గిరాకీ తగ్గడంతో మందకొడిగా మిర్చి ధరలు
ఆంధ్రప్రదేశ్ లోని - గుంటూరు మార్కెట్ యార్డులో గత వారం నిర్వహించిన 4 రోజుల లావాదేవీలలో గుంటూరు శీతల గిడ్డంగుల నుండి 2 లక్ష బస్తాల మిర్చి రాబడి కాగా గుంటూరు సరుకు 90 వేల బస్తాలు మరియు పరిసర ప్రాంతాల సరుకు 15 వేల బస్తాలు కలిసి మొత్తం 1.05 లక్షల బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో డీలక్స్ రకాల ధరలు స్థిరంగా ఉండగా, ఇతర రకాలకు గిరాకీ తగ్గడంతో ధరలు మందకొడిగా ఉన్నాయి. లభించిన సమాచారం ప్రకారం డీలక్స్ రకాల స్టాకిస్టులు ఎగు మతి డిమాండ్ను నిరీక్షిస్తున్నారు.
గుంటూరు మార్కెట్లో 334, సూపర్-10లతో పాటు ఇతర సీడ్ రకాలకు మంచి డిమాండ్ నెలకొన్నది. తేజ,4884, ఆర్మూర్ మొదలగు రకాలకు గిరాకీ క్షీణించింది. అయితే మీడియం, మీడియం బెస్ట్ రకాలు ఎక్కువగా అమ్మకం అవుతున్నందున నాణ్యతాను సారం వ్యాపారమెంది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం మధ్య ప్రదేశ్ లో పంట కోతలు ప్రారంభమైనందున మరో 20 రోజులలో రాబడులు పెరిగే అవ కాశం కలదు. దీనితో ఉత్తర భారత వ్యాపారులు ఎసి సరుకు విక్రయిస్తు న్నారు. ఎందుకనగా ప్రస్తుత వాతావ రణ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే పంట మెరుగ్గా ఉండే అవకాశం కలదు. ఛత్తీస్ గఢ్ లోని జగదల్ పూర్ లో గత వారం 5-6 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ రూ. 18,000-22,000, 4884 రూ. 17,000 -20,000, తాలు కాయలు తేజ రూ. 12,000-13,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపార మైంది.
ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు మార్కెట్ లో గత వారం ఎసి తేజ నాణ్యమైన సరుకు రూ. 17,000 -22,500, బడి గ-355 రూ. 20,000-29,000, సింజెంట బడిగ రూ. 20,000-28,000, డిడి, 341 రూ. 20,000-29,000, నంబర్-5 రూ. 20,000-28,000, 273 రూ. 20,000-27,000, సూపర్-10, 334 రూ. 17,000-25,500, డీలక్స్ రూ. 25,600-26,000, ఆర్మూర్ రకం రూ.17,000 - 22,500, 4884 రూ. 17,000 - 21,500,రొమి రూ. 17,000- 21,500, 577 రకం రూ. 20,000-27,500, బుల్లెట్ రూ. 18,000-25,000, బంగారం రకం రూ. 20,000-25,500, 2043 రూ. 28,000-39,000, తాలు కాయలు తేజ రూ. 12,500–13,500, ఇతర రకాలు రూ. 8000-14,500 ప్రతి క్వింటా లు ధరతో వ్యాపారమైంది.
తెలంగాణలోని వరంగల్ మార్కెట్లో 18-20 వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై తేజ రూ. 21,000-22,000, మీడియం రూ. 19,000-22,000, 341 నాణ్యమైన సరుకు రూ. 28,000, మీడియం రూ. 22,000-26,000, నాణ్యమైన వండర్పట్ రూ. 35,000, మీడియం రూ. 28,000-33,000, 1048 రకం సరుకు రూ. 27,000, నాణ్యమైన టమాటా రకం రూ. 80,000, మీడియం రూ. 60,000-70,000, సింగల్ పట్టి రూ. 50,000 (గత ఏడాది సరుకు) ప్రతి క్వింటాలు ధరతో వ్యారమైంది.
ఖమ్మం కోల్డ్ స్టోరేజీలో ఇంతవరకు 9,00,700 బస్తాల మిరప నిల్వలు ఉన్నట్లు సమాచారం. కాగా గత వారం 55-60 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ నాణ్యమైన సరుకు రూ. 23,000, మీడియం రూ. 20,000-21,000, తాలు కాయలు తేజ రూ. 12,500 మరియు 3000-3500 బస్తాల రైతుల సరుకు రాబడి పై నాణ్యమైన తేజ రూ. 14,500-17,500 ధరతో వ్యాపారమైంది.
హైదరాబాద్ లో గత వారం శీతలగిడ్డంగుల నుండి 3000-3500 బస్తాల ఎసి సరుకు రాబడిపై డబ్బి బడిగ రూ. 30,000-45,000, 341 నాణ్య మైన సరుకు రూ. 28,000, మీడియం రూ. 20,000-27,500, సి-5 రూ. 20,000-26,000, డిడి రూ. 20,000-29,000, నాణ్య మైన తేజ రూ. 24,000, మీడియం రూ. 16,000-23,000, సూపర్-10 నాణ్యమైన సరుకు రూ. 25,000-26,500, మీడియం రూ. 20,000-22,000, 273 నాణ్య మైన సరుకు రూ. 27,000-27,500, మీడియం బెస్ట్ రూ. 20,000-24,000, మీడియం రూ. 17,000-19,000, తాలు కాయలు తేజ నాణ్యమైన సరుకు రూ. 13,500-14,000, మీడియం రూ. 9000-13,000, హైబ్రిడ్ సరుకు రూ. 8000-10,500 ధరతో వ్యాపారమైంది.
కర్ణాటకలోని బాడిగి లో గత సోమ, గురువారం కలిసి 27 వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు రాబడి కాగా, 13 వేల బస్తాల సరుకు అమ్మకమెంది. ఇందులో డబ్బి రూ. 45,000-47,000, కెడి ఎల్ డీలక్స్ రూ. 43,000-45,000, నాణ్యమైన సరుకు రూ. 38,000-43,000, మీడియం రూ. 16,000-20,500, 2043 డీలక్స్ రూ. 38,000-42,500. నాణ్య మైన సరుకు రూ. 34,000-37,000, 5531 రూ. 24,500-30,000, డిడి రూ. 29,500-31,000, సూపర్-10, 334 రూ. 23,000-25,000, తాలు కాయలు 5531 రూ. 9500-13,000, కెడిఎల్ రూ. 5000-6000 మరియు సింధనూరులో మంగళవారం నాడు 300-400 బస్తాల ఎసి సరుకు అమ్మకం కాగా సింజెంట బడిగ రూ. 40,000-41,000, సి-5 మరియు 5531 రకాలు రూ. 25,000-26,000, తేజ రూ. 23,000-24,000, తాలు కాయలు రూ. 10,000-11,000, మీడియం తాలు కాయసు రూ. 7500-8000 ధరతో వ్యాపారమెంది. తమిళనాడులోని రామనాథపురం మార్కెట్లో గత వారం 150–200 బస్తాల మిర్చి రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 25,000-25,500, మీడియం రూ. 15,500-16,000, యావరేజ్ సరుకు రూ. 15,000-15,500, తాలు కాయలు రూ. 6500, పరమకుడిలో 200 బస్తాలు నాణ్యమైన సరుకు రూ. 24,000-25,000, మీడియం రూ. 15,000-20,000, యావరేజ్ సరుకు రూ. 14,000, తాలు కాయలు రూ. 6500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు