Posts

Showing posts with the label Hyderabad Chilli Market

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు

Image
   ఈ ఏడాది మిర్చి రైతులకు లాభసాటి ధరలు లభ్యమైనందున పంజాబ్ లోని సునామ్, ఫిరోజ్్పూర్ మరియు పరిసర ప్రాంతాలలో మిర్చి సేద్యం భారీగా విస్తరించింది. పచ్చి కాయలు కొత్త సరుకు ప్రతి కిలో రూ. 5-7 ధరతో అమ్మ కమవుతున్నది. వాతావరణం సానుకూలించినట్లయితే మరో వారం రోజుల తర్వాత మిర్చి రాబడులు పోటెత్తగలవని తెలుస్తోంది. అత్యధికంగా ఈ సరుకు పంజాబ్, హర్యాణా, ఉత్తర ప్రదేశ్, దిల్లీ ప్రాంతాలలో అమ్మ కమయ్యే అవకాశం ఉంది. ధరలు తగ్గినట్లయితే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బీహార్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల నుండి డిమాండ్ నెలకొనే అవకాశం ఉంది.

చివరి విడత మిర్చి కోతలపై వర్షాల ప్రకోపం

Image
   గతవారం ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తెలంగాణా, గుజరాత్లలోని అన్ని మార్కెట్లలలో కలిసి దాదాపు 12-13 లక్షల బస్తాల సరుకు రాబడి అయింది. అంతేకాకుండా, ఉత్పాదక ప్రాంతాలలోని కోల్డుస్టోరేజీలలో సుమారు 3-4 లక్షల బస్తాల రైతుల సరుకు నేరుగా రవాణా అయింది.వ్యాపారస్తుల అంచనా ప్రకారం ప్రస్తుతం గుంటూరులో ని సుమారు 84 కోల్డు స్టోరేజీలలో కేవలం 74 కోల్డుస్టోరేజీలలో 49-50 లక్షల బస్తాలు, పలనాడు ప్రాంతంలోని మాచర్ల నుండి పిడుగురాళ్ల వరకు 21 కోల్డు స్టోరేజీలలో 13-14 లక్షల బస్తాలు, ఖమ్మం కోల్డ్ స్టోరేజీలలో 9.77 లక్షల బస్తాల సరుకు నిల్వ అయినట్లు అంచనా. 

ఆం.ప్ర.లో శరవేగంతో దూసుకుపోతున్న మూడో విడత మిర్చి కోతలు

Image
   గుంటూరు మరియు పరిసర ప్రాంతాలలో మూడోవిడత మిర్చి కోతల ప్రక్రియ జోరందుకున్నది. కావున మరో వారం రోజులలో రాబడులు పోటెత్తగలవని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. మే నెల మూడో వారం వరకు రాబడులు కొనసాగే అవకాశం కనిపిస్తున్నది. అయితే, డీలక్స్ సరుకుకు కొరత ఏర్పడగలదని నిపుణులు భావిస్తున్నారు. చైనా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, యుఎఇ కోసం నాణ్యమైన రకాలకు డిమాండ్ నెలకొన్నందున ధరలకు మద్దతు లభిస్తున్నది. దక్షిణాది రాష్ట్రాలలోని అన్ని మార్కెట్లలో కలిసి గత వారం 15 లక్షల బస్తాల సరుకు రాబడి అయింది. నాణ్యమైన రకాల సరుకు శీతల గిడ్డంగులకు తరలించబడింది. ఖమ్మం శీతల గిడ్డంగులలో శనివారం నాటికి మిర్చి నిల్వలు 8,97,500 బస్తాలకు చేరాయి.

రికార్డు బద్దలు కొడుతున్న మిరప ధరలు

Image
   లభించిన సమాచారం ప్రకారం వరంగల్ ప్రాంతంలో ఈ ఏడాది 334 రకం మిరప విస్తీర్ణం పెరిగిన నేప ధ్యంలో ఇతర రకాల రాబడులు తగ్గే అంచనా కలదు. లభించిన సమాచారం ప్రకారం విస్తీర్ణం, ఉత్పత్తి అంచనా మరియు నిల్వలను పరిగణలోకి తీసుకుంటే 2022-23 లో మరోసారి ధరలు పెరిగే అంచనా కలదు. వ్యాపారుల అభిప్రాయం ప్రకారం మధ్య ప్రదేశ్ లోని బేడియాలో ఆది, గురు, శనివారాలలో కలిసి 22-25 వేల బస్తాల కొత్త సరుకు రాబడి అయింది. అనగా గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే రాబడులు తగ్గాయి. నిమ్ము రకం సరుకు రాబడులు అవుతున్నందున ఆంధ్ర, తెలంగాణలలో మర ఆడించే యూనిట్లు కొనుగోలుకు ముందుకు వస్తున్నందున నాణ్యమైన వండర్ హాట్ ధర పెరిగి రూ. 38,000 వరకు చేరింది. రాబోవు రోజులలో ధరలు మరింత వృద్ధిచెందే అంచనా కలదు. 

భారీ వర్షాల వలన హెచ్చుముఖంలో మిరప ధరలు

Image
 కర్నాటకలోని బ్యాడ్గి లో గురువారం 100 బస్తాలు, సింధనూరులో 25 బస్తాల కొత్త మిరప రాబడి ప్రారంభమయింది. అయితే, రాబడులు పెరగడానికి ఒక నెల సమయం ఉంది. దక్షిణ భారత కోల్డు స్టోరేజీలలో నిల్వలు వేగంగా తగ్గుచున్నాయి. అయితే, మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ ప్రాంతంలో రాబడులు ప్రారంభమైనప్పటికీ, ప్రస్తుతం మార్కెట్లలో రాబడులు గత ఏడాదితో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తుల అంచనా ప్రకారం ప్రస్తుతం వర్షాల కారణంగా కర్నూలు, గుంతకల్, అనంతపురం ప్రాంతాలలో పంటకు నష్టం వాటిల్లుతున్నది. గుంటూరు, ప్రకాశం జిల్లాలలో వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాలలో నాట్లు వాలిపోయాయి. ఇక ముందు కూడా వర్షాలు కురిసే పరిస్థితి ఉంది. దీనితో అక్టోబర్ -నవంబర్ వరకు నాణ్యమైన రకాల ధర రూ. 1000-1500 వరకు పెరగవచ్చు.

మార్కెట్లో సత్తా చాటుతున్న డీలక్స్ మిర్చి

Image
    ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు మరియు పరిసర ప్రాంతాలలో సాధారణంగా ఆగస్టు చివరి నుండి మిర్చి నాట్లు వేస్తుంటారు. అయితే, ఈసారి ఇటీవలి కాలం వరకు కురిసిన వర్షాల వలన ఒక నెల జాప్యం ఏర్పడింది. తద్వారా పంట పక్వానికి వచ్చే దశ కూడా ఒక నెల రోజుల పాటు ఆలస్యం కాగలదని తెలుస్తోంది. నాట్లు వేసే ప్రక్రియపై సమగ్రమైన నివేదిక అక్టోబర్ మూడో వారంలో స్పష్టత రాగలదు. మధ్య ప్రదేశ్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఓంకారేశ్వర్ డ్యాం 10 గేట్లు తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇప్పటి వరకు వాతావరణం వేడెక్కలేదు. కావున కొత్త సరుకు రాబడులు ప్రారంభం కావడానికి మరింత జాప్యం ఏర్పడగలదని భావిస్తున్నారు.

దక్షిణాదిలో భారీగా తగ్గిన మిరప నిల్వలు - మధ్యప్రదేశ్ లో కొత్త మిర్చి పెరిగే అవకాశం

Image
   లభించిన సమాచారం ప్రకారం మరో 10 రోజులలో మధ్యప్ర దేశ్ లో కొత్త సరుకు రాబడి పెరిగే అవకాశం కలదు. అయితే ధరలు ఒకసారి రూ. 1500-2000 తగ్గిన తరువాత తిరిగి పుంజుకొనే అంచనా కలదు. ఇందుకు ముఖ్య కారణమేమనగా, ఈ ఏడాది కర్ణాటకలోని బళ్లారి,రాయిచూర్, ఆంధ్ర లోని కర్నూల్ ప్రాంతాలలో ప్రారంభంలో విత్తిన పంటకు వైరస్ వ్యాప్తి చెందడంతో రైతులు పత్తి, మొక్కజొన్న లాంటి పంటల సాగుకు మొగ్గుచూపడంతో, మిరప విస్తీర్ణం తగ్గింది. గుంటూరు, ప్రకాశం, క్రిష్ణ తదితర ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి గమనించబడింది. అయితే తదుపరి మంచి వర్షాల నేపథ్యంలో నాట్లు కొనసాగుతున్నాయి. 

మధ్య ప్రదేశ్ లో కొత్త మిర్చి రాబడి - ఎగుమతి డిమాండ్ నెలకొనే అవకాశం

Image
  మధ్య ప్రదేశ్ లో కొత్త పంట ఉత్పత్తి గత ఏడాదికి ధీటుగా లేదా 5-10 శాతం తగ్గడమో పెరగడమో జరగవచ్చని భావిస్తున్నారు. మసాలా గైండింగ్ యూనిట్లు సీజన్ లో పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని భారీగా సరుకు కొనుగోలు చేసినప్పటికీ దాదాపు 75 శాతం మేర చేసిన సరుకు అమ్మకమైంది. కావున మరో రెండు - మూడు వారాలలో కొనుగోళ్లు ఊపందుకునే అవకాశం కనిపిస్తున్నది. మధ్యప్రదేశ్ మార్కెట్లలో రాబడి అయిన సరుకు వెనువెంటనే అమ్మకం కాగలదని వ్యాపారులు భావిస్తున్నారు. 

గిరాకీ తగ్గడంతో మందకొడిగా మిర్చి ధరలు

Image
   ఆంధ్రప్రదేశ్ లోని - గుంటూరు మార్కెట్ యార్డులో గత వారం నిర్వహించిన 4 రోజుల లావాదేవీలలో గుంటూరు శీతల గిడ్డంగుల నుండి 2 లక్ష బస్తాల మిర్చి రాబడి కాగా గుంటూరు సరుకు 90 వేల బస్తాలు మరియు పరిసర ప్రాంతాల సరుకు 15 వేల బస్తాలు కలిసి మొత్తం 1.05 లక్షల బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో డీలక్స్ రకాల ధరలు స్థిరంగా ఉండగా, ఇతర రకాలకు గిరాకీ తగ్గడంతో ధరలు మందకొడిగా ఉన్నాయి. లభించిన సమాచారం ప్రకారం డీలక్స్ రకాల స్టాకిస్టులు ఎగు మతి డిమాండ్ను నిరీక్షిస్తున్నారు.

తగ్గిన మిర్చి ఉత్పత్తి - డీలక్స్ రకాలకు గిరాకీ

Image
  దేశంలో 2021-22 సీజన్ మసాలా దినుసుల ఉత్పత్తి ముందు సీజన్తో పోలిస్తే 1.10 కోట్ల టన్నుల నుండి 1.5 స్వల్పంగా క్షీణించి 1.09 కోట్ల టన్నులకు పరిమితమైందని, తద్వారా మిర్చి ఉత్పత్తి 20 ల.ట. నుండి 19 ల.ట.కు పరిమితమైందని మసాలా బోర్డు విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది. ప్రస్తుతం ఉత్పాదక ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సేద్యం కుంటుపడుతోంది. అయితే, పంట విత్తేందుకు మరో రెండు నెలల సమయం ఉంది. రైతులకు తమ ఉత్పత్తిపై లాభసాటి ధరలు గిట్టుబాటవుతున్నందున సేద్యం శరవేగంతో విస్తరిస్తున్నారు. అయితే, గత ఏడాది ఎదుర్కొన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి పంటకు సోకే కీటకాలపై కూడా దృష్టి సారిస్తున్నారు.

ఆంధ్ర్రప్రదేశ్ లో తగ్గిన మిర్చి సేద్యం

Image
  ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జూన్ 1 - ఆగస్టు 10 మధ్య కాలంలో రుతుపవనాల వర్షాలు సాధారణంతో పోలిస్తే 304 మి.మీ.కు గాను 355.8 మి.మీ. వర్షపాతం నమోదైనందున ఆగస్టు 10 నాటికి మిర్చి సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 84,762 హెక్టార్ల నుండి తగ్గి కేవలం 24,443 హెక్టార్లకు పరిమితమైంది. సీజన్ పర్యంతం మిర్చి సేద్యం 12-13 శాతం తగ్గగలదని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మార్కెట్లో గత వారం నిర్వహించిన 4 రోజుల లావాదేవీలలో 1.25 లక్షల బస్తాల సరుకు రాబడి అయింది. గుంటూరు శీతల గిడ్డంగుల నుండి 1 లక్ష బస్తాలు మరియు పరిసర ప్రాంతాల నుండి 25 వేల బస్తాలు కలిసి మొత్తం 1.25 లక్షల బస్తాల సరుకు అమ్మకం అయింది. 

ఇతర రాష్ట్రాలలో పెరిగిన మిర్చి స్టాకిస్టుల అమ్మకాలు

Image
  లభించిన సమాచారం ప్రకారం పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ లాంటి రాష్ట్రాలలో ఈ ఏడాది మిరప వ్యాపారులకు మంచి లాభాలు చేకూరుతున్నాయి. తద్వారా స్టాకిస్టుల అమ్మకాలు పెర గడం వలన మిరప ఉత్పాదక రాష్ట్రాలలో మందకొడి గమనించబడింది మరియు వ్యాపారుల అంచనా ప్రకారం సరుకు కొరత ఉంది. ఇతర రాష్ట్రాలలో నిల్వ అయిన 50 శాతం సరుకు నెల రోజులలో అమ్మకం అయిన తరువాత తిరిగి కొనుగోళ్లు ప్రారంభం కాగలవు. ఎందుకనగా కొత్త సీజన్ కోసం మరో 6 నెలల సమయం ఉంది. మధ్య ప్రదేశ్లో నవంబర్ వరకు కొత్త సరుకు నిమ్ముతో ఉండగలదు. అయితే మర ఆడించే యూనిట్లకు ఎండు సరుకు అవసరం ఉంటుంది.

డీలక్స్ మిర్చి రకాల ధర పెరిగే అంచనాతో తగ్గిన విక్రయాలు

Image
  గుంటూరు మార్కెట్లో గతవారం 5 రోజుల వ్యాపారంలో గుంటూరు మరియు పరిసర ప్రాంతాల కోల్డు స్టోరేజీల నుండి 2.90 లక్షల బస్తాల రాబడిపై గుంటూరు ఎసి సరుకు 1.50 లక్షల బస్తాలు మరియు పరిసర కోల్డు స్టోరేజీల 50,000 బస్తాలు కలిసి 2 లక్షల బస్తాల సరుకు అమ్మకమెంది. ఇందులో నాణ్య మెన డీలక్స్ రకాల ధరలు భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉండడంతో ఈ ఏడాది ఎసిలలో నిల్వ చేసిన సరుకు విక్రయించడానికి పెద్ద స్టాకిస్టులు ఆసక్తి చూపడం లేదు. దీనితో ఎక్కువగా గత ఏడాది మరియు అంతకంటే ముందు సంవత్సరం సరుకు అమ్మకం కోసం మార్కెట్లకు చేరుతున్నది. లభించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం తేజ డీలక్స్ ధరలు స్థిరంగా ఉండగా, తేజ మీడియం, మీడియం బెస్ట్ రకాల అమ్మకాలు తగ్గడంతో ధర రూ. 1000-1500 క్షీణించాయి.

ఆంధ్ర, తెలంగాణ లో మిర్చి విస్తీర్ణం భారీగా తగ్గే సూచన

Image
  వ్యాపారస్తుల కథనం ప్రకారం ఈ ఏడాది ఆంధ్ర, తెలంగాణ లలో మిరప విత్తనాల అమ్మకాలు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో 2022-23 సీజన్లో ఉత్పత్తి భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. కొందరు రైతుల అభిప్రాయం ప్రకారం గత ఏడాది మాదిరిగా వచ్చే సీజన్లో కూడా పంటకు చీడపీడల బెడద ఉండగలదని భావిస్తూ, రెత్తులు మిరప స్థానంలో పత్తి లాంటి ఇతర పంటల సాగుకు మొగ్గుచూపుతున్నారు. ఎందుకనగా దిగుబడి తగ్గడం వలన సీజన్లో నాణ్యమైన సరుకుకు రూ. 18,000-20,000 ప్రతి క్వింటాలు ధర లభించినప్పటికీ, గిట్టుబాటు ఉండదు. ఈ ఏడాది దక్షిణ భారతంలో ఉత్పత్తి తగ్గడం మరియు వచ్చే ఏడాది కూడా ఉత్పత్తి తగ్గినట్లయితే, 2022 దీపావళి నాటికి మిరప ధరలు రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉంది. 

భారీగా పెరగనున్న మిరప ధరలు?

Image
  గత ఏడాది ఆంధ్ర ప్రదేశ్లో రికార్డు స్థాయిలో మిరప సాగైన తరువాత భారీ వర్షాలతో పాటు చీడపీడల బెడద కారణంగా దిగుబడితో పాటు పంట ఉత్పత్తి తగ్గడంతో సీజన్ ప్రారంభం నుండే ధరలు అధికంగా ఉన్నాయి. తేజ డీలక్స్ ధర రూ. 18,000 వరకు చేరినప్పటికీ, రాబోవు సీజన్ కోసం రెతులు ఎక్కువగా ముందుకు రావడం లేదు. ఎందుకనగా ధరలు పెరిగినప్ప టికీ, విక్రయించడం వలన మొత్తం ధర లభించకపోవడంతో రైతులు పత్తి, మొక్క జొన్న మొదలగు పంటల సాగుకు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం నిల్వలు గత ఏడాదితో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. ఇందులో కూడా నాణ్యమైన రకాల తక్కువగా ఉండడంతో ప్రముఖ వ్యాపారులు భవిష్యత్తులో తేజ, సూప ర్-10 వంటి రకాల ధర రూ. 25,000-26,000 ప్రతి క్వింటాలుకు మించ గలదని అంచనా వేస్తున్నారు. అయితే కొందరు వ్యాపారులు డీలక్స్ రకాలు విక్రయించిన తరువాత తిరిగి కొనుగోలు చేస్తున్నారు. ఇందుకు ముఖ్య కారణమేమనగా పెద్ద వ్యాపారులు ఆగస్టులో తేజ రూ. 24,000, డిసెంబర్లో రూ. 29,000 వరకు చేరే అంచనా కలదని వీరి అభిప్రాయం. 

మిర్చి విస్తీర్ణం తగ్గే అంచనాతో పెరిగిన ధరలు

Image
  వ్యాపారస్తుల కథనం ప్రకారం వచ్చే సీజన్ కోసం విస్తీర్ణం తగ్గే అంచనాతో పాటు ప్రస్తుతం నాణ్యమైన సరుకుల నిల్వలు తగ్గి నందున మిరప ధర లకు బలం చేకూరుతున్నది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మార్కెట్లో గత వారం నిర్వహించిన 5 రోజుల లావాదేవీలలో 65 వేల బస్తాల రైతుల సరుకు రాబడి కాగా 60 వేల బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో అన్ని డీలక్స్ రకాల ధర రూ. 1000-1500, తేజతో పాటు అన్ని రకాల తాలు కాయలు రూ. 500-800 ప్రతి క్వింటాలుకు వృద్ధి చెందాయి.

మే 16 నుండి గుంటూరు మిర్చి యార్డుకు వేసవి సెలవులు

Image
  ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వేసవితాపం కారణంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా 16 మే సోమవారం నుండి జూన్ 12 ఆదివారం వరకు అధికారులు వేసవి సెలవులు ప్రకటించారు. తద్వారా రైతుల సరుకు రాబడులు మరియు లోడింగ్- అన్లోడింగ్ లాంటివి ఉండబోవు. గుంటూరులో గత వారం 4 రోజుల లావాదేవీలలో 3 లక్షల బస్తాల మిరప రాబడి కాగా, 15-20 శాతం నాణ్యమైన మరియు 80 శాతం మీడియం, మీడియం బెస్ట్ రకాలు ఉండగా, 2.90 లక్షల బస్తాల సరుకు అమ్మకం అయింది. డీలక్స్ రకాలకు మండి డిమాండ్ ఉన్నప్పటికీ, క్వాలిటీ లేకపోవడంతో పాటు మీడియం, మీడియం బెస్ట్ రకా లలో రూ. 500-1000 ప్రతి క్వింటాలుకు తగ్గి నాణ్యతనుసారం వ్యాపారం అయింది.లభించిన సమాచారం ప్రకారం ప్రతి ఏడాది చివరి విడత మిర్చి పంట కోతలకు బదులు చెట్లమీదనే వదిలివేస్తుండేవారు. ఎందుకనగా మంచి ధర లభించ కపోవడంతో పాటు కూలీల వ్యయం భరించాల్సి వచ్చేది. కాని ప్రస్తుతం పెరుగుతున్న ధరలను పరిగణిస్తూ, చివరి పంట కోతలు కూడా పూర్తి చేసి సరుకు మార్కెట్లలో అమ్మకానికి తేవడం జరుగుతున్నది. కాబట్టి వచ్చే వారం రాబడులు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని కందుకూరు,పొదిలి పరిసర ప్రాంతాల నుండి తేజ, 341 ర...

ఎగుమతి డిమాండ్ తగ్గడంతో మందగమనంలో మిర్చి ధరలు

Image
  దేశంలోని అన్ని మిరప ఉత్పాదక రాష్ట్రాలలో కలిసి వారంలో సుమారు 10 లక్షల బస్తాలకు పైగా సరుకు రాబడిపై 90 శాతం అమ్మకమైంది.గుంటూరు మార్కెట్లో గత వారం 5 రోజుల మార్కెట్లో 4.70 లక్షల బస్తాల కొత్త మిరప రాబడిపై మీడియం, మీడియం బెస్ట్ రకాలు అధికంగా ఉన్నాయి. మరియు 4 లక్షల బస్తాల అమ్మకంపై తేజ మీడియం, మీడియం బెస్ట్ రకాలు రూ. 1000-2000, తేజ తాలు రూ. 500 తగ్గాయి. ఇందుకు ముఖ్య కార ణమేమనగా, చైనా, బంగ్లాదేశ్ మొదలగు మిరప దిగుమతి దేశాల ద్వారా డిమాండ్ తగ్గడంతో పాటు స్థానిక యూనిట్ల కోసం డీలక్స్ రకాలకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, మార్కెట్లలో వీటి రాబడి కేవలం 10-15 శాతం అవుతున్నాయి. తీవ్ర ఎండల కారణంగా మే 9 నుండి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఒక నెల రోజుల పాటు వేసవి సెలవులు ప్రకటించనున్నది. 

భారీగా తగ్గిన మిరప నిల్వలు - హెచ్చుముఖంలో ధరలు

Image
  గుంటూరు మార్కెట్లో గత సోమవారం నుండి బుధవారం వరకు 3 రోజుల మార్కెట్లలో 2.90 లక్షల బస్తాల కొత్త మిరప రాబడి కాగా, 2.80 లక్షల బస్తాల సరుకు అమ్మకం అయింది. ఇందులో ' నాణ్యమైన సూపర్ డీలక్స్ రకాల సరుకు కొరతతో 355 బడిగ, సూపర్-10, బంగారం మొదలగు రకాల ధరలు రూ. 400-500 పెరిగాయి. తమిళనాడులో కౌంటర్ సేల్ కోసం నాణ్యమైన సరుకులకు డిమాండ్ రావడంతో రూ. 20,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. అయితే ఇతర డీలక్స్ రకాలు రూ. 19,000-19,500 ధరతో వ్యాపారం అయ్యాయి. గత వారం శీతల గిడ్డంగులలలో నిల్వ అయిన తేజ రకం రూ. 19,000తో పాటు డీలక్స్ సరుకు కొరత మరియు పౌడర్ రకాల కొనుగోళ్లతో మీడియం, మీడియం బెస్ట్ రకాలకు డిమాండ్ నెలకొనడంతో ధర రూ. 200 పెరిగింది.

గుంటూరు కోల్డ్ స్టోరేజ్ లలో మిర్చి నిల్వలు తగ్గే అంచనా

Image
  గుంటూరు మార్కెట్లో దినసరి సగటున 1 లక్ష బస్తాల మిరప రాబడి అవుతోంది. గత వారం 4 రోజుల మార్కెట్లలో 3.80 లక్షల బస్తాల కొత్త మిరప రాబడి కాగా, మిగులు నిల్వలు సహా 4 లక్షల బస్తాల సరుకు అమ్మకం అయింది. ఇందులో తేజ డీలక్స్ రూ. 300, నెంబర్-5, సింజెంట బడిగ, 334, సూపర్-10, అన్ని మీడియం, మీడియం బెస్ట్, తేజ తాలు, మిగతా రకాలతో పాటు ఇతర తాలు రకాలలో రూ. 500, తేజ మీడియం, మీడియం బెస్ట్, ఆర్మూర్, బుల్లెట్ రకాలు రూ. 800, డిడి, 341, 355-బడిగ, బంగారం రకాలు రూ. 1000 మరియు 2043 రకం ధర రూ. 1500 ప్రతి క్వింటాలుకు పెరిగింది. పచ్చళ్ళ తయారీదారుల కోసం పౌడర్ రకాలకు డిమాండ్ పెరుగుతున్నది. అయితే డీలక్స్ రకాల కొరతతో ఎక్కువగా మీడియం, మీడియం బెస్ట్ రకాల సరుకు అమ్మకం అవుతోంది.