రికార్డు స్థాయిలో ఆవాల ఉత్పత్తి

 

వ్యవసాయ విస్తరణ విభాగం (డిఇపి) అధికారుల కథనం ప్రకారం బంగ్లాదేశ్ లో అమన్ మరియు బోరో వరి సీజన్ మధ్య రెత్రులు అదనపు ఆదాయం కోసం అవసాగు చేపట్టడం జరుగుచున్నది. అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఉత్తర జిల్లాలలో ఆవాల సాగు పెరిగే అవకాశం కలదు. తక్కువ వ్యవధిలో అధిక దిగుబడి వలన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వంటనూనెల ధరలు పెరగడం మరియు ఆరోగ్యానికి ఆవనూనె మెరుగ్గా ఉండగలదని భావిస్తున్నందున, వినియోగం పెరుగుతున్నది.


 ప్రస్తుతం సోయానూనె ధరలు అధికంగా ఉండడంతో ఆవనూనె వినియోగం పెరుగుతున్నది. దీనితో సీజన్ ప్రారంభం నుండే ఆవాల ధర గత ఏడాదితో పోలిస్తే 50 శాతం అధికంగా ఉంది. ఫలితంగా రాబోవు విస్తీర్ణం కూడా పెరిగే అవకాశం కలదు. బంగ్లాదేశ్లోని ఠాకూర్గాంవ్ మరియు పంచఘడ్ జిల్లాలలోని ఆ ఉత్పాదక ప్రాంతాలలో ప్రస్తుత సీజన్లో దిగుబడి పెరగడంతో రైతులు ఉత్సాహంగా ఉన్నారు. ఠాకూర్గాంవ్ జిల్లాలో ఆవ పంట విస్తీర్ణం 12,635 హెక్టార్ల నిర్ధారిత లక్ష్యంతో పోలిస్తే పెరిగి 13,374 హెక్టార్లకు చేరగా, ఉత్పత్తి 19,711 టన్నులు ఉండే అంచనా కలదు. అలాగే, పంచఘడ్ జిల్లాలో విస్తీర్ణం 3050 హెక్టార్ల నిర్ధారిత లక్ష్యంతో పోలిస్తే పెరిగి 4145 హెక్టార్లకు చేరింది. దీనితో పోలిస్తే గత సీజన్లో విస్తీర్ణం 3000 హెక్టార్లు ఉంది.రెత్తులు మరియు వ్యవసాయ అధికారుల అభిప్రాయం ప్రకారం పెరెండు జిల్లాలలో దిగుబడి పెరుగుతున్నందున ఉత్పత్తి ప్రభుత్వం నిర్ధారించిన లక్ష్యం కంటే అధికంగా ఉండే అవకాశం కలదు. బంగ్లాదేశ్లో ఆవనూనె వార్షిక డిమాండ్ 1.50 లక్షల టన్నుల మేర ఉండగా, ఉత్పత్తి 1 లక్ష టన్నులు ఉంది. కావున లోటును పూరించడం కోసం 2.50-3 లక్షల టన్నుల ఆవాలను దిగుమతి చేసుకోవడం జరుగుచున్నది. అయితే, ఈ ఏడాది దిగుమతులు తగ్గే అవకాశం కలదు మరియు సోయానూనె ధరలు పెరగడంతో ఆవనూనె వినియోగం పెరుగుతున్నది.


రికార్డు స్థాయిలో ఆవాల ఉత్పత్తి ? ?


ముంబై - కేంద్ర వ్యవసాయ శాఖ వారి వివరాల ప్రకారం ప్రస్తుత సీజన్లో ఆవ పంట విస్తీర్ణం 91 ల.హె. ఉండడంతో ఉత్పత్తి 114.60 ల.ట. రికార్డు స్థాయికి చేరే అవకాశం కలదు. కేంద్ర వంటనూనెల పరిశ్రమ మరియు వ్యాపార సమాఖ్య వారు తొరియా, తారామీరా సహా ఆవాల ఉత్పత్తి 113 ల.ట. ఉండగలదని అభిప్రాం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి రాజస్థాన్లో ఆవ పంట దిగుబడి 1460 కిలోలు ప్రతి హెక్టారుకు ఉండే అవకాశం ఉండగా, పశ్చిమబెంగాల్, అస్సాం, ఒడిషాలలో 740 నుండి 790 కిలోలు ఉండే అంచనా కలదు.

Comments

Popular posts from this blog