మధ్య ప్రదేశ్ లో కొత్త మిర్చి రాబడి - ఎగుమతి డిమాండ్ నెలకొనే అవకాశం

 

మధ్య ప్రదేశ్ లో కొత్త పంట ఉత్పత్తి గత ఏడాదికి ధీటుగా లేదా 5-10 శాతం తగ్గడమో పెరగడమో జరగవచ్చని భావిస్తున్నారు. మసాలా గైండింగ్ యూనిట్లు సీజన్ లో పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని భారీగా సరుకు కొనుగోలు చేసినప్పటికీ దాదాపు 75 శాతం మేర చేసిన సరుకు అమ్మకమైంది. కావున మరో రెండు - మూడు వారాలలో కొనుగోళ్లు ఊపందుకునే అవకాశం కనిపిస్తున్నది. మధ్యప్రదేశ్ మార్కెట్లలో రాబడి అయిన సరుకు వెనువెంటనే అమ్మకం కాగలదని వ్యాపారులు భావిస్తున్నారు. 


ఎందుకనగా, తాజా సమాచారం ప్రకారం రాబోయే సీజన్ కోసం సేద్యం వెనుకబడే అవకాశం ఉంది. అయితే మరో నెల రోజులలో సేద్యంపై పూర్తి స్పష్టత రాగలదు. ప్రస్తుత సీజన్ లో రుతుపవనాల వర్షాలు జూన్ 1 - సెప్టెంబర్ 7 వరకు ఆంధ్రప్రదేశ్ లో సాధారణ వర్షపాతంతో పోలిస్తే 453 మి.మీ. నుండి స్వల్పంగా పెరిగి 458 మి.మీ. నమోదైంది. తద్వారా సెప్టెంబర్ 7 నాటికి మిర్చి సేద్యం గత ఏడాది 88,803 హెక్టార్లకు గాను 16.41 పెరిగి 1,03,380 హెక్టార్లకు విస్తరించింది. అయితే, తొలినాళ్లలో విత్తిన పంటకు కొంత మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుసున్న వర్షాలకు మిర్చి రాబడులు సన్నగిల్లాయి. అంతే కాకుండా, వర్షాలకు తడిసిన సరుకు ప్రతి క్వింటాలు రూ. 18,000-24,000 డిమాండ్తో నాణ్యతానుసారం విక్రయించ బడుతున్నది. కావున వర్షాలు తగ్గిన తర్వాతనే కొత్త సరుకు రాబడులు పెరగగలవు. ఆంధ్రలోని గుంటూరు మార్కెట్ యార్డులో గత వారం నిర్వహించిన 5 రోజుల లావాదేవీలలో గుంటూరు శీతల గిడ్డంగుల నుండి 2.70 లక్షల బస్తాల మిర్చి రాబడి కాగా గుంటూరు సరుకు 1.30 లక్షల బస్తాలు మరియు పరిసర ప్రాంతాల సరుకు 40 వేల బస్తాలు కలిసి మొత్తం 1.70 లక్షల బస్తాల సరుకు అమ్మకం పై ఎగుమతి డిమాండ్ నెలకొనడంతో తేజ ఎగబాకుతు బెస్ట్ ఎక్స్ ట్రా ఆర్డినరిలో రూ. 1000-1500, తేజ డీలక్స్, మీడియం, మీడియం బెస్ట్ రూ. 1000, 334, సూపర్-10 రకాలలో రూ. 800 వృద్ధిచెందగా, 334, సూప 5-10 ఎక్స్ ట్రా ఆర్డినరి రకాలు రూ. 26,800 ధరతో వ్యాపారమెంది. మరియు 341, ఆర్మూర్, 4884, బంగారంతో పాటు అన్ని సీడ్ రకాల ధరలు రూ. 500 పెరగగా, ఇతర రకాల ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం డీలక్స్ రకాలకు మంచి డిమాండ్ ఉన్నందున రాబోవు రోజులలోరూ. 1000 వృద్ధిచెందే అంచనాతో స్టాకిస్టులు ఈ ఏడాది నిల్వ చేసిన సరుకు విక్రయించడానికి విముఖత చూపుతు న్నారు. అయితే గత ఏడాది నిల్వ అయిన సరుకు విక్రయాలు క్వాలిటీ ప్రకారం అవుతోంది

ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు మార్కెట్ లో గత వారం ఎసి తేజ నాణ్యమైన సరుకు రూ. 17,500-23,000, డీలక్స్ రూ. 23,200 -23,500, ఇందులో ఎక్కు వ గా సరుకు రూ. 21,000 -22,500, బడి గ-355 రూ. 20,000-29,000, సింజెంట బడి గ రూ. 20,000-28,000, డిడి, 341 రూ. 20,000-29,000, 341 డీలక్స్ రూ. 29,200-29,500, నంబర్-5 రూ. 20,000-28,000, 273 రూ. 20,000-27,500, సూపర్-10, 334 రూ.17,000-26,000, ఆర రకం రూ. 17,000 - 23,000, 4884 రూ. 17,000-22,000,రోమి రూ. 17,000- 22,000, 577 రకం రూ. 20,000- 27,000, బుల్లెట్ రూ. 18,000-24,500, బంగారం రకం రూ. 20,000-26,000, 2043 రూ. 28,000-39,000, తాలు కాయలు తేజ రూ. 12,500-13,500, ఇతర రకాలు రూ. 8000-14,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

తెలంగాణలోని వరంగల్‌ మార్కెట్ లో 10-12 వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై తేజ రూ. 20,000-22,500, 341 నాణ్య మైన సరుకు రూ. 26,000-29,000, వండర్ హాట్ రూ. 26,000-29,000, 1048 రకం సరుకు రూ. 25,000-27,000ప్రతి క్వింటాలు ధరతో వ్యారమైంది. 

ఖమ్మం కోల్డ్ స్టోరేజీలో ఇంతవరకు 8,54,440 బస్తాల మిరప నిల్వలు ఉన్నట్లు సమాచారం. కాగా గత వారం 70-72 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ నాణ్యమైన సరుకు రూ. 23,000, మీడియం రూ. 20,000-21,000, తాలు కాయలు తేజ రూ. 12,800 మరియు 4500 బస్తాలరైతుల సరుకు రాబడి పై నాణ్యమైన తేజ రూ. 14,500-17,500 ధరతో వ్యాపారమైంది. 

హైదరాబాద్ లో గత వారం శీతలగిడ్డంగుల నుండి 3 వేల బస్తాల ఎసి సరుకు రాబడి పై డబ్బి బడిగ రూ. 30,000-45,000, 341 నాణ్య మైన సరుకు రూ. 28,000-29,000, సి-5 రూ. 20,000-27,000, తేజ రూ. 16,000-23,000, సూపర్-10 నాణ్య మైన సరుకు రూ. 25,000-26,000,మీడియం రూ. 20,000-22,000, 273 నాణ్యమైన సరుకు రూ. 26,000, తాలు కాయలు తేజ నాణ్యమైన సరుకు రూ. 13,500-14,000, మీడియంరూ. 9000-13,000, హైబ్రిడ్ సరుకు రూ. 8000-11,000 ధరతో వ్యాపారమైంది. 

కర్ణాటకలోని బ్యాడ్గి లో  గత సోమ, గురువారం కలిసి 24 వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు రాబడి కాగా, 14 వేల బస్తాల సరుకు అమ్మకమెంది.ఇందులో డబ్బి రూ. 45,000-49,500, కెడిఎల్ డీలక్స్ రూ. 44,000-46,500, నాణ్యమైన సరుకు రూ. 38,000-43,000, మీడియం రూ. 16,000-21,000, 2043 డీలక్స్ రూ. 38,000-42, 500, నాణ్య మైన సరుకు రూ. 34,000-37,000, 5531 రూ. 24,500-31,200, డిడి రూ. 29,500-31,700, సూపర్-10, 334 రూ. 23,000-25,500, తాలు కాయలు 5531 రూ. 9500-13,000, కెడిఎల్ కాలు కాయలు రూ. 5000-6000 మరియు సింధనూరులో మంగళవారం నాడు 300 బస్తాల ఎసి సరుకు అమ్మకం కాగా సింజెంట బడిగ రూ. 40,000-41,000, సి-5 రూ. 27,000-29,000, సూప ర్-10 రూ. 25,000-27,000, తేజ రూ. 25,000-26,000, తాలు కాయలు రూ. 8000-11,000, మీడియం తాలు కాయలు రూ. 4000-6000 ధరతో వ్యాపారమెంది. ఛత్తీస్ గఢ్ లోని జగదల్ పూర్ లో గత వారం 6-7 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ రూ. 18,000-22,000, 4884 రూ. 17,000-19,000, తాలు కాయలు తేజ రూ. 12,000-13,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

మధ్యప్రదేశ్ లోని బేడియా మార్కెట్లో వర్షాల కారణంగా కేవలం 250 బస్తాల కొత్త మిరప రాబడి పె మాహీ రకం తొడిమెతో సహా రూ. 10,000-17,000, మహా తొడిమెలేకుండా 15,000-21,100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమెంది. కాగా సరుకు నిమ్ముతో రాబడి అవుతోంది. మరియు సరుకు రాబడులు పెరిగేందుకు మరో రెండు వారాల సమయం పట్టగలదు. అయితే రాబడులు పెరిగిన వెంటనే ఇతర రాష్ట్రాల మర ఆడించే యూనిట్ల డిమాండ్ ఉండే అవకాశం కలదు. 

తమిళ నాడులోని రామనాథ పురం మార్కెట్ లో నాణ్యమైన సరుకు రూ. 22,000-25,000, మీడియం రూ. 20,000-22,000, యావరేజ్ సరుకు రూ. 15,000-19,000, తాలు కాయలు రూ. 6000-6500, పరమకుడిలో 100-150 బస్తాల రాబడి పె రూ. 15,000-25,000 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమెంది.






Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు