Posts

Showing posts with the label Groundnut

వేరుసెనగ ధరలలో హెచ్చు-తగ్గులు

Image
   ప్రస్తుతం అనేక ప్రాంతాలలో కురుస్తున్న ఆకాల వర్షాలతో వేరుసెనగ రాబడులకు అవరోధం ఏర్పడింది. కొత్త సరుకు నిమ్ముతో ఉండే అవ కాశం ఉన్నందున ధరలు హెచ్చు తగ్గులు కొనసాగుతున్నాయి.

ఉత్తరాదిలో ప్రారంభమైన వేరుశనగ

Image
  ఉత్తరపదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశ్శా లాంటి వేరుసెనగ ఉత్పాదక రాష్ట్రాలలో వేరుసెనగ పంట నూర్పిళ్లు శరవేగంతో చేపడుతుండగా మార్కెట్ కు రాబడులు స్వల్పంగా ప్రారంభమవుతున్నాయి. మరో రెండు వారాలలో రాబడులు జోరందుకోగలవని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. పాత సరుకు నిల్వలు హరించుకుపోయాయి. ఈసారి ఉత్తరప్రదేశ్ సరుకు గుజరాత్కు మరియు ఒడిశ్శా, పశ్చిమ బెంగాల్ సరుకు దక్షిణాది రాష్ట్రాలకు సరఫరా కానున్నట్లు తెలుస్తోంది. ఎందుకనగా, ఈసారి మద్దతు ధరను అధిగమించిన లాభసాటి ధరలు లభిస్తున్నందున రైతులు తమ సరుకు నూర్పిడి చేపట్టిన వెంటనే విక్రయిస్తున్నారు. వంటనూనెల ధరలు డీలా పడినందున వేరుసెనగ ధరలు ఒడిదొడుకులకు లోనుకావడంలేదు.

తగ్గిన వేరుశనగ ఉత్పత్తి

Image
  ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వేరుసెనగ విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 5 లక్షల హెక్టార్ల మేర తగ్గింది. ఇందులో గుజరాత్ లో విస్తీర్ణం 2 ల.హె. మేర తగ్గి నందున ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 38.55 ల.హె. నుండి తగ్గి 30 ల.హె.లకు చేరే అంచనా కలదు. ఎందుకనగా విస్తీర్ణంతో పాటు దిగుబడి కూడా తగ్గుచున్నది. అయితే గుజరాత్ లో మొత్తం విస్తీర్ణం గత ఏడాది సాధారణ స్థాయిలో ఉన్నందున ఉత్పత్తి 30 లక్షల టన్నులు ఉంది. అయితే ప్రతి హెక్టారు సగటు దిగుబడి 2020 కిలోల నుండి తగ్గి 1755 కిలోలు ఉండే అంచనా కలదు.కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర రూ. 5850 ప్రతి క్వింటాలు ఉంది.

దూసుకుపోతున్న వేరుశనగ ధరలు

Image
   ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో సెప్టెంబర్ 23 నాటికి దేశంలో నూనెగింజల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 49.15 ల.హె. నుండి తగ్గి 45.53 ల.హె.కు పరిమితమైంది. ఇందులో గుజరాత్ వేర సెనగ సేద్యం 19,09,678 హెక్టార్ల నుండి తగ్గి 17,09,023 హెక్టార్లకు పరిమితం కాగా రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ లో రైతులకు లాభసాటి ధరలు గిట్టుబాటవుతున్నందున సేద్యం భారీగా వృద్ధి చెందింది.

తగ్గిన ఖరీఫ్ వేరుసెనగ విస్తీర్ణo - రబీలో పెరిగే అవకాశం - వేరుసెనగకు ఉజ్జ్వల భవిష్యత్తు

Image
   ప్రస్తుత సీజన్లో 9, సెప్టెంబర్ వరకు దేశంలో వేరుశనగ విస్తీర్ణం 48 లక్షల 94 వేల హెక్టార్ల నుండి తగ్గి 45 లక్షల 35 వేల హెక్టార్లకు చేరింది. గుజరాత్ లో కొత్త సరుకు రాబడి ప్రారంభ మెంది. అయితే విస్తీర్ణం 19,09,641 హెక్టార్ల నుండి 2 ల.హె. తగ్గి 17,08,286 హెక్టార్లకు చేరింది. తెలంగాణాలో విస్తీర్ణం 16,137 ఎకరాల నుండి తగ్గి 14,996 ఎకరాలకు చేరింది.

గుజరాత్ లో కొత్త వేరుశనగ ప్రారంభం

Image
   ప్రస్తుత సీజన్లో 2, ఆగష్టు వరకు దేశంలో నూనెగింజల విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1 కోటి 89 లక్షల 66 వేల హెక్టార్లతో పోలిస్తే 1 కోటి 88 లక్షల 51 వేల హెక్టార్లకు చేరింది. ఇందులో వేరుశనగ విస్తీర్ణం 48 లక్షల 64 వేల హెక్టార్ల నుండి తగ్గి 45 లక్షల 14 వేల హెక్టార్లకు చేరింది.

దూసుకుపోతున్న వేరుశనగ ధరలు

Image
   ప్రస్తుత ఖరీఫ్లో ఆగస్టు 19 వరకు దేశంలో వేరుసెనగ విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 47,95,000 హెక్టార్ల నుండి తగ్గి 44,32,000 హెక్టార్లకు చేరింది. ఇందులో గుజరాత్లో వేరుసెనగ విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 19,01,082 హెక్టార్ల నుండి తగ్గి 17,00,123 హె .లకు చేరింది. రాజస్థాన్లో వేరుసెనగ విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 7,84,000 హెక్టార్లు ఉంది. అనగా గుజరాత్ తరువాత రెండవ ప్రముఖ స్థానంలో ఉంది.

తగ్గిన వేరుసెనగ సేద్యం - పెరిగిన ధరలు

Image
   ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఆగస్టు 3 నాటికి దేశంలో వేరుసెనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 44.39 ల.హె. నుండి తగ్గి 44.09 ల.హె. పరిమితం కాగా ఇందులో గుజరాత్ ఖరీఫ్ సేద్యం ఆగస్టు 1 నాటికి వేరుసెనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 18,93,734 హెక్టార్ల నుండి తగ్గి 16,72,401 హెక్టార్లకు చేరగా జునాగఢ్ జూన్లో విత్తిన పంట సెప్టెంబర్ -మూడో వారం నాటికి రాబడి కాగలదు. రాజస్తాన్లో 7,39,650 హెక్టార్ల నుండి పెరిగి 7,83,670 హెక్టార్లకు విస్తరించింది.

తగ్గుచున్న ఖరీఫ్ సీజన్ వేరుసెనగ సీద్యం - మార్కెట్ ధరలు

Image
   దేశంలో ప్రస్తుత ఖరీఫ్ సేద్యం చేరుసెనగ సేద్యం తగ్గుచున్నట్లు వంకేతాలు అందుతున్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గుజరాత్లో జూలై 25 నాటికి వేరసెనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 18,68,169 హెక్టార్ల నుండి తగ్గి 10,20,700 హెక్టార్లు, రాజస్తాన్లో 7.26 ల.హె. నుండి పెరిగి 7.71 ల.హె., మధ్యప్రదేశ్లో 3.26 ల.హె. నుండి 3.60 ల.హె.కు విస్తరించగా, మహారాష్ట్రలో 1.83 ల.హె. నుండి తగ్గి 1.44 ల.హె., ఆంధ్రప్రదేశ్లో 3.27 ల.హె. నుండి 3 ల.హె., కర్ణాటకలో 3.66 ల.హె. నుండి 2.14 ల.హె., తెలంగాణలో 15,016 ఎకరాల నుండి 4372 ఎకరాలకు పరిమితమైంది. 

విస్తీర్ణం తగ్గడంతో వేరుశనగ ధరలు బలోపేతం

Image
  హైదరాబాద్ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తమ నివేదికలో ప్రస్తుత సీజన్లో జూన్ 30 వరకు దేశంలో వేరుసెనగ విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవ ధితో పోలిస్తే 18.28 ల.హె. నుండి తగ్గి 13.71 ల.హ.లకు చేరింది. గుజరాత్ ప్రభుత్వం 2021-22 కోసం జారీ చేసిన నాల్గవ ముందస్తు అంచనాప్రకారం ఖరీఫ్ సీజన్లో వేరుసెనగ ఉత్పత్తి 43.59 ల.ట, యాసంగిలో 1.38 ల.ట. కలిసి 44.95 లక్షల టన్నుల ఉత్పత్తిని అంచనా వేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ఎటా, మెన పురి, ఫరూఖాబాద్ లాంటి ప్రాంతాలలో 1 లక్ష బస్తాల యాసంగి కొత్త పేరుసెనగ రాబడి కాగా, ఇటీవలె కురిసిన వర్షాల వలన సరుకు నిమ్ముగా ఉన్న నేపథ్యంలో ఎండు సరుకుకు మంచి డిమాండ్ రావడంతో ఎండు. రూ.500-500, హెచ్పీఎస్ గింజలు 60-70 కౌంట్ రూ. 8300, గుజరాత్ డెలివరి రూ. 8500, ఝాన్సీలో 5-8 వేల బస్తాల రాబడిపై రూ. 5400-6300 ప్రతి క్వింటాలు ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది.

వేరుశనగ - ఎక్కువుగా తగ్గే అవకాశం లేదు

Image
  కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తమ - నివేదికలో ప్రస్తుత సీజన్లో జూన్ 24 వరకు దేశంలో వేరుసెనగ విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 8.72 ల.హె. నుండి తగ్గి 7.62 ల.హ.లకు చేరింది. ఈ ఏడాది ఆంధ్రలో విస్తీర్ణం తగ్గడం, ఉత్తరప్రదేశ్లో సరుకు నాణ్యత లోపించ డంతో కర్మాటక, తెలంగాణల వ్యాపారులు పశ్చిమబెంగాల్ నుండి సరుకు కొను గోలు చేస్తున్నారు. దీనితో ధరలు బలోపేతం చెందాయి. కాగా ఎక్కువగా మంద కొడికి అవకాశం లేదు. ఎందుకనగా దేశంలో వంటనూనెల డిమాండ్ పెరుగుతోంది. 

తగ్గిన యాసంగి వేరుశనగ విస్తీర్ణం

Image
  విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ప్రస్తుత సంవత్సరంయాసంగి సీజన్ కోసం దేశంలో నూనెగింజల విస్తీర్ణం గత ఏడాది 9.85 లక్షల హెక్టార్లతో పోలిస్తే వృద్ధిచెంది 10.18 లక్షల హెక్టార్లకు చేరింది. అయితే వేరుసె నగ విస్తీర్ణం గత ఏడాది 5.43 ల.హె. నుండి తగ్గి 5.2 ల.హె.లకు చేరింది. త్వరలో మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ మరియు గుజరాత్లలో కొత్త పంట రాబ డులు ప్రారంభం కానున్నాయి. కాగా పంట పరిస్థితి సంతృప్తికరంగా ఉంది. ప్రస్తుతం తీవ్రమైన ఎండల వలన పంట కోతల సమయంలో దిగుబడిపై అంచనా వేయడం జరుగుతుంది. ఎందుకనగా పశ్చిమబెంగాల్లోని దక్షిణ ప్రాంతాలలో త్వరగా సేద్యం అయినందున మే మొదటి వారంలో మరియు ఉత్తర ప్రాంతా లలో పంట కోతలకు జాప్యం జరిగినందున మే చివరి వారం నాటికి కోతలు ప్రారంభం కాగలవు. 

