తగ్గిన మిర్చి ఉత్పత్తి - డీలక్స్ రకాలకు గిరాకీ

 


దేశంలో 2021-22 సీజన్ మసాలా దినుసుల ఉత్పత్తి ముందు సీజన్తో పోలిస్తే 1.10 కోట్ల టన్నుల నుండి 1.5 స్వల్పంగా క్షీణించి 1.09 కోట్ల టన్నులకు పరిమితమైందని, తద్వారా మిర్చి ఉత్పత్తి 20 ల.ట. నుండి 19 ల.ట.కు పరిమితమైందని మసాలా బోర్డు విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది. ప్రస్తుతం ఉత్పాదక ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సేద్యం కుంటుపడుతోంది. అయితే, పంట విత్తేందుకు మరో రెండు నెలల సమయం ఉంది. రైతులకు తమ ఉత్పత్తిపై లాభసాటి ధరలు గిట్టుబాటవుతున్నందున సేద్యం శరవేగంతో విస్తరిస్తున్నారు. అయితే, గత ఏడాది ఎదుర్కొన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి పంటకు సోకే కీటకాలపై కూడా దృష్టి సారిస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మార్కెట్ యార్డులో గత వారం నిర్వహించిన 3 రోజుల లావాదేవీలలో గుంటూరు శీతల గిడ్డంగుల నుండి 1.70 లక్ష బస్తాల మిర్చి రాబడి కాగా గుంటూరు సరుకు 80 వేల బస్తాలు మరియు పరిసర ప్రాంతాల సరుకు 30 వేల బస్తాలు కలిసి మొత్తం 1.10 లక్షల బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో డీలక్స్ రకాలకు డిమాండ్ నెలకొన్నందున తేజ, 334, సూపర్-10, బడిగ, 2043, బంగారం, ఆర్మూరు, బుల్లెట్ రకాల ధర ప్రతి క్వింటాలుకు రూ. 500 వృద్ధి చెందగా, ఇతర రకాల ధరలు చెక్కుచెదరకపోగా మీడియం, మీడియం బెస్ట్ రకాలు అమ్మకాలు మందగించగా నాణ్యతానుసారం వ్యాపారమవుతున్నది.


గుంటూరు శీతల గిడ్డంగుల నుండి గత ఏడాది మరియు అంతకు ముందు రెండేళ్లుగా నిల్వ అయిన సరుకు ఎక్కు వగా అమ్మకాని వస్తున్నది. మరియు ఈ ఏడాది తక్కువగా అమ్మకానికి వస్తున్నది. ఎందుకనగా భవిష్యత్తులో ధరలు భారీగా రాణించగలవని వ్యాపారులు భావించడమే ఇందుకు నిదర్శనం.


ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మార్కెట్లో గత వారం ఎసి తేజ నాణ్యమైన సరుకు రూ. 17,000 -24,000, డీలక్స్ రూ. 24,100 - 24,200, బడిగ–355 రూ. 23,000 -30,000, సింజెంట బడిగ రూ. 22,000-29,000, డిడి రూ. 22,000-30,000, 341 85. 22,000–30,000, నంబర్-5 రూ.20,000-28,500,సూపర్-10, డీలక్స్ రూ. 26,200-26,500, ఆర్మూర్ రకం రూ. 17,000 23,500, 4884 . 17,500 - - 27,500, బుల్లెట్ రూ. 18,000 -39,000, రూ.334 -17,000-26,000,23,000, డీలక్స్ రూ. 23,200  రొమి రూ. 17,000-21,500, 577 రకం రూ. 22,000-24,500, బంగారం రకం రూ. 20,000-26,000, 2043 . 28,000,తాలు కాయలు తేజ 12,500–14,000, ఇతర రకాలు రూ.8500–14,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. హిందూపూర్ లో శుక్రవారం 800 బస్తాల కొత్త మిర్చి రాబడిపై రూ.20,000 25,000 ధరతో వ్యాపారమైంది. 

తెలంగాణలోని వరంగల్ మార్కెట్ లో 14-15 వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై తేజ రూ. 21,000-23,000, 341 నాణ్యమైన సరుకు రూ. 28,000-30,000, వండర్ హాట్ రూ. 32,500–35,500 మరియు 50-100 బస్తాల రైతుల సరుకు రాబడిపై తేజ రూ. 15,000-18,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యారమైంది. 

ఖమ్మంలో 25 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపె తేజ నాణ్యమైన సరుకు రూ. 23,400, మీడియం రూ.20,000-21,000, తాలు కాయలు తేజ రూ. 12,600 మరియు 2-3 వేల బస్తాల రైతుల సరుకు రాబడిపై నాణ్యమైన తేజ రూ. 17,000, తాలు కాయలు రూ. 8500ధరతో వ్యాపారమైంది. 

హైదరాబాద్లో 3 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై డబ్బి బడిగ రూ. 30,000-40,000, 341 నాణ్యమైన సరుకు రూ. 29,000, మీడియం రూ. 20,000–27,500, - రూ. 20,000-27,000, సింజెంట బడిగ, డిడి రూ. 20,000–29,000, తేజ రూ. 16,000-24,000, సూపర్-10 నాణ్యమైన రూ. 25,000-25,500, మీడియం రూ. 20,000-22,000 273,నాణ్యమైన సరుకు రూ.27,000-27,500, మీడియం బెస్ట్ రూ. 20,000–25,000, మీడియం రూ. 17,000-19,000, తాలు కాయలు తేజ నాణ్యమైన సరుకు రూ. 13,500, మీడియం రూ. 9000-13,000, హైబ్రిడ్ సరుకు రూ. 8000-10,500, సీడ్ రకాలు రూ. 12,000 ధరతో వ్యాపారమైంది.


కర్ణాటకలోని బ్యాడ్గి లో  గత గురువారం 17 వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు రాబడి కాగా, 10 వేల బస్తాల సరుకు అమ్మకమెంది. ఇందులో డబ్బి డీలక్స్ రూ. 50,000-53,000, నాణ్యమైన సరుకు రూ. 46,000-48,500, కెడిఎల్ డీలక్స్ రూ. 44,000-48,000, నాణ్యమైన రూ.38,000-43,000, మీడియం రూ.18,000-23,700, 2043 డీలక్స్ రూ. 38,500-44,000. నాణ్యమైన సరుకు రూ. 34,000-37,000, 5531 రూ. 24,500-31,500, డిడి రూ. 29,500 31,800, సూపర్-10, 334 రూ.23,000-25,000, తాలు కాయలు 553 రూ.9500-15,000, కెడిఎల్ రూ. 5000-6000, 

తమిళనాడులోని రామనాథపురం మార్కెట్లో గత వారం 150-200 బస్తాల మిర్చి రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 25,000-27,000, మీడియం రూ. 20,000–24,000, యావరేజ్ సరుకు రూ. 17,000-20,000, తాలు కాయలు రూ. 6000-6600, పరమకుడిలో 200-300 బస్తాలు రూ. 25,000-28,000, మీడియం రూ. 20,000-24,000, యావరేజ్ సరుకు రూ. 17,000-20,000, తాలు కాయలు రూ. 6000-6600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో గత వారం 5-6 వేల






Comments

Popular posts from this blog