భారీగా తగ్గిన మిరప నిల్వలు - హెచ్చుముఖంలో ధరలు

 

గుంటూరు మార్కెట్లో గత సోమవారం నుండి బుధవారం వరకు 3 రోజుల మార్కెట్లలో 2.90 లక్షల బస్తాల కొత్త మిరప రాబడి కాగా, 2.80 లక్షల బస్తాల సరుకు అమ్మకం అయింది. ఇందులో ' నాణ్యమైన సూపర్ డీలక్స్ రకాల సరుకు కొరతతో 355 బడిగ, సూపర్-10, బంగారం మొదలగు రకాల ధరలు రూ. 400-500 పెరిగాయి. తమిళనాడులో కౌంటర్ సేల్ కోసం నాణ్యమైన సరుకులకు డిమాండ్ రావడంతో రూ. 20,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. అయితే ఇతర డీలక్స్ రకాలు రూ. 19,000-19,500 ధరతో వ్యాపారం అయ్యాయి. గత వారం శీతల గిడ్డంగులలలో నిల్వ అయిన తేజ రకం రూ. 19,000తో పాటు డీలక్స్ సరుకు కొరత మరియు పౌడర్ రకాల కొనుగోళ్లతో మీడియం, మీడియం బెస్ట్ రకాలకు డిమాండ్ నెలకొనడంతో ధర రూ. 200 పెరిగింది.


వ్యాపారస్తుల అచనా ప్రకారం గురువారం నుండి ఆదివారం వరకు మార్కెట్ మూసి ఉండడం వలన సోమవారం 1-1.20 లక్షల బస్తాల సరుకు రాబడి అయ్యే అవకాశం కలదు. దీనితరువాత 70-80 వేల బస్తాల సరుకు రాబడి ఉండగలదు. ఈ ఏడాది ఏప్రిల్ చివరివారం నాటికి సీజన్ సమాప్తం కాగలదు. ఈ ఏడాది ఇంతవరకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక శీతలగిడ్డంగులలో కలిసి కేవలం 115 లక్షల బస్తాల సరుకు నిల్వ అయింది. అనగా గత ఏడాదితో పోలిస్తే 75 శాతం కూడా లేదు. ఇందులో గుంటూరు కోల్డ్ స్టోరేజీల సామర్థ్యం 70 లక్షల బస్తాలలో 41 లక్ష బస్తాలు మరియు ఆంధ్రలోని ఇతర ఎసిలలో కలిసి 23 లక్షల బస్తాలు, తెలంగాణలో 36 లక్షల బస్తాలు, కర్ణాటకలో 16 లక్షల బస్తాల సరుకు నిల్వ అయింది. ఇందులో గుంటూరు ఎసిలలో ఒలియోరెజిన్ కంపెనీల 10 లక్షల బస్తాలు, మిరప పొడి తయారీదారుల 15 లక్షల బస్తాలు ఉన్నాయి.


ఈ సరుకు నేరుగా యూనిట్లకు వెల్లగలదు. కావున నాణ్యమైన డీలక్స్ రకాలల మరో రూ. 5000 ప్రతి క్వింటాలుకు వృద్ధిచెందే అవకాశం కలదు.


దక్షిణ భారతంతో పాటు ఇతర ఉత్పాదక రాష్ట్రాలలో సరుకు రాబడులు సమాప్తం కావడంతో సరుకు డిమాండ్ పెరుగుతున్నది. గత వారం తెలంగాణలో సుమారు 2.50 లక్షల బస్తాల సరుకు వ్యాపారం కాగా, కర్ణాటకలో కేవలం 25-30 వేల బస్తాల సరుకు అమ్మకం అయింది. ఈ ఏడాది భారీగా సరుకు కొరత ఉండడం మరియు ధరలు పెరగడంతో ఉత్తరప్రదేశ్, పంజాబ్, మధ్య ప్రదేశ్లో రికార్డు ఉత్పత్తికి అవకాశం కలదు.


గుంటూరు మార్కెట్లో నాణ్యమైన తేజ కొత్త సరుకు రూ. 15,000 -18,000, డీలక్స్ రూ. 18,100-18,300, ఎక్స్ట్రా ఆర్డినరి రూ. 18,400 -18,500, బడిగ-355 రూ. 16,000-20,500, డీలక్స్ ఎక్స్ట్రా ఆర్డినరి రూ. 20,600-21,000, సింజెంట బడిగ రూ. 16,000-20,800, డీలక్స్ రూ. 20,900-21,000, డిడి రూ. 16,000-21,500, డీలక్స్ రూ. 21,600 -22,000, (భద్రాచలం) 341 రూ. 16,000–21,000, డీలక్స్ రూ. 21,200-21,500, దేశీవాలి (341 రకం) రూ. 17,000 -22,000, డీలక్స్ ఎక్స్ట్రా ఆర్డినరి రూ. 22,200-22,500, 2043 రకం రూ. 16,000-25,000, బుల్లెట్ రకం సరుకు రూ.14,000-18,000, డీలక్స్ రూ. 18,100–18,200, నెంబర్-5 రూ. 16,000-22,000, డీలక్స్ రూ. 22,100-22,200, 334, సూపర్-10 రూ. 14,500-18,800, డీలక్స్ రూ. 18,900-19,000, 4884 రూ.13,000-16,000, 273 రూ. 15,000–18,500, బంగారం రకం రూ. 14,000-18,000, డీలక్స్ రూ. 18,100-18,300, ఆర్మూర్ రకం రూ. 13,500-16,500, డీలక్స్ రూ. 16,600-16,800, రొమి రూ. 13,500-16,800, డీలక్స్ రూ. 16,900–17,000 మరియు 577 రకం రూ. 14,000-19,000, డీలక్స్ రూ. 19,100-19,200, సీడ్ రకం మీడియం బెస్ట్ రూ. 13,000-15,500, తాలు కాయలు తేజ రూ. 10,000-11,000, డీలక్స్ లాల్కట్ రూ. 11,200-11,500, తాలు కాయలు రూ. 4500-8500, 341, డిడి తాలు కాయలు రూ. 9000-11,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


గుంటూరు శీతల గిడ్డంగులలో నిల్వ అయిన నాణ్యమైన తేజ రకం రూ. 15,000-18,000, డీలక్స్ రూ. 18,100-18,300, మీడియం బెస్ట్ రూ. 13,500-14,900, బడిగ 355 రకం రూ. 16,000-21,000, డీలక్స్ రూ. 21,100-21,200, సింజెంట బడిగ రకం రూ. 15,000-19,000, 334, సూపర్ 10 రకం రూ. 14,000-18,000, ఎక్స్ట్రా ఆర్డినరి రూ. 19,000-19,200, మీడియం బెస్ట్ రూ. 13,000–13,900 మరియు 341 రకం రూ. 16,000-20,000, ఆర్మూరు రకం రూ. 14,000–16,200, 2043 రకం రూ. 20,000-27,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


తెలంగాణలోని వరంగల్లో గత వారం 60 వేూల బస్తాల కొత్త సరుకు రాబడిపై తేజ నాణ్యమైన సరుకు రూ. 14,000-18,000, 341 నాణ్యమైన సరుకు రూ.19,000-23,000, వండర్ హాట్ సరుకు రూ. 20,000–25,000, 1048 రకం రూ. 15,000-18,500, దీపిక నాణ్యమైన రూ.20,000-25,500, 334 రూ. 14,000-16,500, టమాట నాణ్యమైన సరుకు రూ. 38,000-45,000, సింగిల్ పట్టి రూ. 28,000-36,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


ఖమ్మంలో గత సోమవారం నుండి బుధవారం వరకు 1 లక్ష 25 వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై తేజ నాణ్యమైన సరుకు రూ. 18,775, మీడియం రూ. 17,500-18,000, తాలుకాయలు నాణ్యమైన సరుకు రూ. 10,500 మరియు 5 వేల బస్తాల ఎసి సరుకు తేజ రూ. 17,500 మరియు కేసముద్రంలో 3 వేల బస్తాల రాబడిపై తేజ రకం రూ. 16,321-17,121, తాలు కాయలు రూ. 7053–11,151 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


హైదరాబాద్ లో గత సోమవారం నుండి బుధవారం వరకు 10-12 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై తేజ నాణ్యమైన సరుకు రూ. 15,000–18,500, బడిగ డబ్బి నాణ్యమైన సరుకు రూ. 30,000, మీడియం రూ. 26,000-27,000, బడిగ రూ. 21,000-27,000, 273 మీడియం బెస్ట్ రూ. 16,000-18,000, నాణ్యమైన సరుకు రూ.19,000-19,500, సూపర్-10 నాణ్యమైన సరుకు రూ. 18,000-19,000, మీడియం రూ. 14,000-17,500 మరియు 341 రకం రూ. 18,000-20,000, సి-5 రూ. 17,000-19,000, డిడి రూ. 17,000-19,000, తాలు కాయలు నాణ్యమైన తేజ రూ.10,500, మీడియం బెస్ట్ రూ. 9000-10,000, మీడియం రూ. 5000-8000, హైబ్రిడ్ తాలు రూ. 4000-6000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


కర్ణాటకలోని బ్యాడ్గి లో  సోమవారం నాడు 17 వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై డిబ్బి డీలక్స్ రూ. 33,000-36,500, కెడిఎల్ రూ. 25,000-28,000, మీడియం రూ. 11,000-14,500, 2043 * డీలక్స్ రూ.28,500-30,500, మీడియం రూ. 25,000-28,500, 5531 నాణ్యమైన సరుకు రూ. 18,000-19,500, మీడియం రూ. 14,000-16,500, కెడిఎల్ తాలు కాయలు రూ. 2900-3500, సీడ్ తాలు కాయలు రూ. 6000-9000 మరియు 1000 బస్తాల ఎసి సరుకు రాబడి కాగా, డబ్బి డీలక్స్ రూ. 45,000, నాణ్యమైన 2043 రకం మిర్చి రూ. 30,000-30,500, 5531 రకం తాలు కాయలు రూ. 7400-8200, తాలు కాయలు కెడిఎల్ రూ. 3500-3900 మరియు సింధనూరులో మంగళవారం నాడు 3 వేల బస్తాల రాబడిపై డబ్బీ మిరప రూ. 40,000, సింజెంట బడిగ రకం రూ.27,000-30,000, 5531 రకం రూ. 20,000-22,000, జిటి రకం రూ. 18,000-22,000, తేజ రకం రూ. 18,000, మీడియం రూ. 15,000-16,000 మరియు తాలు రూ. 4000-10,000 ధరతో వ్యాపారమెంది. 

ఛత్తీస్గఢ్ లోని జగదల్పూర్లో ప్రతి రోజు 1500-2000 బస్తాల సరుకు రాబడిపై తేజ మరియు సన్-గ్రో రూ. 15,000–17,800, 4884 రూ. 14,000-15,000, తాలు కాయలు తేజ రూ. 9000-10,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

మధ్య ప్రదేశ్లోని బేడియాలో కేవలం 2 వేల బస్తాల మిర్చి రాబడి కాగా, రంగు వెలసిన సరుకు తొడిమెతో సహా రూ. 10,000-14,000, లాల్కట్ రూ. 9000-11,000, ఫుల్కట్ తాలు కాయలు రూ. 9000-10,000, తొడిమెతో కూడా తాలు రూ. 10,000–11,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు