Posts

Showing posts with the label Mustard

రికార్డు స్థాయిలో ఆవాల ఉత్పత్తి

Image
  వ్యవసాయ విస్తరణ విభాగం (డిఇపి) అధికారుల కథనం ప్రకారం బంగ్లాదేశ్ లో అమన్ మరియు బోరో వరి సీజన్ మధ్య రెత్రులు అదనపు ఆదాయం కోసం అవసాగు చేపట్టడం జరుగుచున్నది. అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఉత్తర జిల్లాలలో ఆవాల సాగు పెరిగే అవకాశం కలదు. తక్కువ వ్యవధిలో అధిక దిగుబడి వలన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వంటనూనెల ధరలు పెరగడం మరియు ఆరోగ్యానికి ఆవనూనె మెరుగ్గా ఉండగలదని భావిస్తున్నందున, వినియోగం పెరుగుతున్నది.

మద్దతు ధరను అధిగమించిన ఆవాలు

Image
   ప్రస్తుత సీజన్ కోసం కేంద్ర ప్రభుత్వం ఆవాల కనీస మద్దతు ధర ప్రతి క్వింటాలు రూ.500 నిర్ధారించింది. హర్యాణాలో పంట అత్యంత సంతృప్తికరంగా ఉండడమే కాకుండా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నందున భారత్లో వంటనూనెల ధరలు పైపైకి ఎగబాకుతున్నాయని వ్యాపారులు పేర్కొన్నారు. ఇప్పట్లో ధరలు దిగివచ్చే అవకాశం కనిపించడంలేదు. తద్వారా ఆవాల సగటు ధర ప్రతి క్వింటాలు రూ. 6500 పలుకుతోంది. ఇది కనీస మద్దతు ధరతో పోలిస్తే 25 శాతం అధికమని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని వలన ప్రభుత్వం కొనుగోలు చేపట్టవలసిన అవసరం ఉండదని విశ్లేషిస్తున్నారు.

రబీ సీజన్లో విస్తృతంగా "ఆవాల" సాగు

Image
  18-10-2021 ఆవాలకు గిట్టుబాటవుతున్న లాభసాటి ధరలు, సానుకూల వాతావరణం వలన రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రముఖ ఆవాల ఉత్పాదక రాష్ట్రాలలో రైతులు రబీ సీజన్ కోసం ఆవాల సేద్యం విస్తృతంగా చేపట్టే అవకాశం కనిపిస్తున్నది. ఎందుకనగా, గోధుమ మరియు శనగ స్థానంలో ఆవాల సేద్యం చేట్టడానికి అత్యంత అనుకూలంగా ఉండడమే ఇందుకు నిదర్శనం.