రికార్డు బద్దలు కొడుతున్న మిరప ధరలు

 



 లభించిన సమాచారం ప్రకారం వరంగల్ ప్రాంతంలో ఈ ఏడాది 334 రకం మిరప విస్తీర్ణం పెరిగిన నేప ధ్యంలో ఇతర రకాల రాబడులు తగ్గే అంచనా కలదు. లభించిన సమాచారం ప్రకారం విస్తీర్ణం, ఉత్పత్తి అంచనా మరియు నిల్వలను పరిగణలోకి తీసుకుంటే 2022-23 లో మరోసారి ధరలు పెరిగే అంచనా కలదు. వ్యాపారుల అభిప్రాయం ప్రకారం మధ్య ప్రదేశ్ లోని బేడియాలో ఆది, గురు, శనివారాలలో కలిసి 22-25 వేల బస్తాల కొత్త సరుకు రాబడి అయింది. అనగా గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే రాబడులు తగ్గాయి. నిమ్ము రకం సరుకు రాబడులు అవుతున్నందున ఆంధ్ర, తెలంగాణలలో మర ఆడించే యూనిట్లు కొనుగోలుకు ముందుకు వస్తున్నందున నాణ్యమైన వండర్ హాట్ ధర పెరిగి రూ. 38,000 వరకు చేరింది. రాబోవు రోజులలో ధరలు మరింత వృద్ధిచెందే అంచనా కలదు. 


ఎందుకనగా వరంగల్ టమాటా మిరప ధర రూ. 80,000-90,000, కర్ణాటకలోని బ్యాడిగి లో ఎసి డబ్బి రకం సరుకు రూ. 44000-49,000, కె.ఎల్ డిలక్స్ రూ. 43,000-45,500, నాణ్యమైన కెడిఎల్ రూ. 41,000-43,000 వరకు చేరడంతో స్టాకిస్టులు అప్రమత్తమ య్యారు. నడికుడిలో 2 వేల బస్తాల ఎసి మిరప రాబడిపై సూపర్-10 రకం రూ. 26,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపార మెంది. గుంటూరు, ప్రకాశం, క్రిష్ణా జిల్లాలలో కురిసిన వర్షాలవలన పంటకు లాభం చేకూరింది. అయితే వాస్తవిక పరిస్థితి నంబర్ 15 నాటికి ముందుకు రాగలదు. ఎందుకనగా ఇంతవరకు విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే తగ్గింది. 


గుంటూరు మార్కెట్లో గతవారం కోర్టు స్టోరేజీల నుండి దాదాపు 2.60 లక్షల బస్తాల రాబడిపై గుంటూరు ఎసి 1.30 లక్షల బస్తాలు మరియు పరిసర ఎసి 30 వేల బస్తాలు కలిసి 1.60 లక్షల బస్తాల సరుకు అమ్మకమయింది. ఇందులో డీలక్స్ రకాలకు డిమాండ్ ఉండడంతో తేజ, డిడి, 341 రకం, 4884 రకం,

రోమి, బుల్లెట్ రకం, 577 రకాల ధరలు రూ. 500 మరియు 355 బడిగ, 273 రకాలు రూ. 1500, సింజెంట బడిగ, ఆర్మూర్, 2043 రకం, 334, సూపర్-10, బంగారం రకాల ధరలు రూ. 1000 వృద్ధిచెందగా, తాలు రకాల ధరలు స్థిరంగా ఉన్నాయి.మిరప అమ్మకందారులు మార్కెట్లో నాణ్యమైన రకాలను తక్కువగా మరియు గత ఏడాది (బిఎఫ్) మరియు సిఎఫ్, నాసిరకాలు ఎక్కువగా తెస్తున్నారు. గుంటూరు కోర్టు స్టోరేజీలలో నిల్వ అయిన నాణ్యమైన తేజ రూ. 18,000-23,000, డీలక్స్ ఎక్స్ ట్రార్డినరీ రూ. 23,200-23,500, ఎక్కువగా సరుకు రూ. 20,000-22,500, 355 బ్యా డ్లీ రూ. 22,000-31,000, డీలక్స్ రూ. 31,200-31,500, సింజెంటా బ్యా డ్జీ రూ. 21,000-29,000, డిడి రూ. 20,000-29,000, 341 రకం రూ. 20,000-29,500, డీలక్స్ రూ. 29,600-30,000, నెం.5 రకం రూ. 20,000-20,000, 273 రకం రూ. 22,000-29,000, 334 మరియు సూపర్-10 రకాలు రూ.17,500

-26,500, డీలక్స్ రూ. 26,60027,000, ఆర్మూరు రూ. 17,000 -23,000, డీలక్స్ రూ. 22,200 – 23,500, 4884 రకం రూ. 17,000-22,000, రోమి రూ. 17,000 – 21,500, 577 రకం రూ. 20,000– 27,500, బులెట్ రూ. 18,000 -24,500, బంగారం రూ. 18,00026,500, 2043 రకం రూ.30,00041,000, తేజ తాలు రూ. 12,000

-13,000, తాలు రూ.6500-14500

ధరతో వ్యాపారమయింది. 


వరంగల్లో

వారంలో దాదాపు

15–20 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై నాణ్యమైన తేజ రూ. 20,000–22,000, మీడియం రూ. 19,000-20,000,

నాణ్యమైన 341 రకం రూ. 28,000, మీడియం రూ. 20,000-26,000, నాణ్యమైన వండర్ట్ రూ. 35,000, మీడియం రూ. 30,000–33,000, 1048 రకం రూ. 22,400, నాణ్యమైన దీపికా రూ. 34,000, మీడియం రూ. 27,000–32,000, నాణ్యమైన టమాటా రూ. 90,000, మీడియం బెస్ట్ రూ. 80,000, మీడియం రూ.65,000 -75,000, నాణ్యమైన సింగల్పట్టి రూ. 50,000, మీడియం రూ. 20,000 -38,000, తేజ తాలు రూ. 11,00013,000 మరియు 


ఖమ్మంలో గతవారం 45-50 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై నాణ్యమైన తేజ రూ. 22,925, మీడియం

రూ. 21,000–22,000, తేజ తాలు రూ.

12,300 ధరతో వ్యాపారమయింది.


హైదరాబాద్లో

గతవారం కోల్డు స్టోరేజీల నుండి 2 వేల బస్తాల సరుకు అమ్మకంపై డబ్బీ బ్యాడ్లీ రూ. 30,000-45,000, నాణ్యమైన 341 రకం రూ. 28,000-30,000, మీడియం రూ. 26,000-27,000, సి-5 రకం రూ. 25,000, తేజ రూ. 16,000-22,500, నాణ్యమైన సూపర్-10 రకం రూ. 25,000-26,000, మీడియం రూ. 20,000-22,000, 273 రకం రూ. 24,000-27,000, నాణ్య మైన తేజ తాలు రూ. 11,000-13,000, మీడియం రూ. 9000-10,000, హైబ్రిడ్ తాలు రూ. 8000-8500 ధరతో వ్యాపారమయింది.


కర్నాటక లోని బ్యాడ్గి లో సోమ, గురు - వారాలలో కలిసి 200 బస్తాల కొత్త సరుకు రాబడిపె 5531 రకం సరుకు రూ.

26,000-29,500, తాలు రూ. 10,000-14,000 మరియు 40 వేల బస్తాల ఎసి సరుకు రాబడి కాగా, 20-22

వేల బస్తాల సరుకు అమ్మకం అయింది. ఇందులో డబ్బి రూ. 44,000-49,000, కేడిల్ డీలక్స్ రూ. 43,000-45,500, నాణ్య మైన కెడి ఎల్ రూ. 41,000 - 43,000, మీడియం రూ. 17,00018,500, డీలక్స్ 2043 రకం రూ. 40,000-43,500, నాణ్య మైన 2043 రకం రూ. 34,000-37,000, 5531 రకం రూ. 24,500-28,000, 5531 తాలు రూ. 9000-11,000, కెడిఎల్ తాలు రూ. 4000-5000, 


సింధనూరులో ఆంధ్ర

ప్రాంతం నుండి 100 బస్తాల కొత్త మిరప రాబడి పె 5531 నిమ్ము రకం సరుకు రూ.27,000-29,000 మరియు శీతల గిడ్డంగుల నుండి 300-400 బస్తాల అమ్మకం కాగా, సింజెంట బడిగ రూ.40,000-42,000, జిటి సూపర్-10 రకం రూ. 24,000-25,000 తేజా రూ. 23,000-24,000, నాణ్యమైన తాలు రూ. 12,500-13,000, మీడియం రూ. 8000-10,000 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది. లభించిన సమాచారం

ప్రకార0 

మధ్యప్రదేశ్లోని ఉత్పాదక కేంద్రాల వ్రద్ద వర్షాల కారణంగా ఎక్కువగా సరుకు 60-70 శాతం నిమ్ముతో వస్తున్న్న నేపథ్యంలో నాణ్య మెన సరుకులకు డిమాండ్ ఉండడంతో ధరలు హెచ్చుముఖంలో ఉన్నాయి.

మధ్య ప్రదేశ్ లోని బేడియాలో ఆది మరియు గురువారాలలో కలిసి 9-10 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపె మహీ ఫూల్ కట్ రూ. 17,000-21,000, తొడిమతో రూ. 17,500-19,500, లాల్ కట్ రూ. 16,000-18,000, ఫూల్ కట్ తాలు రూ.10,000-13,000, తొడిమతో తాలు రూ. 9000-11,000, ఛత్తీస్ ఘడ్ లోని జగదల్ పూర్ లో 8-10 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ రూ. 18,000-22,500, 4884 రకం రూ. 19,000 - 20,500, తేజ తాలు రూ. 12,000- 13,000 ధరతో వ్యాపారమైంది. 

తమిళనాడులోని రామనాథపురం, పరమకుడి ప్రాంతాల కోల్డ్ స్టోరేజీలలో నిల్వ అయిన నాణ్యమైన గుండు మిరప రూ. 30,500-31,500, మీడియం రూ. 25,000-27,000, యావరేజ్ రూ. 22,000-23,000, తొడిమెలేకుండా రూ. 27,000-33,000, తాలు రూ. 7000-7500, రైతుల గుండు మిరప రూ. 19,000-20,000, మీడియం రూ. 16,000-17,000, తాలు రూ. 6000-6500 ధరతో వ్యాపారమెంది.

Comments

Popular posts from this blog