రికార్డు స్థాయిలో పెసర సాగు - ధరలకు కళ్లెం

 

దేశంలో రికార్డు స్థాయిలో పెసర సాగు కావడంతో అంతర్జా తీయ మార్కెట్లో ధర 110 డాలర్లు ప్రతి టన్నుకు పెరిగినప్పటికీ, దేశీయ మార్కెట్లో ఎలాంటి ప్రభావం లేదు. భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం కూడా కనిపించడం లేదు. పెసర పంట విస్తీర్ణం పెరగడంతో 6, మే వరకు దేశంలో యాసంగి అపరాల విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 18.4 శాతం పెరిగి 20.38 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో పెసర పంట విస్తీర్ణం 14.24 ల.హె. నుండి పెరిగి 16.25 ల.హె.లకు చేరింది. మధ్య ప్రదేశ్ ఎక్కువ విస్తీర్ణం పెరిగింది. ఎందుకనగా గత ఏడాది రైతులకు మద్దతు ధరకంటే అధిక ధర లభించింది. ఈ ఏడాది ధరలు ఎక్కువగా పెరిగే అవకాశం లేదు.


 ఎందుకనగా పంజాబ్ ప్రభుత్వం కూడా యాసంగి సీజన్తో పాటు ఖరీఫ్ సీజన్లో ఉత్పత్తి పెరగడం కోసం మద్దతు ధర లను హామీ ఇస్తున్నది. గత యాసంగి, ఖరీఫ్ సీజన్లలో విస్తీర్ణం కేవలం 5 వేల హెక్టార్లు (12 వేల ఎకరాలు) ఉండగా, ఈ సారి ఏప్రిల్ 2 వరకు విస్తీర్ణం 3 వేల హెక్టార్లు ఉంది. రైతులు 10 మే, 15 లేదా 20 మే నెల వరకు పెసర సాగు చేస్తే 55 రోజులలో అనగా 10-20 జూలై మధ్యకాలంలో పంట కోతకు వస్తున్నది. ఈ పంటను మద్దతు ధరతో కొనుగోలు చేయబడునని ప్రకటించడం జరిగింది. ఎందుకనగా రాష్ట్ర ప్రభుత్వం కనీసం 50 వేల ఎకరాలలో పంట సాగును అంచనా వేస్తున్నది. ఈ ఏడాది ఖరీఫ్ పంజాబ్ రైతులు, లూదియానాలో పంజాబ్ వ్యవసాయ విశ్వ విద్యాలయం అభివృద్ధి పరిచిన పిఆర్ 126 వంగడాలను ఎక్కు వగా కొనుగోలు చేస్తున్నారు.


మే చివరి వారం నుండి అన్ని ఉత్పాదక రాష్ట్రాలలో సరఫరా ప్రారంభమై ఖరీఫ్ సీజన్ ప్రారంభం వరకు కొనసాగే అవకాశం ఉన్నందున ధరలు ఎక్కువగా పెరిగే అవకాశం లేదు. మధ్య ప్రదేశ్ సరుకు దిల్లీ, కాన్పూర్, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కోసం సరఫరా ఉండగలదు. ఇదే విధంగా పంజాబ్, బిహార్ సరుకు దిల్లీ, హర్యాణాకు, గుజరాత్ సరుకు స్థానిక పప్పు మిల్లులకు అమ్మకం కాగలదు. ఒడీషా సరుకు కొల్కత్తా, తూర్పు ఆంధ్రకు, కర్ణాటక, తమిళనాడు సరుకు దక్షిణాది పప్పు మిల్లులకు సరఫరా కాగలదు.


ప్రస్తుతం అకోలా, వాషిమ్ ప్రాంతాలు కొత్త పెసలు అకోలా, నాగ్పూర్, జల్గాంవ్ మిల్లులకు సరఫరా అవుతుండగా, ఆంధ్ర కొత్త సరుకు తమిళనాడుకు రవాణా అవుతోంది. కందిపప్పు ధరలు తగ్గడంతో పాటు పెసర పప్పు సరఫరా వలన అపరాలలో పెరుగుదలకు అడ్డుకట్ట పడింది. రాజస్థాన్లోని అన్ని ఉత్పా దక కేంద్రాలలో కలిసి 8-10 వేల బస్తాల రైతుల సరుకు రాబడిపై రూ. 6500-6900, జైపూర్లో రూ. 6000-6800, పప్పు రూ. 8000-8500 ధరతో వ్యాపారమైంది


అంతర్జాతీయ విపణిలో అనేశ్వర్ పెసలు 110 డాలర్లు పెరిగి 9100 డాలర్లు, పేడేశ్వర్ పెసలు 1050 డాలర్లు, పొకాకో 55 డాలర్లు పెరిగి 910 డాలర్లు ప్రతి టన్ను ధర ప్రస్తావించబడింది. చెన్నెలో పేడేశ్వర్ రూ. 50 తగ్గి 6850, ఆంధ్ర ప్రాంతపు నాణ్యమైన సన్నరకం చమ్కీపెసలు చెన్నై డెలివరి రూ. 6700-6750 ధరతో వ్యాపారమెంది. మధ్య ప్రదేశ్లోని హర్దాలో దినసరి 500 బస్తాల పెసర రాబడిపై రూ. 4000-6500, పిపరియాలో రూ. 5500-6400, ఇండోర్ రూ. 6700-6800, మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో ఘోడ్నది ప్రాంతం నుండి 300 బస్తాల కొత్త పెసర రాబడిపై రూ.5300-7300, అకోలాలో రూ. 6500-6900, మొగర్ పెసలు రూ. 9200-9400 మరియు జల్గాంలో మధ్య ప్రదేశ్ సరుకు రూ. 6400, మహారాష్ట్ర సరుకు రూ. 66 70, కర్ణాటకలోని కల్బుర్గిలో రూ. 5500-7000 లోకల్లూజ్ ధరతో వ్యాపారమెంది..

Comments

Popular posts from this blog