Posts

Showing posts from May, 2022

మినుములు స్థిరం

Image
  యాసంగి సీజన్ మినుము పంట విస్తీర్ణం పెరగడంతో మరియు ప్రస్తుతం ఆంధ్ర రబీ సీజన్ సరుకు సరఫరా అవుతున్నందున ధరలు పెరగడానికి బలం చేకూరడంలేదు. త్వరలో యాసంగి మినుముల సరఫరా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున పెద్ద స్టాకిస్టులు బయటపడు తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. సరుకు స్థానిక పప్పు మిల్లులకు సరఫరా అవుతున్నది. గత రెండేళ్లుగా ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుండి మినుములలో పెరుగుదల మరియు సీజన్ సమాప్తమైన తరువాత మందకొడి కారణంగా రాబోవు కొత్త సీజన్లో స్టాకిస్టులు తగ్గవచ్చు. 

రికార్డు స్థాయిలో పెసర సాగు - ధరలకు కళ్లెం

Image
  దేశంలో రికార్డు స్థాయిలో పెసర సాగు కావడంతో అంతర్జా తీయ మార్కెట్లో ధర 110 డాలర్లు ప్రతి టన్నుకు పెరిగినప్పటికీ, దేశీయ మార్కెట్లో ఎలాంటి ప్రభావం లేదు. భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం కూడా కనిపించడం లేదు. పెసర పంట విస్తీర్ణం పెరగడంతో 6, మే వరకు దేశంలో యాసంగి అపరాల విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 18.4 శాతం పెరిగి 20.38 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో పెసర పంట విస్తీర్ణం 14.24 ల.హె. నుండి పెరిగి 16.25 ల.హె.లకు చేరింది. మధ్య ప్రదేశ్ ఎక్కువ విస్తీర్ణం పెరిగింది. ఎందుకనగా గత ఏడాది రైతులకు మద్దతు ధరకంటే అధిక ధర లభించింది. ఈ ఏడాది ధరలు ఎక్కువగా పెరిగే అవకాశం లేదు.

తగ్గిన చింతపండు రాబడులు

Image
  వ్యాపారస్తుల కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహా రాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఛత్తీసడ్ మరియు గుజరాత్లలో చింత పండు సీజన్ చరమాంకానికి చేరింది. తద్వారా రాబడులు తగ్గుముఖం పట్టాయి. తీవ్ర వేసవి తాపం కారణంగా సరుకు నాణ్యత లోపించి రంగు వెలవడంతో ధర లపై ప్రభావం పొడసూపుతున్నది. 

బెల్లానికి కొరవడిన గిరాకీ - ధరలలో మందగమనం

Image
  వ్యాపారస్తుల కథనం ప్రకారం ఈ ఏడాది వర్షాలు సమయానికి వచ్చే అవకాశం ఉంది. మే చివరి వారం నాటికి వివాహాల సీజన్ సమాప్త మయ్యే అవకాశం కలదు. ముజఫర్ నగర్ కోల్డ్ స్టోరేజీల నుండి సరుకు రవాణా ప్రారంభమయ్యే అవకాశం కలదు. దీనితో ఇతర రాష్ట్రాల స్టాకిస్టులు బయట పడే అవకాశం కలదు. ఎందుకనగా ఇంతవరకు మహారాష్ట్రలో బెల్లం తయారీ అవుతున్నది. మహారాష్ట్రలో వారంలో సుమారు 75-80 లారీల సరుకు రాబడి అవుతుండగా, పౌడర్ యూనిట్ల సరఫరా పెరుగుతున్నది. 

పసుపులో కొనసాగుతున్న మందగమనం

Image
  గత వారం వినియోగ కేంద్రాలలో డిమాండ్ తగ్గడం మరియు వాయిదా ధరలు రూ. 250-300 తగ్గడంతో పాటు మర ఆడించే యూనిట్ల కొనుగోళ్లు లేనందున ధరలు రూ. 300-400 క్షీణించాయి. నిజామాబాద్ మార్కెట్లో రాబడులు తగ్గుముఖం పట్టాయి. ఎన్ సి డి ఇ ఎక్స్ వద్ద గత సోమవారం మే వాయిదా రూ.8480 తో ప్రారంభమై తరువాత శుక్రవారం వరకు రూ. 296 క్షీణించి రూ. 8184, జూన్ వాయిదా రూ.254 తగ్గి రూ. 8308 వద్ద ముగిసింది.

మే 16 నుండి గుంటూరు మిర్చి యార్డుకు వేసవి సెలవులు

Image
  ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వేసవితాపం కారణంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా 16 మే సోమవారం నుండి జూన్ 12 ఆదివారం వరకు అధికారులు వేసవి సెలవులు ప్రకటించారు. తద్వారా రైతుల సరుకు రాబడులు మరియు లోడింగ్- అన్లోడింగ్ లాంటివి ఉండబోవు. గుంటూరులో గత వారం 4 రోజుల లావాదేవీలలో 3 లక్షల బస్తాల మిరప రాబడి కాగా, 15-20 శాతం నాణ్యమైన మరియు 80 శాతం మీడియం, మీడియం బెస్ట్ రకాలు ఉండగా, 2.90 లక్షల బస్తాల సరుకు అమ్మకం అయింది. డీలక్స్ రకాలకు మండి డిమాండ్ ఉన్నప్పటికీ, క్వాలిటీ లేకపోవడంతో పాటు మీడియం, మీడియం బెస్ట్ రకా లలో రూ. 500-1000 ప్రతి క్వింటాలుకు తగ్గి నాణ్యతనుసారం వ్యాపారం అయింది.లభించిన సమాచారం ప్రకారం ప్రతి ఏడాది చివరి విడత మిర్చి పంట కోతలకు బదులు చెట్లమీదనే వదిలివేస్తుండేవారు. ఎందుకనగా మంచి ధర లభించ కపోవడంతో పాటు కూలీల వ్యయం భరించాల్సి వచ్చేది. కాని ప్రస్తుతం పెరుగుతున్న ధరలను పరిగణిస్తూ, చివరి పంట కోతలు కూడా పూర్తి చేసి సరుకు మార్కెట్లలో అమ్మకానికి తేవడం జరుగుతున్నది. కాబట్టి వచ్చే వారం రాబడులు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని కందుకూరు,పొదిలి పరిసర ప్రాంతాల నుండి తేజ, 341 రకాల