పెరిగిన పసుపు ఉత్పత్తి - దిగజారుతున్న ధరలు
దేశంలో 2021-22 పంట కాలం పసుపు ఉత్పత్తి ముందు సంవత్సరంతో పోలిస్తే 18.4 శాతం ఇనుమడించి 13.30 ల.ట.కు ఎగబాకగా, గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు ముందు సంవత్సరంతో పోలిస్తే 16.7 శాతం క్షీణించి 1,53,154 టన్నులకు పరిమితమైనట్లు మసాలా బోర్డు విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది. అయితే, ఇది తాత్కాలికమేనని కూడా బోర్డు పేర్కొన్నది. ఎందుకనగా, ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు ఆరోగ్య పరిరక్షణ అంశంపై అవగాహన పెంపొందడమే ఇందుకు నిదర్శనమని బోర్డు తమ అభిప్రాయం వ్యక్తం చేసింది.