వేరుశనగ రాబడులతో ధరలలో మందకొడి

Image
  తెలంగాణలోని గద్వాల, మహబూబ్ నగర్, జడ్చర్ల, నాగర్ కర్నూలు, తిరుమలగిరి, అచ్చంపేట, సూర్యపేట, వరంగల్, కేసముద్రం ప్రాంతాలలో ప్రతి రోజు 20 వేల బస్తాల సరుకు రాబపడిపై రూ.4500-6410, గద్వాల లో హెచ్పీఎస్ గింజలు 80-90 కౌంట్ చెన్నై డెలివరి రూ. 9460,మహబూబ్ నగర్ హెచ్పిఎస్ గింజలు 80-90 కౌంట్ రూ. 9400, 70-80 కౌంట్ రూ.9500, 60-70 కౌంట్ రూ. 9700, చెన్నై డెలివరి 50-60 కౌంట్ రూ. 9900, ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

వచ్చే నెల నుండి కొత్త యసంగి వేరుశనగ

Image
  దేశంలో వచ్చే నెల నుండి యాసంగి కొత్త వేరుశనగ రాబడి ప్రారంభమయ్యే అవకాశం కలదు. ప్రభుత్వం నిల్వ పరిమితి విధించడంతో మిల్లర్ల కొనుగోళ్లు తగ్గడంతో పాటు సరఫరా పెరుగుతున్నది. దీనితో ధరలు మందకొడిగా మారుతున్నాయి. లబించిన సమాచారం ప్రకారం తెలంగాణలో ని ఉత్పాదక కేంద్రాలలో సరుకు రాబడులు తగ్గి గద్వాల, వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, సూర్యపేట, తిరుమలగిరి, వరంగల్, కేసముద్రం మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి దినసరి కేవలం 20 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై రూ.5500-6900, మబబూబ్నగర్ హెచ్పిఎస్ గింజలు 80-90 కౌంట్చెన్నై డెలివరి రూ. 9321, 70-80 కౌంట్ రూ. 9420, 60-70 కౌంట్ రూ. 9800, 50-60 కౌంట్ రూ. 10,000, హెదరాబాద్ డెలివరి 10,200 ధరతో వ్యాపారమైంది.

వేరుశనగ లో పెరుగుదలకు బ్రేక్

Image
  లబించిన సమాచారం ప్రకారం తెలంగాణలో వేరుశనగ రాబడులు తగ్గుముఖం పట్టాయి. గద్వాల, వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్కర్నూల్, అచ్చంపేట, సూర్యపేట, తిరుమలగిరి, వరంగల్, కేసముద్రం మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి దినసరి 35-40 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై రూ. 5500-6700, మబబూబ్నగర్లో హెచ్పీఎస్ గింజలు 80-90 కౌంట్ చెన్నై డెలివరి రూ. 9650, 70-80 కౌంట్ రూ. 9700-9800, 60-70 కౌంట్ రూ.9900, 50-60 కౌంట్ రూ. 10,300, హైదరాబాద్ డెలివరి 10,000 ధరతో వ్యాపారమైంది.

క్షీణిస్తున్న వేరుశనగ ధరలు

Image
  నిరవధికంగా సరఫరా ఉండడంతో పాటు ఇతర వంటనూనెల ధరలు స్థిరంగా ఉండడంతో వేరుసెనగలో మందకొడి గమనించబడింది.తెలంగాణలోని గద్వాల, వనపర్తి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, అచ్చంపేట, సూర్యపేట, తిరుమలగిరి, వరంగల్ మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి గత వారం 35-40 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై రూ. 5710-7230, 

తగ్గిన రబీ వేరుశనగ విస్తీర్ణం

Image
  దేశంలో మార్చి 11 వరకు వేరుసెనగ విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 2.65 ల.హె. నుండి తగ్గి 2.49 ల.హె.లకు చేరింది. తెలంగాణలోని గద్వాల, వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, అచ్చంపేట, సూర్య పేట, తిరుమల్దేరి, వరంగల్ మరియు పరిసర ప్రాంతాలలో కలిసి సుమారు 50 వేల బస్తాల కొత్త వేరుసెనగ రాబడిపై రూ. 6000–7200 మరియు మహబూబ్ నగర్ హెచ్ఎస్ గింజలు 80-90 కౌంట్ చెన్నై డెలివరి రూ.10,000, 70-80 కౌంట్ రూ. 10,300, 60-65 కౌంట్ రూ. 10,600, 60-70 కౌంట్ రూ.10,500-10,600, 50-60 కౌంట్ రూ. 10,800 ధరతో వ్యాపారమెంది.

తెలంగాణలో పెరిగిన వేరుశనగ ఉత్పత్తి

Image
  లభించిన సమాచారం ప్రకారం ఈ ఏడాది రబీ సీజన్లో దేశంలో వేరుసెనగ విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే తగ్గింది. అయితే ఇప్పటికీ,ఖరీఫ్ సరుకు సరఫరా అవుతున్నందున ధరలు రూ.200-300 ప్రతి క్విoటాలుకు హెచ్చు-తగ్గులు కొనసాగుతున్నాయి. దేశంలో వంటనూనెలలో వేరుసెనగ నూనెకు డిమాండ్ పెరుగుతున్నది. తెలంగాణ వ్యవసాయ శాఖ వారి వివరాల ప్రకారం ప్రస్తుత రబీలో నూనెల గింజల విస్తీర్ణం 2020-21తో పోలిస్తే 3.49 లక్షల ఎకరాల నుండి 1.09 లక్షల ఎకరాలు పెరిగి 4.55 లక్షల ఎకరాలకు చేరింది. ఇందులో వేరుసెనగ విస్తీర్ణం పెరిగింది. 

వేరుసెనగకు పెరిగిన గిరాకీ

Image
   దేశంలో ప్రస్తుతం గ్రీష్మకాలం వేరుసెనగ సేద్యం ముగిసినందున విత్తుల కోసం డిమాండ్ చరమాంకంలో పడిందున విత్తుల ధరలు కొంతమేర ఊరట కలిగిస్తున్నాయి. అయితే, వంటనూనెలకు ఇనుమడిస్తున్న డిమాండ్తో అన్ని రకాల నూనెలకు మద్దతు లభిస్తున్నది. ఫలితంగా వేరుసెనగ ధరలు పురోగమించగలవు.

ఇనుమడిస్తున్న వేరుశనగ ధరలు

Image
  20-02-2022 ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం దేశంలోని అన్ని ఉత్పాదక రాష్ట్రాలలో వేరుసెనగ సంతృప్తికరంగా విస్తరించింది. రాబోయే గ్రీష్మకాలం పంట కోసం సేద్యం ప్రారంభమవుత్నునది, దీనితో నూనెమిల్లర్లు, కిరాణా వ్యాపారులు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నారు. తద్వారా ప్రతి వారం ధర రూ. 100-200 ఒడిదొడుకుల మధ్య కదలాడుతున్నది. ఎందుకనగా దేశంలోని ఉత్పాదక రాష్ట్రాలలో ప్రతి వారం 8-9 లక్షల బస్తాల సరుకు రాబడి అవుతుండడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కలిసి వారంలో సుమారు 3 లక్షల బస్తాల వేరుసెనగ రాబడి అవుతుండగా ధర ప్రతి క్వింటాలు రూ. 5000-6400, గుజరాత్లో వారంలో 15 లక్షల బస్తాలు రూ. 4500-5700, రాజస్తాన్లో 5-6 లక్షల బస్తాలు రూ. 4200-5400, కర్ణాటకలో 1 లక్షకు పైగా బస్తాలు నాణ్యమైన సరుకు రూ. 6000-6400, యావరేజ్ సరుకు రూ. 4000-5000 ధరతో వ్యాపారమవుతున్నది.