మే 16 నుండి గుంటూరు మిర్చి యార్డుకు వేసవి సెలవులు

 

ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వేసవితాపం కారణంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా 16 మే సోమవారం నుండి జూన్ 12 ఆదివారం వరకు అధికారులు వేసవి సెలవులు ప్రకటించారు. తద్వారా రైతుల సరుకు రాబడులు మరియు లోడింగ్- అన్లోడింగ్ లాంటివి ఉండబోవు. గుంటూరులో గత వారం 4 రోజుల లావాదేవీలలో 3 లక్షల బస్తాల మిరప రాబడి కాగా, 15-20 శాతం నాణ్యమైన మరియు 80 శాతం మీడియం, మీడియం బెస్ట్ రకాలు ఉండగా, 2.90 లక్షల బస్తాల సరుకు అమ్మకం అయింది. డీలక్స్ రకాలకు మండి డిమాండ్ ఉన్నప్పటికీ, క్వాలిటీ లేకపోవడంతో పాటు మీడియం, మీడియం బెస్ట్ రకా లలో రూ. 500-1000 ప్రతి క్వింటాలుకు తగ్గి నాణ్యతనుసారం వ్యాపారం అయింది.లభించిన సమాచారం ప్రకారం ప్రతి ఏడాది చివరి విడత మిర్చి పంట కోతలకు బదులు చెట్లమీదనే వదిలివేస్తుండేవారు. ఎందుకనగా మంచి ధర లభించ కపోవడంతో పాటు కూలీల వ్యయం భరించాల్సి వచ్చేది. కాని ప్రస్తుతం పెరుగుతున్న ధరలను పరిగణిస్తూ, చివరి పంట కోతలు కూడా పూర్తి చేసి సరుకు మార్కెట్లలో అమ్మకానికి తేవడం జరుగుతున్నది. కాబట్టి వచ్చే వారం రాబడులు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని కందుకూరు,పొదిలి పరిసర ప్రాంతాల నుండి తేజ, 341 రకాల రాబడులు 15-20 శాతం సరుకు రాబడి అవుతుండగా, నాణ్యతానుసారం అమ్మకం అయింది. వచ్చే వారం రాబడులు పెరిగే అవకాశం ఉంది. అయితే పెద్ద రైతులు, నిల్వ వ్యాపారులు, తమ సరుకు అమ్మకానికి బదులుగా శీతలగిడ్డంగులలో నిల్వ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.


 గుంటూరు శీతలగిడ్డంగుల నుండి గత వారం 60 వేల బస్తాల మిరప రాబడి కాగా 55 వేల బస్తాల సరుకు అమ్మకం అయింది. ఇందులో డీలక్స్ రకాలకు మంచి డిమాండ్ ఉండడంతో క్వాలిటీ ప్రకారం వ్యాపారం అవుతు న్నది. అయితే 334, సూపర్-10, బడిగ 355, సింజెంట బడిగ లాంటి రకా లతో పాటు పౌడర్ రకాలకు కూడా మంచి డిమాండ్ నెలకొన్నది. మరోవైపు అత్యధికంగా గత ఏడాది నిల్వ ఉంచిన (బిఎఫ్) సరుకు ఎక్కువగా అమ్మకానికి వస్తున్నది. కాబట్టి నాణ్యతానుసారం వ్యాపారం అవుతుంది. కాని మిగతా రకాల ధరలు స్థిరంగా ఉన్నాయి. 

గుంటూరు మార్కెట్లో నాణ్యమైన తేజ కొత్త సరుకు రూ. 15,000–18,000, డీలక్స్ రూ. 18,100-18,200, మీడియం రూ. 13,000-14,900, బడిగ-355 రూ. 15,000-20,000, సింజెంట బడిగ రూ. 15,000-20,500, డిడి రూ. 16,000-20,500, డీలక్స్ రూ. 21,000-21,500, (భద్రాచలం) 341 రూ. 15,000-19,000, దేశీవాలి (341 రకం) రూ. 15,000-21,000, 2043 రూ. 15,000–23,000, బుల్లెట్ రకం సరుకు రూ. 12,500-16,000, నెంబర్-5 రూ. 15,000–21,000, 334, సూపర్-10 రూ. 14,000-18,500, మీడియం రూ. 13,000-13,900, 4884 రూ. 12,500-15,500, 273 రూ. 15,000-18,500, బంగారం రకం రూ. 13,000-17,500, ఆర్మూర్ రకం రూ. 12,500–16,000, రొమి రూ. 12,500–16,200 మరియు 577 రకం రూ. 13,500-18,500, సీడ్ రకం మీడియం బెస్ట్ రూ. 12,000-15,000, తాలు కాయలు తేజ రూ. 9000-10,000, డీలక్స్ లాల్కట్ రూ. 10,500-11,500, తాలు కాయలు రూ. 5000-8500, 341, డిడి తాలు కాయలు రూ. 9000-11,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

గుంటూరు శీతల గిడ్డంగులలో నిల్వ అయిన నాణ్యమైన తేజ రకం రూ. 15,000-18,000, మీడియం బెస్ట్ రూ. 13,000-14,900, బడిగ 355 రకం రూ. 16,000-21,000, సింజెంట బడిగ రకం రూ. 15,000-20,500, 334, సూపర్-10 రకం రూ. 14,000-19,000, డీలక్స్ రూ. 19,200-19,500, నెంబర్-5 రూ. 16,000-21,500, 2043 రకం రూ.20,000–28,000, ఆర్మూర్ రకం రూ. 13,000-15,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


తెలంగాణలోని వరంగల్లో గత వారం 45 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై తేజ నాణ్యమైన సరుకు రూ. 14,000-16,000, 341 నాణ్యమైన సరుకు రూ.18,000-20,000, వండర్ హాట్ సరుకు రూ. 17,000-20,000, 1048 రకం రూ. 15,000-17,500, 5531 రకం రూ.15,000-17,500, సింగిల్పట్టి నాణ్యమైన సరుకు రూ. 33,000–38,000 మరియు శీతలగిడ్డంగులలో నిల్వ ఉంచిన దీపిక రకం రూ. 25,500,341 రకం సరుకు రూ. 20,500, వండర్హిట్ రూ. 23,000, టమాటా రకం సరుకు రూ. 46,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


ఖమ్మంలో గత సోమ, గురు, శుక్ర వారాలలో కలిసి 70 వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై తేజ నాణ్యమైన సరుకు రూ. 18,500, మీడియం రూ. 17,500-18,000, తాలుకాయలు రూ.8500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 హైదరాబాద్లో గత వారం 14-15 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై కొత్త మిర్చి అన్ని సీడ్ రకాలు రూ. 12,500-16,500, నాణ్యమైన తేజ రకం రూ. 17,000, మీడియం రూ. 13,000-16,000, 273 మీడియం బెస్ట్ రూ. 16,000-18,000, సూపర్-10 రకం రూ. 12,000-16,500, తాలు కాయలు నాణ్యమైన తేజ రూ. 9000, మీడియం రూ. 5000-8000, హైబ్రిడ్ తాలు రూ. 3000-6500 మరియు ఎసి తేజ రకం రూ. 16,000-18,500, సూపర్-10, 341, డిడి, సీ-5 మరియు 273 నాణ్యమైన రకాలు రూ. 21,000-22,000, మీడియం రూ. 18,000-20,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

కర్ణాటకలోని బ్యాడ్గి లో  గురువారం నాడు 2 వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై డిబ్బి రూ.30,000-33,000, నాణ్యమైన కెడిఎల్ రూ. 25,000–28,000, మీడియం రూ. 11,000-14,000, 2043 డీలక్స్ రూ. 21,000-23,000, 5531 నాణ్యమైన సరుకు రూ. 16,500-18,000, మీడియం రూ. 14,000-16,500, కెడిఎల్ తాలు కాయలు రూ. 2900-3500, సీడ్ తాలు కాయలు రూ.6000-9000 మరియు 3 వేల బస్తాల ఎసి సరుకు రాబడి కాగా, డబ్బి మిరప రూ. 40,000, నాణ్యమైన డబ్బి రూ. 33,000 -35,000, కెడిఎల్ రూ.29,500-35,000, 2043 రకం రూ. 29,000-31,000, 5531 తాలు కాయలు రూ. 8500-10,000, కెడి ఎల్ తాలు రూ. 3500-3900 ధరతో వ్యాపారమెంది. కర్ణాటకలోని సింధనూర్లో మంగళవారం నాడు 1000 బస్తాల సరుకు రాబడిపై సింజెంట బడిగ రూ. 28,000-30,000, 5531 రకం రూ.28,000-30,000, జిటి రకం రూ. 18,000-20,000, తెలుపు రకం మిర్చి తాలు కాయలు రూ. 3000-5000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 తమిళనాడులోని రామనాథపురం, పరమకుడి ప్రాంతాలలో 3500 బస్తాల కొత్త సరుకు రాబడి కాగా, బోల్డ్ రకం గుండు మిరప రూ. 30,000–33,000, తొడిమెతీసిన మిర్చి రూ. 30,000-32,000, మీడియం రూ.23,000-25,000, బేబి చిల్లీ (చిన్న రకం మిరప) రూ. 17,000-20,000, గుండు రకం తాలు కాయలు రూ.5000 ధరతో వ్యాపారమైంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో గత వారం 5-6 బస్తాల సరుకు రాబడిపై తేజ మరియు సన్-గ్రో రూ. 14,000–17,200, 4884 రూ. 13,000 -15,000, తాలు తేజ రూ. 8000-8500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog