ఆంధ్ర, తెలంగాణ లో మిర్చి విస్తీర్ణం భారీగా తగ్గే సూచన

 


వ్యాపారస్తుల కథనం ప్రకారం ఈ ఏడాది ఆంధ్ర, తెలంగాణ లలో మిరప విత్తనాల అమ్మకాలు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో 2022-23 సీజన్లో ఉత్పత్తి భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. కొందరు రైతుల అభిప్రాయం ప్రకారం గత ఏడాది మాదిరిగా వచ్చే సీజన్లో కూడా పంటకు చీడపీడల బెడద ఉండగలదని భావిస్తూ, రెత్తులు మిరప స్థానంలో పత్తి లాంటి ఇతర పంటల సాగుకు మొగ్గుచూపుతున్నారు. ఎందుకనగా దిగుబడి తగ్గడం వలన సీజన్లో నాణ్యమైన సరుకుకు రూ. 18,000-20,000 ప్రతి క్వింటాలు ధర లభించినప్పటికీ, గిట్టుబాటు ఉండదు. ఈ ఏడాది దక్షిణ భారతంలో ఉత్పత్తి తగ్గడం మరియు వచ్చే ఏడాది కూడా ఉత్పత్తి తగ్గినట్లయితే, 2022 దీపావళి నాటికి మిరప ధరలు రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉంది. 


అయితే వచ్చే ఏడాది 2023 దీపావళి నాటికి మిరప ధరలు తారా స్థాయికి చేరి గత రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకనగా రాబోవు సీజన్ కోసం మధ్య ప్రదేశ్లో కూడా ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. మహారాష్ట్రలో సకాలంలో వర్షాలు లేనందున ఇంతవరకు విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే తగ్గింది. దీనితో విక్రయించడానికి ఆసక్తి చూపడం లేదు. వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఆంధ్ర, తెలంగాణలలో తాలు మిరప కాయలు నిల్వ చేసిన స్టాకిస్టులు సరుకు వారి వివరాల ప్రకారం జూలై 1, 2022 వరకు శీతలగిడ్డంగులలో 11,34,500. బస్తాల మిరప నిల్వలు ఉన్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మార్కెట్లో గత వారం నిర్వహించిన 5 రోజుల లావాదేవీలలో గుంటూరుతో పాటు ఇతర ప్రాంతాల శీతల గిడ్డంగుల నుండి గత వారం 3 లక్షల బస్తాల సరుకు రాబడి కాగా 2.40 లక్షల బస్తాల సరుకు విక్రయించబడింది. ఇందులో తేజ రూ.500, 355 బడిగ రూ. 1500, నం-5, సింజెంట బడిగ, 334, సూప ర్-10, 2043 రకాలు రూ. 1000, ఆర్మూర్ రకం రూ. 700, తేజ తాలు కాయలు రూ. 1200, మిగత రకాల ధరలు 500-800 వృద్ధిచెందగా, రకాలతో పాటు తాలు రకాల ధరలు స్థిరంగా ఉన్నాయి. మున్ముందుకు ధరలు పెరిగే అంచనాతో నాణ్యమైన సరుకు అమ్మకానికి రానందున క్వాలిటీ ప్రకారం వ్యాపారమవుతున్నది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు శీతల గిడ్డంగులలో తేజ నాణ్యమైన


సరుకు రూ. 17,000-21,500, బడిగ-355 రూ. 19,000-26,500, సింజెంటబాడిగ రూ. 18,000-25,500, డిడి రూ. 18,000-26,000, 341 రకం రూ. -18,000-27,000, నంబర్-5 రూ. 18,000-26,000, 273 రూ. 18,000-23,000, సూపర్-10, 334 రూ.18,000-24,500, డీలక్స్ రూ. 24,600-25,000, ఆర్మూర్ రకం రూ. 18,000-21,500, 4884 రూ. 16,000-20,000, రోమి రూ. 16,000-20,000, బుల్లెట్ రకం రూ. 18,000-21,000, బంగారం రూ. 17,000-23,000, 2043 రకం రూ. . 25,000-32,000, తాలు కాయలు తేజ రూ. 11,500-13,000, తాలు కాయ లు రూ. 8000-12,000 మరియు 50 వేల బస్తాల రైతుల సరుకు రాబడి కాగా 40 వేల బస్తాల సరుకు అమ్మకమెంది. క్వాలిటీలు లేనందున నాణ్యతానుసారం వ్యాపారం అవుతోంది. మరియు రెత్తుల సరుకు తేజ రూ. 14,000-19,000, అన్ని సీడ్ రకాలు రూ. 13,000-17,000, 334, సూపర్-10 రకాలు రూ.14,000–18,000, తేజ తాలు కాయలు రూ. 9000-10,000, తాలు రూ.6000-8000 ధరతో వ్యాపారమైంది.


తెలంగాణలోని వరంగల్ మార్కెట్లో గత వారం 50 వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు రాబడి కాగా, తేజ రూ. 20,000-22,500, 341 రకం రూ. 23,000-20,000, వండర్ హాట్ రూ. 25,000-28,000, దీపిక రూ. 21,000-25,000, 1048 రకం రూ. 20,000-22,000, నాణ్యమైన టమాబా రకం రూ. 50,000-52,000, మీడియం రూ. 40,000-45,000, సింగిల్పట్టి రూ. 40,000–41,000, 334 రకం రూ. 23,000 మరియు 


ఖమ్మంలో  నాణ్యమైన తేజ రూ. 22,000, మీడియం ఎసి సరుకు  20,000-21,000, నాణ్యమైన తాలు కాయలు తేజ రూ. 13,500 మరియు 15-16 వేల బస్తాల రైతుల సరుకు రాబడిపై నాణ్యమైన తేజ రూ. 15,000–18,000, తాలు కాయలు రూ.9000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 


హైదరాబాద్లో గత వారం ఎసిల నుండి 4 వేల బస్తాల రాబడిపై డబ్బి బడిగ రూ. 25,000–34,000, నాణ్యమైన సరుకు రూ. 40,000, కెడిఎల్ డీలక్స్ 28,000-232,000, సింజెంట బడిగ రకం రూ. 19,000-27,000, నాణ్యమైన తేజ రకం రూ.20,000-22,000, మీడియం రూ. 14,000-19,000, సూప ర్-10 రకం నాణ్యమైన సరుకు రూ.24,000-25,000, మీడియం రూ. 1.9,000-21,000, ఆర్మూర్ రకం రూ. 16,000-22,000, 273 రూ. 22,000-28,000, మీడియం 17,000-19,000, సి-5 మరియు డిడి రూ. 19,000–27,000, 341 రూ. 22,000-28,000, శాలు కాయలు తేజ నాణ్యమైన సరుకు రూ. 11,000-12,000, మీడియం రూ. 7000-9500, హెబ్రిడ్ తాలుకాయలు రూ. 5000-9000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

కర్ణాటకలోని బ్యాడ్జీలో గత గురువారం 12 వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు రాబడి కాగా 9 వేల బస్తాల సరుకు అమ్మకమేంది. డబ్బి నాణ్యమెనై సరుకు రూ.33,500-11,500, కెడిఎల్ డీలక్స్ రూ.33,000-37,000, నాణ్యమైన పేరుకు రూ. 30,000-32,000, మీడియం రూ. 13,000-10,000, నాణ్యమెన 2043 రూ. 28,000-33,000, 5531 రకం KP. 21,000-25,000, & dr. 22,000-25,500, 5531 650 re కాయలు రూ.7500-12,000, కెడిఎల్ తాలు రూ. 3800-5000 ధరతో వ్యాపారమైంది. ఛత్తీస్గఢ్లోని జగదల్ పూర్ లో గతవారం 4-5 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపె తేజ రూ. 19,000-21,300, తాలు కాయలు రూ. 11,000-13,000 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog