మార్కెట్లో సత్తా చాటుతున్న డీలక్స్ మిర్చి

  

 ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు మరియు పరిసర ప్రాంతాలలో సాధారణంగా ఆగస్టు చివరి నుండి మిర్చి నాట్లు వేస్తుంటారు. అయితే, ఈసారి ఇటీవలి కాలం వరకు కురిసిన వర్షాల వలన ఒక నెల జాప్యం ఏర్పడింది. తద్వారా పంట పక్వానికి వచ్చే దశ కూడా ఒక నెల రోజుల పాటు ఆలస్యం కాగలదని తెలుస్తోంది. నాట్లు వేసే ప్రక్రియపై సమగ్రమైన నివేదిక అక్టోబర్ మూడో వారంలో స్పష్టత రాగలదు. మధ్య ప్రదేశ్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఓంకారేశ్వర్ డ్యాం 10 గేట్లు తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇప్పటి వరకు వాతావరణం వేడెక్కలేదు. కావున కొత్త సరుకు రాబడులు ప్రారంభం కావడానికి మరింత జాప్యం ఏర్పడగలదని భావిస్తున్నారు.


గుంటూరులో సరుకు నిల్వ చేసిన పొరుగు రాష్ట్రాల వ్యాపారులు సరుకు విక్రయించి లాభాలు వసూలు చేసుకోవడంలో దృష్టి సారిస్తున్నారు. ఈ సరుకు మరో నెల రోజులలో దాదాపు 75 శాతం అమ్మకం కాగలదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా కొత్త సీజన్ ప్రారంభానికి మరో నాలుగు నెలల సమయం ఉంది.

గుంటూరు మిర్చి యార్డులో గత వారం శీతల గిడ్డంగుల నుండి దాదాపు 2.80 లక్షల బస్తాల సరుకు రాబడిపై గుంటూరు శీతల గిడ్డంగుల నుండి రాబడి అయిన 1.40 లక్షల బస్తాలు మరియు పరిసర ప్రాంతాల శీతల గిడ్డంగుల సరుకు 30 వేల బస్తాలు కలిసి మొత్తం 1.70 లక్షల బస్తాల సరుకు అమ్మకమైంది. మున్ముందు మిర్చి ధరల ఒడిదొడుకులను దృష్టిలో పెట్టుకొని అత్యధిక మంది స్టాకిస్టులు తేజ, 334, సూపర్-10 రకాల సరుకు గత ఏడాది మరియు ప్రస్తుత సంవత్సరం సరుకు విక్రయాలపై స్టాకిస్టులు దృష్టి సారిస్తున్నారు. తద్వారా గత ఏడాది సరుకు 75-80 శాతం, ఈ ఏడాది సరుకు 15-20 శాతం సరుకు అమ్మకమైంది. డీలక్స్ రకాల ధరలకు స్థిరత్వం కొన సాగుతుండగా మీడియం, మీడియం బెస్ట్ రకాల సరుకు ఆవశ్యకతానుసారం కొనుగోలుదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. కావున అన్ని రకాల తాలు కాయల ధర ప్రతి క్వింటాలుకు రూ. 500 పతనం కాగా డీలక్స్ రకాల ధరలలో ఎలాంటి మార్పు లేదు. గత ఏడాది వర్షాలు భారీగా కురిసినందున మిర్చి పంటకు తెగులు సోకి ఉత్పత్తి కుంటుపడింది. తద్వారా ఎగుమతి యోగ్యమైన తేజ, సన్నం, బడిగ రకాల ధరలు నింగికెగిసాయి. చైనా నుండి డిమాండ్ ఆశించినంతగా లేనప్పటికీ ధరలు పురోగమిస్తూనే ఉన్నాయి. ఎందుకనగా నాణ్యమైన రకాలు సరిపడునంత అందుబాటులో లేకపోవడమే ఇందుకు నిదర్శనం. గుంటూరులో సరుకు నిల్వలు దాదాపు 50 శాతానికి పరిమిత మయ్యా యి. ఈ సరుకు వచ్చే సీజన్ ప్రారంభానికి ముందే హరించుకు పోగలదు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్యకాలంలోభారత్ నుండి మిర్చి ఎగుమతులు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 16 శాతం తగ్గి 1,04,283 టన్నులకు చేరాయి. ఇందులో దిగుమతి దేశాలైనచైనా భాగస్వామ్యం 34 శాతం, శ్రీలంక 9 శాతం మరియు బంగ్లాదేశ్ 8 శాతం ఉందని మసాలా బోర్డు విడుదల చేసిన తమ గణాంకాలలో పేర్కొన్నది.

గుంటూరు శీతల గిడ్డంగులలో నిల్వ అయిన తేజ నాణ్యమైన సరుకు రూ. 17,000-22,500, గరిష్ఠంగా రూ. 20,000- 22,000, బడిగ-355 రూ. 20,000- 29,000, సింజెంట బడిగ రూ. 20,000 -28,000, డిడి రూ. 20,000 -28,500, 341 రూ. 20,00029,000, నంబర్-5 రూ. 20,000 -28,000, 273 రూ. 20,000 -27,000, సూపర్-10, 334 రూ. 17,000-25,500, ఆర్మూర్ రకం రూ. 17,000–22,000,రోమి, 4884 రూ. 17,000-21,000, 577 రకం రూ. 20,000- 26,500, బుల్లెట్ రూ. 18,000-24,000, బంగారం రకం రూ. 20,000- 25,000, 2043 రూ. 28,000-39,500, తాలు కాయలు తేజ రూ. 11,500–12,500, ఇతర రకాలు రూ. 7000-14,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమెంది.

తెలంగాణలోని వరంగల్ మార్కెట్ లో 20-25 వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై తేజ నాణ్యమైన సరుకు రూ. 22,000, మీడియం రూ. 19,000- 20,000, 341 నాణ్య మైన సరుకు రూ. 28,000, మీడియం రూ. 22,000-26,000, వండర్‌ హాట్ నాణ్య మైన సరుకు రూ. 35,500, మీడియం రూ. 28,000-33,000, 1048 రూ. 25,000, టామాట నాణ్యమైన సరుకు రూ. 80,000, మీడియం రూ. 60,000 -75,000, సింగిల్ పట్టి రూ. 50,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యారమైంది. 

ఖమ్మంలో గత వారం 50-55 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై తేజ నాణ్యమైన సరుకు రూ. 22,400, మీడియం రూ. 20,000–21,000, తేజ తాలు కాయలు నాణ్యమైన సరుకు రూ. 12,500 మరియు 4-5 వేల బస్తాల రైతుల సరుకు రాబడి పై తేజ రూ. 15,000–17,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

హైదరాబాద్లో 4-5 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై డబ్బి బడిగ రూ. 30,000-45,000, 341 నాణ్య మైన సరుకు రూ. 30,000-45,000, సి-5 రూ. 20,000-27,000, తేజ రూ. 16,000-22,500, సూపర్-10 నాణ్యమైన సరుకు రూ. 23,000 -25,000, మీడియం రూ. 20,000 -22,000, 273 రూ. 24,00026,000, తాలు కాయలు తేజ నాణ్యమైన సరుకు రూ. 12,500, మీడియం రూ. 9000-10,000, హైబ్రిడ్ సరుకు రూ. 8000-8500 మరియు ఛత్తీస్ గఢ్ లోని జగదల్ పూర్ లో గత వారం 5-6 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకం పై తేజ రూ. 17,000-22, 000, 4884 రూ. 17,000-19,000, తాలు కా యలు తేజ రూ. 12,000-13,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 కర్ణాటకలోని బ్యాడ్గి లో  గత సోమ, గురువారాలలో కలిసి 50 వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు రాబడి కాగా, 23 వేల బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో డబ్బి డీలక్స్ రూ. 50,000,మీడియం రూ. 44,000-47,000, కెడిఎల్ డీలక్స్ రూ. 45,000 -47,000, నాణ్యమైన సరుకు రూ. 40,000- 44,000, మీడియం రూ. 16,000-21,500, 2043 డీలక్స్ రూ. 39,000-43,500. నాణ్య మైన సరుకు రూ. 34,000-37,000, 5531 రూ. 24,500-28,500, డిడి రూ. 29,500- 30,000, సూపర్-10, 334 రూ. 23,000-25,500, తాలు కాయలు 5531 రూ. 9500-12,500, కెడిఎల్ రూ. 4800-5500, సింధనూర్ లో మంగళవారం 400-500 ఎసి సరుకు అమ్మకంపై సింజెంట బడిగ రూ. 40,000 - 41,000, జిటి మరియు సూపర్-10 రూ. 25,000-26,000, తేజ రూ. 26,000, తాలు కాయలు నాణ్యమైన సరుకు రూ.13,000-13,500, మీడియం సరుకు రూ. 8000-8500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog