గత ఏడాది ఆంధ్ర ప్రదేశ్లో రికార్డు స్థాయిలో మిరప సాగైన తరువాత భారీ వర్షాలతో పాటు చీడపీడల బెడద కారణంగా దిగుబడితో పాటు పంట ఉత్పత్తి తగ్గడంతో సీజన్ ప్రారంభం నుండే ధరలు అధికంగా ఉన్నాయి. తేజ డీలక్స్ ధర రూ. 18,000 వరకు చేరినప్పటికీ, రాబోవు సీజన్ కోసం రెతులు ఎక్కువగా ముందుకు రావడం లేదు. ఎందుకనగా ధరలు పెరిగినప్ప టికీ, విక్రయించడం వలన మొత్తం ధర లభించకపోవడంతో రైతులు పత్తి, మొక్క జొన్న మొదలగు పంటల సాగుకు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం నిల్వలు గత ఏడాదితో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. ఇందులో కూడా నాణ్యమైన రకాల తక్కువగా ఉండడంతో ప్రముఖ వ్యాపారులు భవిష్యత్తులో తేజ, సూప ర్-10 వంటి రకాల ధర రూ. 25,000-26,000 ప్రతి క్వింటాలుకు మించ గలదని అంచనా వేస్తున్నారు. అయితే కొందరు వ్యాపారులు డీలక్స్ రకాలు విక్రయించిన తరువాత తిరిగి కొనుగోలు చేస్తున్నారు. ఇందుకు ముఖ్య కారణమేమనగా పెద్ద వ్యాపారులు ఆగస్టులో తేజ రూ. 24,000, డిసెంబర్లో రూ. 29,000 వరకు చేరే అంచనా కలదని వీరి అభిప్రాయం.
ప్రస్తుతం ఖమ్మం కోల్డ్ స్టోరేజీలలో శనివారం వరకు నిల్వలు 13,95,450 బస్తాలు ఉన్నాయి. మరియు రెత్తులు, స్టాకిస్టులు నెమ్మదిగా సరుకు విక్రయిస్తున్నారు. రెతుల కథనం ప్రకారం ఈ ఏడా దితో పాటు వచ్చే ఏడాది కూడా మిరప ధరలు పటిష్టంగా ఉండగలవు. ఎందుక నగా రాబోవు ఉత్పత్తి తగ్గడం వలన పెద్ద రెతులు నెమ్మదిగా సరుకు విక్రయించ గలరు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా మర ఆడించే యూనిట్ల కోసం సరుకు అవసరం ఉండగలదు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మార్కెట్లో గత వారం నిర్వహించిన 5 రోజుల లావాదేవీలలో గుంటూరుతో పాటు ఇతర ప్రాంతాల శీతల గిడ్డంగుల నుండి గత వారం 2.65 లక్షల బస్తాల సరుకు రాబడి కాగా 1.75 లక్షల బస్తాల సరుకు విక్రయించబడింది. నాణ్యమైన సరుకుకు డిమాండ్ కొనసాగుతున్నది. తేజ డీలక్స్ రూ. 500, బడిగ-355,సింజెంట బడిగ, బంగారం రకాలు రూ. 2000 మరియు 341, 334, సూపర్-10 రూ.1500, ఆర్మూరు, 4884, డిడి, నెం-5, బుల్లెట్ రకం, రోమీ రకాలు రూ. 1000, 273 రకం రూ. 800 పెర గగా, ఇతర రకాల ధరలు స్థిరంగా ఉన్నాయి. గత ఏడాది నిల్వ అయిన మీడియం, మీడియం బెస్ట్ రకాల రాబడులు అధికంగా ఉన్నాయి. అయితే ఈ ఏడాది నిల్వల నుండి కేవలం 20-25 శాతం సరుకు మాత్రమే రాబడి అవుతోంది. దీని వలన కూడా డీలక్స్ రకాలకు మంచి డిమాండ్ నెలకొన్నది.
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు శీతల గిడ్డంగులలో తేజ నాణ్యమైన సరుకు రూ. 17,000-21,000, బడిగ-355, సింజెంట బడిగా రూ. 18,000-25,000, డిడి రూ. 18,000-26,000, 341 రకం రూ. 18,000-27,000, నంబర్-5 రూ. 18,000-25,000, 273 రూ. 18,000-23,000, సూపర్-10, 334 రూ. 15,500-23,000, డీలక్స్ రూ. 23,200–24,000, ఆర్మూర్ రకం రూ. 17,000-20,800, 4884 రూ. 16,000-20,000, రోమి రూ. 16,000-20,000, బుల్లెట్ రకం రూ. 17,000-20,800, బంగారం రకం రూ. 17,000-23,500, 2043 రూ. 25,000-31,000, తాలు కాయలు తేజ రూ. 10,500-11,700, తాలు కాయలు రూ. 8000-12,000 మరియు 90 వేల బస్తాల రెత్తుల సరుకు రాబడి కాగా 75 వేల బస్తాల సరుకు అమ్మకమెంది. ఇందులో నాణ్యత తగ్గ డంతో ధరలు స్థిరంగా ఉన్నాయి. మరియు రెతుల సరుకు తేజ రూ. 14,000-19,000, అన్ని సీడ్ రకాలు రూ. 13,000-17,500, 334, సూపర్-10 రకాలు రూ. 14,000–18,000, తేజ తాలు కాయలు రూ. 9500-10,500, తాలు కాయలు రూ. 6000-8000 ధరతో వ్యాపారమైంది.
తెలంగాణలోని వరంగల్ మార్కెట్లో గత వారం 3-4 వేల బస్తాల రెతుల సరుకు రాబడి తేజ రూ. 14,000 - 16,500, 341 రూ. 14,000-18,000,50-55 వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకం కాగా, తేజ రూ.18,000-21,200, 341 రకం రూ.23,000-25,000, డిడి రూ.23,000-25,000, అగ్ని రకం రూ. 24,000-26,000, వండర్ హాట్ రూ.24,000-26,500 మరియు
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు