ధనియాల ధరలకు లభిస్తున్న మద్దతు

 


 శ్రీక్రిష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా కొనుగోళ్లు నెలకొన్నందున ధనియాల ధరలు గత సోమవారం నుండి శుక్రవారం వరకు రూ.100-150 ప్రతి క్వింటాలుకు వృద్ధి చెందగా శనివారం కొంతమేర శాంతించాయి. 


గత సోమవారం ఎన్సీడిఇఎక్స్ వద్ద ధనియాల ఆగస్టు వాయిదా రూ.1,554 ప్రారంభమై శుక్రవారం నాటికి రూ.76 లాభంతో రూ.11,630, సెప్టెంబర్ వాయిదా రూ. 212 పెరిగి రూ. 11,822 వద్ద ముగిసింది. 

రాజస్తాన్లోని రాంగంజ్మండీ వారాంతపు సంతలో 4-5 వేల బస్తాల రాబడి పై బాదామీ రూ. 10,200 -10, 300, ఈగల్ రూ. 10,500-10,800, కోటాలో 2-3 వేల బస్తాలు బాదామీ రూ. 10,100-10,300, ఈగల్ రూ. 10,400–10,600, భవానీమండీ, ఛబ్జా, ఇటావా మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి 2 వేల బస్తాలు బాదామీ రూ. 10,200-10,300, ఈగల్ రూ. 10,700-10,900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

మధ్య ప్రదేశ్లోని గునాలో 1500 బస్తాలు. బాదామీ రూ. 9600-10,500, ఈగల్ నాణ్యమైన సరుకు రూ. 11,000-11,700, మీడియం రూ. 10,400-10,600, కుంభరాజ్ 600-700 బస్తాలు బాదామీ రూ. 10,200- 10,500, ఈగల్ రూ. 10,600–10,800, స్కూటర్ రకం రూ. 11,500- 11,900, శ్యామ్ గఢ్, మధుసూదన్ గఢ్, నిమచ్, మందసోర్, జావ్రా ప్రాంతాలలో కలిసి 2 వేల బస్తాలు బాదామీ రూ. 10,500-10,600, ఈగల్ రూ. 10,700- 11,400, స్కూటర్ రకం రూ. 11,500-11,800 ధరతో నాణ్యతానుసారం వ్యాపారమైంది. 

స్వాతంత్ర్య దినోత్సవం మరియు శ్రీక్రిష్ణ జన్మాష్టమి పండుగల సందర్భంగా గుజరాత్ మార్కెట్లలో వ్యాపార లావాదేవీలు చెప్పుకోదగ్గ స్థాయిలో జరగలేదు. ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలులో బాదామీ ధనియాలు ప్రతి 40 కిలోలు రూ. 5350, ఈగల్ కొత్త సరుకు రూ. 5425, స్కూటర్ రకం రూ.5575, ఎసి సరుకు రూ. 5300 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog