వ్యాపారస్తుల కథనం ప్రకారం వచ్చే సీజన్ కోసం విస్తీర్ణం తగ్గే అంచనాతో పాటు ప్రస్తుతం నాణ్యమైన సరుకుల నిల్వలు తగ్గి నందున మిరప ధర లకు బలం చేకూరుతున్నది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మార్కెట్లో గత వారం నిర్వహించిన 5 రోజుల లావాదేవీలలో 65 వేల బస్తాల రైతుల సరుకు రాబడి కాగా 60 వేల బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో అన్ని డీలక్స్ రకాల ధర రూ. 1000-1500, తేజతో పాటు అన్ని రకాల తాలు కాయలు రూ. 500-800 ప్రతి క్వింటాలుకు వృద్ధి చెందాయి.
గుంటూరుతో పాటు ఇతర ప్రాంతాల శీతల గిడ్డంగుల నుండి గత వారం 1.75 లక్షల బస్తాల సరుకు రాబడి కాగా 1.30 లక్షల బస్తాల సరుకు విక్రయించబడింది. నాణ్యమైన సరుకుకు డిమాండ్ కొనసాగుతున్నది. తేజ, బడిగ- 355, సింజెంట బడిగ, 341, నెంబర్-5, 334, సూపర్-10 రూ. 1500–2000 మిగిలిన అన్ని రకాల ధరలు రూ. 1000-1500, సీడ్ రకం తాలు కాయలతో పాటు అన్ని రకాల తాలు కాయలు రూ. 500-1000 ప్రతి క్వింటాలుకు వృద్ధి చెందాయి. గుంటూరు మరియు పరిసర ప్రాంతాల శీతల గిడ్డంగుల నుండి దాదాపు 80 శాతం గత ఏడాది (ఫార్వర్డ్ బ్యాక్) సరుకు అమ్మకమైనట్లు సమాచారం. నాణ్య మైన సరుకు ధరలు ఇనుమడించినందున దాదాపు మొత్తం సరుకు అమ్మకమెందని చెప్పవచ్చు. ప్రస్తుతం డీలక్స్ రకాలకు ఆదరణ నెలకొన్నప్పటికీ మున్ముందు ధరలు మరింత ఇనుమడించగలవనే విశ్లేషణలు వెలువడుతున్నందున స్టాకిస్టు వ్యాపారులు తమ సరుకు విక్రయించేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. కావున మీడియం, మీడియం బెస్ట్ రకాలే రాబడి అవుతున్నాయి. ఈ సరుకు నాణ్యతానుసారం విక్రయించబడుతున్నది. ప్రస్తుతం విదేశాల కోసం తేజ, 334, సూపర్-10, బడిగ లాంటి నాణ్యమైన రకాలకు ఆదరణ కొనసాగుతున్నది.
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మార్కెట్లో ఏసి తేజ నాణ్యమైన సరుకు రూ. 18,000-20,500, డీలక్స్ రూ. 20,600-20,800, బడిగ-355 రూ.18,000-23,000, సింజెంట బడిగ రూ. 18,000-22,500, డీలక్స్ రూ. 22,600 – 22,800 మరియు 341 రూ.18,000-25,500, నంబర్-5 రూ. 18,000-24,000, 273 రూ. 18,000-22,500, సూపర్ - 10, 334 రూ. 17,000-22,000, డీలక్స్ రూ. 22,200-22,500, ఆర్మూర్ రకం రూ. 16,000 -19,500, 4884 రూ. 16,000-19,000, రోమి రూ. 15,000 18, 700, బుల్లెట్ రకం రూ. 16,000-19,500, బంగారం రకం రూ. 16,000 -20,500, 2043 రూ. 25,000 -31,000, తాలు కాయలు తేజ రూ. 10,500-11,700, ఇతర రకాల తాలు కాయలు రూ.7500-11,800, నాన్ -ఎసి తేజ రూ. 14,000-19,000, అన్ని సీడ్ రకాలు రూ. 13,000-17,000, సూపర్ - 10, 334 రూ. 14,000-17,500, తాలు కాయలు తేజ రూ. 9500 -10,500, ఇతర రకాలు రూ. 6000-8000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
వరంగల్ మార్కెట్లో గత వారం 20-25 వేల బస్తాల సరుకు రాబడిపై తేజ రూ. 13,000-16,500, 341 రూ. 12,500-14,000, వండర్ హాట్ రూ. 19,000-21,000, దీపిక రూ. 18,000-20,000, శీతల గిడ్డంగుల సరుకు తేజ రూ. 18,000–19,600, 341 రూ. 21,000-24,500, దీపిక రూ. 20,000-23,000, వండర్ హాట్ రూ. 23,000-26,000,
ఖమ్మంలో 22 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపె తేజ నాణ్యమైన సరుకు రూ. 20,000, మీడియం రూ. 18,500-19,500, తాలు కాయలు తేజ రూ. 11,500 JA కు రాబడిపై నా .... మరియు 20–22 బస్తాల రైతుల రూ. ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 18,000, తాలు కాయలు రూ. 9700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
హైదరాబాద్లో గత వారం ఎసి మరియు రైతుల సరుకు కలిసి 8–10 వేల బస్తాల రాబడిపై డబ్బి బడిగా రూ. 25,000-34,000, నాణ్యమైన సరుకు రూ. 40,000, కెడిఎల్ డీలక్స్ 28,000–32,000, ఆర్మూర్ రకం రూ. 18,000-20,000, సూపర్-10 రూ. 18,000-21,000, తేజ రూ. 18,000-20,500, 273 రూ. 19,000-21,000, నాణ్యమైన సరుకు రూ. 21,500-23,000, సీ-5 మరియు డిడి రూ. 19,000-23,000, 341 రూ. 22,000-25,500, తాలు కాయలు తేజ రూ. 7000-9500, నాణ్యమైన సరుకు రూ. 10,000–11,000, మీడియం రూ. 5000-7000, ఇతర రకాలు నాణ్యమైన సరుకు రూ.8000 ప్రతి క్వింటాలు ధరతో వ్యా పారమైంది.
కర్ణాటకలోని బ్యాడ్గి లో గత సోమ మరియు గురువారాలలో కలిసి 15 వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు రాబడి కాగా, 10 వేల బస్తాల సరుకు వారాలలో అమ్మకమెంది. డబ్బి నాణ్యమైన సరుకు రూ. 33,000-39,000, కెడిఎల్ డీలక్స్ రూ. 32,000-35,500, నాణ్యమైన సరుకు రూ. 27,000-30,000, మీడియం రూ. 12,000–14,000, 2043 రూ. 27,000-31,000. 5531 రూ. 19,500-21,000, తాలు కాయలు రూ. రూ.3300-3700 7000-9000, కెడిఎల్ రూ. 3300-3700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు