పెరిగిన పసుపు ఉత్పత్తి - దిగజారుతున్న ధరలు

 


దేశంలో 2021-22 పంట కాలం పసుపు ఉత్పత్తి ముందు సంవత్సరంతో పోలిస్తే 18.4 శాతం ఇనుమడించి 13.30 ల.ట.కు ఎగబాకగా, గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు ముందు సంవత్సరంతో పోలిస్తే 16.7 శాతం క్షీణించి 1,53,154 టన్నులకు పరిమితమైనట్లు మసాలా బోర్డు విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది. అయితే, ఇది తాత్కాలికమేనని కూడా బోర్డు పేర్కొన్నది. ఎందుకనగా, ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు ఆరోగ్య పరిరక్షణ అంశంపై అవగాహన పెంపొందడమే ఇందుకు నిదర్శనమని బోర్డు తమ అభిప్రాయం వ్యక్తం చేసింది.


ఎన్సీడిఇఎక్స్ వద్ద గత సోమవారం ఆగస్టు వాయిదా గత బుధవారం రూ. 6950 తో ప్రారంభమై శుక్రవారం నాటికి రూ. 118 పెరిగి రూ. 7068, సెప్టెంబర్ వాయిదా మంగళవారం రూ. 7336 తో మొదలై శుక్రవారం నాటికి రూ. 6 నష్టంతోరూ. 7330 కి పరిమితం కాగా, అక్టోబర్ వాయిదా రూ.70 వృద్ధి చెంది రూ. 7490 వద్ద ముగిసింది.


తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో గత సోమ మరియు బుధవారాలలో కలిసి 2500 - 3000 బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు రూ.6500-7500, దుంపలు రూ.5700-6400 లోకల్ లూజ్ మరియు కొమ్ములు పాలిష్ సరుకు లారీ బిల్టి రూ. 7900-8000, దుంపలు రూ. 7200-7400, బంగ్లాదేశ్ కోసం కొమ్ములు రూ.7300, వరంగల్లో 300-400 బసాలు కొమ్ములు రూ. 4400-5800, దుంపలు రూ. 4000–5500, కేసముద్రం మార్కెట్లో 400 బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు రూ. 5000-6000, దుంపలు రూ. 5000-5600 మరియు ఆంధ్రప్రదేశ్లోని దుగ్గిరాలలో 250-300 బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు మరియు దుంపలు రూ. 5200-5800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


తమిళనాడులోని ఈరోడ్ మార్కెట్లో గత వారం 10-12 వేల బస్తాల సరుకు రాబడి పై కొమ్ములు రూ.5899-7700, దుంపలు రూ. 5399-6729, పెరుందురైలో 2 వేల బసాలు కొమ్ములు రూ. 5696-8212, దుంపలు రూ. 5042-6709 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


మహారాష్ట్రలోని సాంగ్లీ, హింగోళి, బస్మత్నగర్ మార్కెట్లలో కలిసి గత వారం 4-5 వేల బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు రూ. 6000-7200, దుంపలు రూ. 5800-6200 ప్రతి క్వింటాలు నాణ్యతానుసారం వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog