తెలంగాణలోని గద్వాల, మహబూబ్ నగర్, జడ్చర్ల, నాగర్ కర్నూలు, తిరుమలగిరి, అచ్చంపేట, సూర్యపేట, వరంగల్, కేసముద్రం ప్రాంతాలలో ప్రతి రోజు 20 వేల బస్తాల సరుకు రాబపడిపై రూ.4500-6410, గద్వాల లో హెచ్పీఎస్ గింజలు 80-90 కౌంట్ చెన్నై డెలివరి రూ. 9460,మహబూబ్ నగర్ హెచ్పిఎస్ గింజలు 80-90 కౌంట్ రూ. 9400, 70-80 కౌంట్ రూ.9500, 60-70 కౌంట్ రూ. 9700, చెన్నై డెలివరి 50-60 కౌంట్ రూ. 9900, ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో 15-20 వేల బస్తాలు ఆదోని 30 వేల బస్తాలు ఎమ్మిగనూరు 20-25 వేల బస్తాలు ప్రాంతాలలో గత వారం 85 వేల బస్తాల కొత్త వేరుసెనగ రాబడి కాగా రూ.6000-6500ల మరియు కళ్యాణదుర్గ్, రాయదుర్గ్, మడకశిర ప్రాంతాలలో గత వారం 10-15 వేల బస్తాలు రూ. 6000-6500, హెచ్ పిఎస్ గింజలు 80-90 చెన్నై డెలివరి రూ. 9300-9400, 70-80 కౌంట్ రూ. 9600, 60-70 కౌంట్ రూ. 9700-9800, ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బళ్లారి, చెల్లకేరి, చిత్రదుర్గ్, గదగ్, యాద్గిర్, రాయిచూర్ ప్రాంతాలలో కలిసి దినసరి 25-30 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై రూ. 6000-6700 ధరతో వ్యాపారమైంది.
గుజరాత్లో గతవారం సుమారు 30-35 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 5500-6400,ధరతో వ్యాపారమైంది. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ, లలిత్పూర్ మరియు మధ్య ప్రదేశ్లోని శివపురి ప్రాంతాలలో 15-20 వేల బస్తాల సరుకు రాబడిపై 4800-5400 ధరతో వ్యాపారమైంది. రాజస్తాన్లోని బికనీర్, జోధ్ పూర్, మెడతా, జైపూర్ కలిసి 12-15 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై స్థానికంగా రూ.5500-6500, హెచ్పిఎస్ గింజలు 60-70 కౌంట్ రూ. 8500, 50-60 కౌంట్ రూ. 9000, 40-50 కౌంట్ రూ. 9500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
తమిళనాడులోని దిండిగల్ మార్కెట్లో 10 వేల బస్తాలు కరూర్ 6-7 వేల బస్తాలు అరియలూర్ 4-5వేలు సేలంలో 4-5 వేల బస్తాల రాబడి పై రూ. 6000-6700 ధరతో ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. దిండిగల్ మార్కెట్లో 80-90 కౌంట్ రూ. ప్రతి 74 కిలో రూ. 7200, 70-80 కౌంట్ రూ. 7400-7500 ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు