లభించిన సమాచారం ప్రకారం గత వారం మధ్య ప్రదేశ్, రాజస్థాన్లలోని కొన్ని ప్రాంతాలలో వర్షాల వలన పంటకు కొంత మేర నష్టం వాటిల్లింది. విస్తీర్ణం తగ్గిన నేపథ్యంలో ఉత్పత్తి తగ్గడంతో ఇంతవరకు రాబడులు పెరగడం లేదు. స్టాకిస్టుల కొనుగోళ్లతో సీజన్ ప్రారంభం నుండే ధరలు హెచ్చుముఖంలో ఉన్నాయి. గుజరాత్లోని అన్ని మార్కెట్లలో కలిసి 12 లక్షల బస్తాలకు పైగా కొత్తసరుకు రాబడి కాగా, మరో 30-32 లక్షల బస్తాల సరుకు రాబడి అయ్యే అవకాశం ఉంది. స్టాకిస్టుల పాత సరుకు అమ్మకాలు తగ్గాయి. మధ్య ప్రదేశ్లోని గునా ప్రాంతంలో నిల్వ అయిన పాత నాణ్యమైన మిషన్ లారీబిల్టీ రూ. 10,600-10,700, కొత్త సరుకు రూ. 11,500–11,700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర ప్రాంతాల కోసం రవాణా అవుతున్నది.