్పకాల పంటలు చేపట్టే అవకాశం కనిపించకపోవడమే ఇందుకు నిదర్శనం.
గత వారం స్థానిక బేసన్ తయారీదారుల కొనుగోళ్లు మందగించినందున శనగల ధర రూ. 100 మరియు కాబూలీ శనగలు రూ. 200-250 ప్రతి క్వింటాలుకు పతనమైంది. ఎన్సీడిఇఎక్స్ వద్ద గత సోమవారం సెప్టెంబర్ వాయిదా రూ. 5160 తో ప్రారంభమై సాయంత్రం వరకు హెచ్చు తగ్గుల మధ్య రూ. 5160 వద్ద ముగిసింది. అక్టోబర్ వాయిదా సోమవారం రూ.5160 తో మొదలుపెట్టి అటు పిదప శుక్రవారం వరకు రూ. 80 వృద్ధి చెంది రూ. 5240 వద్ద ముగిసింది.
ముంబైలో టాంజానియా నుండి దిగుమతి అయిన శనగలు ప్రత్యక్ష విపణిలో రూ. 200 తగ్గి రూ. 4950-5125, రష్యా కాబూలీ శనగలు రూ. 4950, సూడాన్ కాబూలీ రూ.5500-5650 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
దిల్లీ లారెన్స్ రోడ్లో గత వారం 100-110 వాహనాల శనగల రాబడిపై రాజస్తాన్ సరుకు రూ. 5375-5400, మధ్య ప్రదేశ్ ప్రాంతపు సరుకు రూ. రూ. 5300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారం కాగా, కనీస మద్దతు ధరతో పోలిస్తే అధికమని చెప్పబడుచున్నది.
ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్ ప్రాంతాల శనగలు ఈరోడ్ డెలివరి రూ. 5500-5550, కర్ణాటకలోని రాయిచూర్, గదగ్ ప్రాంతాల సరుకు రూ. 5600, ట్యుటికోరిన్ ఓడరేవు వద్ద టాంజానియా నుండి దిగుమతి అయిన శనగలు రూ. 5300 ధరతో వ్యాపారమైంది.
లాతూర్లో అన్నిగిరి మరియు విజయ శనగలు రూ. 5000-5200, అమరావతిలో రూ. 4800-4950, వాషింలో రూ. 5000-5150 లోకల్ లూజ్ మరియు అలా లారీ బిల్టి రూ. 5275-5325 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపార మైంది.
మధ్య ప్రదేశ్ లోని దమోహ్, దేవాస్, హర్దా, జబల్పూర్ ప్రాంతాలలో రూ. 4800-5300,
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు