జొన్నలు
గుంటూరు జిల్లాలోని తెనాలి ప్రాంతంలో నిరవధికంగా కురుస్తున్న వర్షాల వలన పంటకు నష్టం వాటిల్లింది. దీనితో దినసరి కేవలం 5-6 లారీల కొత్త జొన్నల రాబడిపై రూ. 2200–2500 ధరతో వ్యాపారమై మహారాష్ట్ర, గుజరాత్ కోసం ఎగుమతి అయింది.
నంద్యాలలో మహేంద్ర రకంరూ. 3300-3400, మిల్క్ వెట్ రూ. 3900 - 4100, పచ్చ జొన్నలు రూ. 5700 – 6000, ఎరుపు రూ. 2900- 3100 ధరతో వ్యాపారమయింది. గుజరాత్లోని రాజ్కోట్లో గతవారం 5-6వేల బస్తాల రాబడిపై నాణ్యమైన తెలుపు సరుకు రూ. 4250 -4450, మీడియం రూ. 3950 -4150, బాదామీ రంగు జొన్నలు రూ. 2350-2550 మరియు కర్ణాటక లోని బళ్లారి ప్రాంతంలో రూ. 2140–2380 ధరతో వ్యాపారమయింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు