రబీ వరిలో విత్తనాల ఎంపిక - దిగుబడి పెంచే సూచనలు
09-10-2021 తెలుగు రాష్ట్రాల్లో 60 శాతానికి పైగా రైతాంగం వరి పంటనే ప్రధాన ఖరీఫ్, రబీలలో పండిస్తారు. ఖరీఫ్ తో పోల్చితే రబీలో నీటివనరులు తక్కువగా ఉండటం, నిర్దిష్ట వాతావరణ పరిస్థితులుండటం, స్వల్పకాలంలోనే అధిక దిగుబడులు సాధించడం జరుగుతుంది. ఒక వరి రకం పూర్తిస్థాయి దిగుబడులు సాధించే అవకాశం రబీలోనే ఉంటుంది. రబీలో 50-60 బస్తాల దిగుబడులు సాధిస్తున్నప్పటికీ సకాలంలో సరైన యాజమాన్య పద్ధతులను అవలంబిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు ఏ రకంగా సాధించవచ్చో తెలుసుకుందాం.