దేశంలో ఉత్పత్తి కి మించిన సన్ఫ్లవర్ ఆయిల్ వినియోగం - 90 శాతం దిగుమతి మీదే ఆధారం



 ఆదాయం 1, వ్యయం 10 : అన్న చందంగా ఉంది భారత్లో పొద్దుతిరుగుడు నూనె ఉత్పత్తి పరిస్థితి. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న భీకర పోరు కారణంగా ఎగుమతులు - దిగుమతులపై పొడసూపుతున్న దుష్ప్రప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడి ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలు పెట్టుకొని జీవిస్తున్నారని తమిళనాడు వ్యాపారవేత్తలు మరియు పరిశ్రమ ప్రతినిధులతో జరిగిన చర్చలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏకరువు పెట్టారు. దేశంలో సన్ఫ్లవర్ నూనె వార్షిక వినియోగం 25 ల.ట. ఉండగా ఉత్పత్తి కేవలం 50 వేల టన్నులు కాగా మిగిలిన 90 శాతం సరుకు దిగుమతి చేసుకోవలసి వస్తోందని పరిశ్రమ మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దేశంలో వంటనూనెల ధరలపై దృష్టి సారిస్తున్నట్లు నిర్మల పేర్కొన్నారు.


దేశంలో మొత్తం వంటనూనెల దిగుమతులలో సన్ఫ్లవర్ భాగస్వామ్యం 14 శాతం అనగా 80-85 ల.ట. ఉంది.సోయానూనె 45 ల.ట., రాయిడ ఆవనూనె 30 ల.ట. సరుకు దిగుమతి అవుతున్నది. 2019 లో సన్ఫ్లవర్ నూనె ప్రతి కిలో ధర రూ. 98 కాగా ప్రస్తుతం రూ. 161 పలుకుతోంది. ప్రస్తుత ఊహించని తరుణంపై దృష్టి సారిస్తున్నట్లు ఆర్థిక మంత్రి సీతారామన్ తెలిపారు. అయితే, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి తెర పడిన వెంటనే సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమీక్ష నిర్వహించవలసి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఉక్రెయిన్ నుండి షిప్మెంట్లు నిలిచిపోయినప్పటికీ దేశంలోని వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం కృ షి చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు