Posts

Showing posts with the label Sunflower

కొత్త సన్ ప్లవర్ రాబడి

Image
 కర్నాటకలోని అన్ని మార్కెట్లలో కలిసి దినసరి 18-20 లారీల కొత్త సన్ ఫ్లవర్ రాబడిపె స్థానిక మార్కెట్లలో రూ. 5500–5900, మిల్లు డెలివరీ ఆయిల్ కండిషన్ ప్రకారం రూ. 6100-6000 ప్రతి క్వింటాలు ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది.

సన్ ఫ్లవర్

Image
   కర్ణాటకలోని బళ్లారిలో ప్రతి రోజు 5-6 వేల బస్తాల సన్ఫ్లవర్ రాబడిపై రూ. 6000–7300, తమిళనాడులోని వెల్లకోవిల్లో 4500-5000 బస్తాలు రూ. 5200-700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

సన్ ఫ్లవర్

Image
  హెదరాబాద్ - కర్ణాటకలోని చిత్రదుర్గ్, బళ్లారి ప్రాంతాలలో దినసరి 1000 వేల బస్తాల సన్ఫ్లవర్ రాబడి కాగా, రూ.500-7500 మరియు గుజరాత్లోని రాజ్కోట్లో వారంలో 2 -3 వేల బస్తాల రాబడి కాగా, మీడియం రూ. 4000-6000, నాణ్యమైన సరుకు రూ.6500-7500 మరియు వెల్లకోవిల్లో సంతరోజు 1300 బస్తాల రాబడి కాగా, రూ.5275-7655 ధరతో వ్యాపారమైంది.

సన్ ఫ్లవర్ నూనె ధరలు తగ్గే అవకాశం లేనట్లే

Image
మనదేశంలో వంటనూనెల వినియోగంలో సన్ఫ్లవర్ నూనె భాగస్వామ్యం 10 శాతం ఉంది. అయితే, ధరలను అదుపు చేయడం ప్రభుత్వ నియంత్రణలో లేదు. ఎందుకనగా, వినియోగం కోసం విదేశాల నుండి సరుకు దిగుమతి చేసుకోవలసి వస్తున్నది. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సరఫరా ప్రభావితమైన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు హెచ్చుముఖంలో ఉన్నాయి. ఇండోనేషియా పామాయిల్ అసోసియేషన్ వర్గాల కథనం ప్రకారం ప్రస్తుత సంవత్సరం ప్రథమార్ధంలో అనగా జనవరి నుండి జూన్ వరకు అంతర్జాతీయ స్థాయిలో వంటనూనెల కొరతకు అవకాశం కలదు. ఇందుకు ముఖ్య కారణమేమనగా, ప్రముఖ సన్ఫ్లవర్ మరియు ఆవాల ఉత్పాదక దేశమైన ఉక్రెయిన్ మరియు రష్యాల మధ్య యుద్ధం కారణంగా సరఫరా తగ్గడంతో మరియు ఇండోనేషియా జనవరి చివరలో పాయాయల్ ఎగుమతులపై కొన్ని ఆంక్షలు విధించింది.

దేశంలో ఉత్పత్తి కి మించిన సన్ఫ్లవర్ ఆయిల్ వినియోగం - 90 శాతం దిగుమతి మీదే ఆధారం

Image
 ఆదాయం 1, వ్యయం 10 : అన్న చందంగా ఉంది భారత్లో పొద్దుతిరుగుడు నూనె ఉత్పత్తి పరిస్థితి. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న భీకర పోరు కారణంగా ఎగుమతులు - దిగుమతులపై పొడసూపుతున్న దుష్ప్రప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడి ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలు పెట్టుకొని జీవిస్తున్నారని తమిళనాడు వ్యాపారవేత్తలు మరియు పరిశ్రమ ప్రతినిధులతో జరిగిన చర్చలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏకరువు పెట్టారు. దేశంలో సన్ఫ్లవర్ నూనె వార్షిక వినియోగం 25 ల.ట. ఉండగా ఉత్పత్తి కేవలం 50 వేల టన్నులు కాగా మిగిలిన 90 శాతం సరుకు దిగుమతి చేసుకోవలసి వస్తోందని పరిశ్రమ మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దేశంలో వంటనూనెల ధరలపై దృష్టి సారిస్తున్నట్లు నిర్మల పేర్కొన్నారు.