దక్షిణాదిలో భారీగా తగ్గిన మిరప నిల్వలు - మధ్యప్రదేశ్ లో కొత్త మిర్చి పెరిగే అవకాశం

  

లభించిన సమాచారం ప్రకారం మరో 10 రోజులలో మధ్యప్ర దేశ్ లో కొత్త సరుకు రాబడి పెరిగే అవకాశం కలదు. అయితే ధరలు ఒకసారి రూ. 1500-2000 తగ్గిన తరువాత తిరిగి పుంజుకొనే అంచనా కలదు. ఇందుకు ముఖ్య కారణమేమనగా, ఈ ఏడాది కర్ణాటకలోని బళ్లారి,రాయిచూర్, ఆంధ్ర లోని కర్నూల్ ప్రాంతాలలో ప్రారంభంలో విత్తిన పంటకు వైరస్ వ్యాప్తి చెందడంతో రైతులు పత్తి, మొక్కజొన్న లాంటి పంటల సాగుకు మొగ్గుచూపడంతో, మిరప విస్తీర్ణం తగ్గింది. గుంటూరు, ప్రకాశం, క్రిష్ణ తదితర ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి గమనించబడింది. అయితే తదుపరి మంచి వర్షాల నేపథ్యంలో నాట్లు కొనసాగుతున్నాయి. 


అయినప్పటికీ,రాబోవు పంట తగ్గవచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రలోని అన్ని శీతలగిడ్డంగులలో కలిసి సుమారు 32 లక్షల బస్తాల లోపే మిరప నిల్వలు ఉన్నట్లు సమాచారం. ఇందులో కూడా 20-25 శాతం మేర సరుకు నాణ్యంగా లేదు. మరియు 12-13 లక్షల బస్తాల సరుకు ఎగుమతిదారులు, మర ఆడించే యూనిట్లు, నూనె కంపెనీల సరుకు ఉంది. ఇదే విధంగా తెలంగాణ, కర్ణాటకలలో కూడా నిల్వలు గత ఏడాదితో పోలిస్తే తగ్గడంతో దేశంలోని మర ఆడించే యూనిట్లు రంగు సరకుకు కోసం మధ్య ప్రదేశ్ పై దృష్టి సారిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ధరలు తగ్గే అవకాశం కనిపించడం లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ధర అధికంగా ఉండడంతో మ.ప్ర. రైతుల సరుకు వేగంగా రాబడి కావడంతో పాటు ప్రతి సంవత్సరంతో పోలిస్తే సీజన్ త్వరగా సమాప్తం కాగలదు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం పెట్టుబడులు అధికంగా ఉన్నందున మర ఆడించే యూనిట్లు నెమ్మదిగా సరుకు కొనుగోలు చేస్తున్నాయి. అయితే మిరప పొడి అమ్మకానికి అనుగుణంగా సరుకు కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎందుకనగా ఇప్పటి నుండి జనవరి వరకు మసాలా దినుసుల అమ్మకాలు అధికంగా ఉంటాయి. మధ్య ప్రదేశ్ సరు కులో నిమ్ము అధికంగా ఉండడం వలన దక్షిణ భారతదేశం నుండి కొనుగోళ్లు ఊపందుకోగలవు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి వివరాల ప్రకారం 2021-22 పంట సంవత్సరంలో దేశంలో మిర్చి ఉత్పత్తి క్రితం ఏడాదితో పోలిస్తే 20.49 ల.ట. నుండి తగ్గి 18.66 ల.ట.లకు చేరింది. కొన్ని రాష్ట్రాలలో అధిక వర్షాల వలన సరుకు నాణ్యత దెబ్బతినడం వలన నాణ్యమైన సరుకుల లభ్యత తగ్గినందునధరలు తారా స్థాయికి చేరినట్లు సమాచారం. గుంటూరు మిర్చి యార్డులో గత వారం శీతల గిడ్డంగుల నుండి సుమారు3 లక్షల బస్తాల రాబడిపె గుంటూరు శీతల గిడ్డంగుల నుండి 1.40 లక్షల బస్తాలు మరియు పరిసర ప్రాంతాల శీతల గిడ్డంగుల నుండి 35 వేల బస్తాలు కలిసి మొత్తం 1.75 లక్షల బస్తాల సరుకు అమ్మకం అయింది. తేజ డీలక్స్ రూ. 500, ఆర్మూర్, 4884, రోమి రకాలలో రూ. 1000, ఇతర అన్ని తాలు రకాలు రూ. 500 తగ్గగా, అన్ని సీడ్ రకాలతో పాటు ఇతర రకాల ధరలు స్థిరంగా ఉన్నాయి. 




 గుంటూరు ఎసి తేజ నాణ్యమైన సరుకు రూ. 17,000-22,500, డీలక్స్ రూ. 22,600-23,000, ఇందులో ఎక్కువగా సరుకు రూ. 20,000-22,000, బడిగ-355 రూ. 20,000-29,000, సింజెంట బడిగ రూ. 20,000-27,500, డిడి, 341 రూ. 20,000-29,000, నంబర్-5 రూ. 20,000-28,000, 273 రూ. 20,000-26,500, సూపర్-10, 334 రూ. 17,000-25,500, డీలక్స్ రూ. 25,600-26,000, ఆర్మూర్ రకం రూ. 17,000 - 22,000, 4884,రోమి రూ. 17,000- 21,000, 577 రకం రూ. 20,00027,000, బుల్లెట్ రూ. 18,000-24,500, బంగారం రకం రూ. 20,000-25,500, 2043 రూ. 28,000-39,000, తాలు కాయలు తేజ రూ. 12,000-13,000, ఇతర రకాలు రూ. 7000-14,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

తెలంగాణలోని వరంగల్ మార్కెట్లో 25-30 వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు రాబడిపై తేజ రూ. 22,500, మీడియం రూ. 19,000-22,000, 341 నాణ్య మైన సరుకు రూ. 26,000, మీడియం 22,000, నాణ్యమైన వండర్ హాట్ రూ.34,000, 1048 రకం సరుకు రూ. 27,000, నాణ్యమైన టమాటా రకం మిర్చి రూ. 80,000,మీడియం రూ. 60,000-75,000, సింగల్ పట్టి రూ. 50,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యారమైంది. 

ఖమ్మంలో గత వారం 45-50 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపైతేజ నాణ్యమైన సరుకు రూ. 23,000, మీడియం రూ. 20,000-21,000, తాలు కాయలు తేజ రూ. 12,500 మరియు 3-4 వేల బస్తాల రైతుల సరుకు రాబడిపై నాణ్యమైన తేజ రూ. 17,000 ధరతో వ్యాపారమైంది.

 హైదరాబాద్ లో గత వారం శీతలగిడ్డంగుల నుండి 4-5 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై డబ్బి బడిగ రూ. 30,000-45,000, 341 నాణ్య మైన సరుకు రూ. 27,000-28,000, సి-5 రూ. 20,000-27,000, తేజ రూ. 16,000-23,000, సూపర్-10 నాణ్య మైన సరుకు రూ. 25,000-26,000, మీడియం రూ. 20,000-22,000, 273 నాణ్య మైన సరుకు రూ. 26,000-27,000, తాలు కాయలు తేజ నాణ్యమైన సరుకు రూ.13,000-13,500, మీడియం రూ. 9000-12,500, హైబ్రిడ్ సరుకు రూ. 2 8000-10,000 ధరతో వ్యాపారమైంది. 

కర్ణాటకలోని బ్యాడిగి లో గత సోమ, గురువారంకలిసి 27-30 వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు రాబడి కాగా, 15-16 వేల బస్తాలసరుకు అమ్మకమైంది. ఇందులో డబ్బి డీలక్స్ రూ. 50,000, మీడియం రూ. - 45,000-49,000, కెడిఎల్ డీలక్ రూ. 45,000-47,000, నాణ్య మైన సరుకు - రూ. 38,000-41,000, మీడియం రూ. 16,000-21,000, 2043 డీలక్స్ రూ.39,000-43,500, నాణ్య మై 2043 సరుకు రూ. 34,500-37,000, 5531 రకం రూ. 24,500-30,500, డిడి రూ. 29,500-31,200, సూపర్-10, 334 రూ. 23,000-25,500, తాలు కాయలు 5531 రూ. 9500–12,500, కెడిఎల్ కాలు కాయలు రూ. 4800-5600 మరియు సింధనూరులో మంగళవారం నాడు 1500 బస్తాల ఎసి సరుకు అమ్మకం కాగా సింజెంట బడిగ రూ. 40,000-41,000, సూప 5-10 రూ. 25,000-26,000, తేజ రూ. 26,000, తాలు కాయలు రూ. 12,000-13,000, మీడియం తాలు కాయలు రూ. 6000-7000 ధరతో వ్యాపారమెంది.

 ఛత్తీస్ గఢ్ డ్లోని జగదల్‌పూర్‌లో గత వారం 7-8 వేల బస్తాల ఎసిసరుకు అమ్మకంపై తేజ రూ. 18,000-22,000, 4884 రూ. 17,000-19,000, తాలు కాయలు తేజ రూ. 12,000-13,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని రామనాథపురం మార్కెట్లో వారంలో 200-250 బస్తాల రాబడిపై నాణ్య మైన సరుకు రూ. 22,000-25,000, మీడియం రూ. 20,000-22,000, యావరేజ్ సరుకు రూ. 15,000-20,000, తాలు కాయలు రూ. 6000-6200, పరమకుడిలో 250-300 బస్తాల రాబడిపె రూ. 24,000-25,000, మీడియం రూ. 20,000–22,000, యావరేజ్ రూ. 15,000-20,000, తాలు కాయలు రూ. 6000-6200 ప్రతి క్వింటాలు ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమెంది






Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు