ఎగుమతి డిమాండ్ తగ్గడంతో మందగమనంలో మిర్చి ధరలు

 


దేశంలోని అన్ని మిరప ఉత్పాదక రాష్ట్రాలలో కలిసి వారంలో సుమారు 10 లక్షల బస్తాలకు పైగా సరుకు రాబడిపై 90 శాతం అమ్మకమైంది.గుంటూరు మార్కెట్లో గత వారం 5 రోజుల మార్కెట్లో 4.70 లక్షల బస్తాల కొత్త మిరప రాబడిపై మీడియం, మీడియం బెస్ట్ రకాలు అధికంగా ఉన్నాయి. మరియు 4 లక్షల బస్తాల అమ్మకంపై తేజ మీడియం, మీడియం బెస్ట్ రకాలు రూ. 1000-2000, తేజ తాలు రూ. 500 తగ్గాయి. ఇందుకు ముఖ్య కార ణమేమనగా, చైనా, బంగ్లాదేశ్ మొదలగు మిరప దిగుమతి దేశాల ద్వారా డిమాండ్ తగ్గడంతో పాటు స్థానిక యూనిట్ల కోసం డీలక్స్ రకాలకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, మార్కెట్లలో వీటి రాబడి కేవలం 10-15 శాతం అవుతున్నాయి. తీవ్ర ఎండల కారణంగా మే 9 నుండి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఒక నెల రోజుల పాటు వేసవి సెలవులు ప్రకటించనున్నది. 


గత వారం పచ్చళ్ళ తయారీదారుల కోసం పౌడర్ రకాలకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, 334,సూపర్ - 1, బంగారం, ఆర్మూర్, బుల్లేట్, మీడియం మీడియం బెస్ రకాల ధరలు రూ. 500-1000 తగ్గాయి. దీనితో మంది ఎక్కువ స్టాకిస్టులు తమ సరుకు విక్రయించడానికి బదులుగా కోల్డ్ స్టోరేజీలలో నిల్వ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. గుంటూరు కోల్డ్ స్టోరేజీలలో వారంలో 65 వేల బస్తాల రాబడి కాగా, 50 వేల బస్తాల సరుకు అమ్మకం అయింది. ఇందులో 334, సూప ర్-10, 355 బడిగ రకం, నెం-5, 341 రకం, 2043, తేజ లాంటి డీలక్స్ రకాలు క్వాలిటీ ప్రకారం వ్యాపారం అవుతున్నాయి. లభించిన సమాచారం ప్రకారం 2-3 నెలల క్రితం తక్కువ ధరతో కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజీలలో నిల్వ చేసిన వారు విక్రయిస్తున్నందున కూడా ధరలపై ప్రభావం పడింది. అయితే భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉండే అవకాశం కలదు. వ్యాపారస్తుల కథనం ప్రకారం ఖమ్మం కోల్డ్ స్టోరేజీలలో ఇంతవరకు 14,68,550 బస్తాల సరుకు నిల్వ అయింది. కర్ణాటక లోని రాయచూర్, బళ్లారి, బ్యాడ్లీ ప్రాంతాలలో ఎసి ల నుండి అమ్మకాలు ప్రారంభమయ్యాయి. 

గుంటూరు మార్కెట్లో నాణ్యమైన తేజ కొత్త సరుకు రూ. 15,000–18,000, డీలక్స్ రూ. 18,100–18,200, మీడియం బెస్ట్ రూ. 13,500-14,900, మీడియం రూ. 12,500-13,400, బడిగ-355 రూ. 15,000-20,000, సింజెంట బడిగ రూ. 15,000-21,000, డిడి రూ. 16,000-21,000, (భద్రాచలం) 341 రూ. 16,000-21,000, దేశీవాలి (341 రకం) రూ. 16,000-22,000, 2043 రూ. 16,000-25,000, బుల్లెట్ రకం సరుకు రూ. 13,000–17,500, నెంబర్-5 రూ. 16,000-22,000, 334, సూపర్-10 రూ. 14,000-19,000, మీడియం రూ. 13,000-13,900, 4884 రూ. 12,500-16, 000, 273 రూ. 15,000 - 19,000, బంగారం రకం రూ. 13,000–17,500, ఆర్మూర్ రకం రూ. 12,500-16,500, 577 రకం రూ. 14,000-19,000, మీడియం బెస్ట్ సీడ్ రకం రూ. 12,500-15,500, తాలు కాయలు తేజ రూ. 9500-10,500, డీలక్స్ లాల్కట్ రూ. 10,600-11,500, తాలు కాయలు రూ. 5000-8500, 341, డిడి తాలు కాయలు రూ. 9000-12,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


గుంటూరు శీతల గిడ్డంగులలో నిల్వ అయిన నాణ్యమైన తేజ రకం రూ. 15,000-18,000, మీడియం బెస్ట్ రూ. 13,000-14,900, బడిగ 355 రకం రూ. 16,000-21,000, సింజెంట బడిగ రకం రూ. 15,000-18,500, 334, సూపర్ 10 రకం రూ. 14,000-19,000, 341, నెంబర్-5 రకం రూ. 16,000 21,500, 2043 రకం రూ. 20,000-28,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


తెలంగాణలోని వరంగల్లో గత వారం 1 లక్ష బస్తాల కొత్త సరుకు రాబడిపై తేజ నాణ్యమైన సరుకు రూ. 14,000-16,700, 341 నాణ్యమైన సరుకు రూ. 19,000-20,500, వండర్ హాట్ సరుకు రూ. 18,000-20,200, 1048 రకం రూ. 15,000 - 18,500, దీపిక నాణ్యమైన సరుకు రూ. 20,000-24,500, 5531 రకం రూ. 15,000-18,500, టమాట నాణ్యమైన సరుకు రూ. 38,000-40,000, సింగిల్పట్టి రూ. 25,000-30,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

ఖమ్మంలో గత వారం 1.85 లక్షల బస్తాల కొత్త మిర్చి రాబడిపై తేజ నాణ్యమైన సరుకు రూ. 18,100, మీడియం రూ. 17,000-17,500, తాలుకాయలు రూ. 8500-9000 మరియు 8 వేల బస్తాల ఎసి సరుకు తేజ రూ. 18,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


హైదరాబాద్ గత వారం 18-20 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై తేజ నాణ్యమైన సరుకు రూ. 17,500-18,000, మీడియం రూ. 14,000-16,000, బడిగ డబ్బి నాణ్యమైన సరుకు రూ. 30,000–32,000, డియం రూ. 26,000-27,000, బడిగ రూ. 21,000-27,000, 273 మీడియం బెస్ట్ రూ. 16,000-18,000, నాణ్యమైన సరుకు రూ. 19,000-19,500, సూపర్-10 నాణ్యమైన సరుకు రూ. 19,000-20,000, మీడియం రూ. 14,000-17,500 మరియు 341 రకం రూ. 18,000-20,000, సి-5 రూ. 17,000-20,000,డిడి రూ. 17,000–19,000, తాలు కాయలు నాణ్యమైన తేజ రూ. 10,000-10,500, మీడియం బెస్ట్ రూ. 90000-9500, మీడియం రూ. 7000–7500, హైబ్రిడ్ తాలు రూ. 4000-6000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


కర్ణాటకలోని బ్యాడ్గి లో  సోమ, గురువారాలలో కలిసి 34-35 వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై నాణ్యమైన డబ్బి రూ. 34,000-37,000, కెడిఎల్ నాణ్యమైన సరుకు రూ. 25,000-28,000, మీడియం రూ. 11,000-14,500, 2043 డీలక్స్ రూ.28,000-30,000, మీడియం రూ.25,000 - 28,500, 5531 నాణ్యమైన సరుకు రూ. 18,000-19,500, మీడియం రూ. 14,000-16,500, కెడిఎల్ తాలు కాయలు రూ.29,000-35,000, సీడ్ తాలు కాయలు రూ. 6000-9000 మరియు 5 వేల బస్తాల ఎసి సరుకు రాబడి కాగా, డబ్బీ డీలక్స్ రూ. 41,000-44,000, నాణ్యమైన 2043 రకం మిర్చి రూ. 30,000-30,500, కేడిఎల్ రూ. 30,000–33,000, 5531 రకం తాలు కాయలు రూ.7500-8500, తాలు కాయలు కెడిఎల్ రూ. 3500-3900 మరియు సింధనూరులో మంగళవారం నాడు 3 వేల బస్తాల రాబడిపై సింజెంట బడిగ రకం రూ. 25,000-30,000, 5531 రకం రూ. 21,000, జిటి రకం రూ.18000-21,500, తేజ రకం రూ. 1,000-2,000 మరియు నాణ్యమైన తాలు రూ. 6000-10,000, తెల్ల తాలు కాయలు రూ. 3000-5000, బళ్లారి, షాపూర్ ప్రాంతాలలో 2500-3000 బస్తాల ఎసి సరుకు అమ్మకంకాగా, సింజెంట బడిగ రూ. 27000-28,000, 5531 రకం రూ. 20,000–21,000 ధరతో వ్యాపారమెంది. ఛత్తీస్గఢ్ లోని జగదల్పూర్లో ప్రతి రోజు 1500-2000 బస్తాల సరుకు రాబడిపై తేజ మరియు సన్-గ్రో రూ. 15,000-17,700, 4884 రూ. 13,000-15,000, తాలు కాయలు తేజ రూ. 8500-9500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


మధ్యప్రదేశ్లోని బేడియాలో 10 వేల బస్తాల మిర్చి రాబడి కాగా, తొడిమెతో సహా రూ. 12,500-13,000, లాల్ కట్ రూ. 9500-10,500, ఫుల్ కట్ తాలు కాయలు రూ. 9000-10,000, మీడియం తాలు రూ.8000-9000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog