Posts

Showing posts with the label Jowar

జొన్నలు

Image
   గుంటూరు జిల్లాలోని తెనాలి ప్రాంతంలో నిరవధికంగా కురుస్తున్న వర్షాల వలన పంటకు నష్టం వాటిల్లింది. దీనితో దినసరి కేవలం 5-6 లారీల కొత్త జొన్నల రాబడిపై రూ. 2200–2500 ధరతో వ్యాపారమై మహారాష్ట్ర, గుజరాత్ కోసం ఎగుమతి అయింది. 

జొన్నల రాబడి

Image
  గుంటూరు జిల్లాలోని తెనాలి ప్రాంతంలో దినసరి కేవలం 5-6 లారీల కొత్త జొన్నల రాబడిపై రూ.2200-2500 ధరతో వ్యాపారమై మహారాష్ట్ర, గుజరాత్ కోసం ఎగుమతి అయింది. నంద్యాలలో మహేంద్ర రకం రూ. 3000-3100, మిల్క్ వెట్ రూ. 3500-3650, పచ్చ జొన్నలు రూ. 5500-5650, ఎరుపు రూ. 2400-2800 ధరతో వ్యాపారమయింది.

బొబ్బర్లు - జొన్నలు

Image
 బొబ్బర్లు  ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో 2-3 వాహనాల బొబ్బర్ల రాబడిపై నలుపు రకం సరుకు రూ.6700, తెలుపు రకం రూ. 5300, ఎరుపు రకం రూ. 6000 మరియు పొదిలిలో రూ.4200 ధరతో వ్యాపారమెంది. కేసముద్రంలో రూ. 5000-6100, జడ్చర్లలో రూ. 4000-5210 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. జొన్నలు  తెనాలి ప్రాంతంలో ప్రతిరోజు 20-25 వాహనాల జొన్నల రాబడిపై రూ. 2300-2350 ధరతో వ్యాపారమె ముంబై, అహ్మదాబాద్, నంద్యాల ప్రాంతాల కోసం ఎగుమతి అవుతోంది. నంద్యాలలో మహీంద్ర రకం జొన్నలు రూ. 3200-3300, మిల్క్ వెట్ రూ. 3700-3750, పచ్చ జొన్నలు రూ. 5700-5800, ఎర్ర జొన్నలు రూ.2500-3000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమెంది. రాజ్ కోట్ గత వారం 2 వేల బస్తాల జొన్నల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 4650-4850, మీడియం రూ. 4000 - 4200, పచ్చ జొన్నలు రూ. 2500-2900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

పెరిగిన సజ్జపంట విస్తీర్ణం, జొన్న ధరలు

Image
   ప్రస్తుత సీజన్లో సెప్టెంబర్ 2 వరకు దేశంలో ముతక ధాన్యాల విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 171.62 ల.హె. నుండి పెరిగి 178.96 ల.హె.లకు చేరింది. ఇందులో ప్రస్తుత సీజన్లో సజ్జల విస్తీర్ణం 63.26 ల.హె. నుండి పెరిగి 70.44 లక్షల హెక్టార్లకు చేరింది. గుజరాత్ లో విస్తీర్ణం 1,64,209 హెక్టార్ల నుండి పెరిగి 1,83,347 హెక్టార్లకు చేరగా, తెలంగాణలో 313 ఎకరాల నుండి పెరిగి 997 ఎకరాలకు చేరింది. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో కొత్త సజ్జల రాబడులు ప్రారంభమై రూ. 2400-2500 ధరతో వ్యాపారమె పౌల్టీ పరిశ్రమల కోసం వ్యాపారమెంది.

జొన్నలు

Image
    శ్రీక్రిష్ణాష్టమి పండుగను పురస్కరించుకొని గత వారం గుజరాత్లోని రాజ్ కోట్ మార్కెట్ మూసివున్నది. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో మహీంద్ర రకం జొన్నలు రూ. 2730 ధరతో ప్రభుత్వ ఏజెన్సీలు కొనుగోలు చేస్తుండగా, మిల్క్ - వైట్ స్థానికంగా రూ.2600-2700, మహీంద్ర రకం రూ. 2400-2500, ఎరుపు రకం రూ. 2700-2800, పచ్చజొన్నలు రూ. 5900-6000 మరియు కర్ణాటకలోని బళ్లారిలో ప్రతి రోజు 300-400 బస్తాలు రూ.2200-2500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

జొన్నలు, రాగులు,బొబ్బర్లు,ఉలువలు,కొర్రలు

Image
   వ్యవసాయ మంత్రిత్వశాఖ వారి వివరాల ప్రకారం ప్రస్తుత ఖరీఫ్ దేశంలో ఆగస్టు 5 వరకు సజ్జపంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 56.68 ల.హె నుండి పెరిగి 65.17 ల.హె.లకు చేరగా, జొన్న పంట విస్తీర్ణం 12.65 ల.హె. నుండి 12.62 ల.హె.లకు మరియు రాగుల విస్తీర్ణం 4.30 ల.హె. నుండి తగ్గి 2.67 ల.హె.లకు చేరింది.