పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు
ఈ ఏడాది మిర్చి రైతులకు లాభసాటి ధరలు లభ్యమైనందున పంజాబ్ లోని సునామ్, ఫిరోజ్్పూర్ మరియు పరిసర ప్రాంతాలలో మిర్చి సేద్యం భారీగా విస్తరించింది. పచ్చి కాయలు కొత్త సరుకు ప్రతి కిలో రూ. 5-7 ధరతో అమ్మ కమవుతున్నది. వాతావరణం సానుకూలించినట్లయితే మరో వారం రోజుల తర్వాత మిర్చి రాబడులు పోటెత్తగలవని తెలుస్తోంది. అత్యధికంగా ఈ సరుకు పంజాబ్, హర్యాణా, ఉత్తర ప్రదేశ్, దిల్లీ ప్రాంతాలలో అమ్మ కమయ్యే అవకాశం ఉంది. ధరలు తగ్గినట్లయితే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బీహార్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల నుండి డిమాండ్ నెలకొనే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని మిరప ఉత్పాదక ప్రాంతాలలో పంట కోతల సరుకు రైతులు శీతల గిడ్డంగులలో నిల్వ చేస్తున్నారు. నాణ్యమైన రకాలకు డిమాండ్ నెలకొన్నప్పటికీ రైతులు తమ సరుకు విక్రయించేందుకు విముఖ వ్యక్తం చేస్తున్నందున కేవలం 20-30 శాతం సరుకు మాత్రమే మార్కెట్కు రాబడి అవుతున్నది. ఆ వచ్చిన సరుకు కూడా రాబడి అయిన తక్షణమే అమ్మకమవుతున్నది. గత వారం గుంటూరు శీతల గిడ్డంగులలో మూడు నెలల క్రితం నిల్వ చేసిన సరుకు తేజ రూ. 22,500-24,000, సూపర్-10, 334 రూ. 22,000-23,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
మే 15 నుండి జూన్ 11 వరకు గుంటూరు మిర్చి యార్డుకు వేసవి విడిది ఉండగలదు. గత వారం గుంటూరు మార్కెట్లో నిర్వహించిన నాలుగు రోజుల లావాదేవీలలో 3.50 లక్షల బస్తాల సరుకు రాబడి కాగా 4.20 లక్షల బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో మీడియం, మీడియం బెస్ట్ రకాలు విస్తృతంగా రాబడి అయినందున ధర రూ. 1000-1500, అన్ని రకాల తాలు కాయలు రూ. 1000 పతనమైంది. కాగా తేజ తాలు కాయలు స్థిరంగా ఉన్నాయి. గుంటూరులో కొత్త తేజ మిర్చి రూ. 16,500-22,000, డీలక్స్ రూ. 22, 200-22, 500, ఎక్స్ ట్రా ఆర్డినరి రూ. 23,000, ఎక్కువగా సరుకు రూ. 19,000-21,500, బడిగ - 355 మీడియం రూ. 15,000-24,000, సింజెంట బడిగా రూ.14,000- 19,000, స్వర్ణ బడిగ రూ. 17,500 -21,000, 2043 రకం రూ.23,000-35,000, డిడి రూ. 16,500 -19,500, దేశవాలి 341 క్వాలిటీ రూ. 17,500-21,000, బీసిఎమ్ రకం రూ. 17,500-20,000, డీలక్స్ రూ. 20,500-21,000, నంబర్-5 రూ. 17,500-22,000, 273, కుబేరా రకాలు రూ. 15,000 - 18,500, ఆర్మూరు రకం రూ. 12,000-17,000, బంగారం రూ. 15,000-18,500 మరియు 334, సూపర్ -10 రూ. 14,000 -21,000, డీలక్స్ రూ. 21,500, రోమి రూ. 15,000–19,000, డీలక్స్ రూ. 19,500, బుల్లెట్ రూ. 15,000-19,000, క్లాసిక్ రూ. 12,000 -17,000, పసుపు వర్ణం మిర్చి రూ. 15,000-20,000, అన్ని సీడ్ మీడియం రకాలు రూ. 12,000 -17,000, తాలు కాయలు తేజ రూ. 12,000 -13,000, తాలు కాయలు రూ.6000-10,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమెంది. గత వారం రోజులుగా ఎడతెరపి లేని వర్షా లతో మిర్చి పంటపై ప్రభావం పొడసూపే అవకాశం ఉంది.
తెలంగాణలోని ఖమ్మం మార్కెట్లో గత వారం సుమారు 1 నుండి 1.05 లక్షల బస్తాల మిర్చి రాబడిపై నాణ్యమైన తేజ రూ. 22,700, మీడియంరూ. 19,000-20,000, తాలు కాయలు రూ. 10,000–11,000,మరియు
వరంగల్ మార్కెట్లో మంగళ, శుక్రవారాలలో కలిసి సుమారు 45 వేల బస్తాల రాబడిపై తేజ నాణ్యమైన సరుకు రూ. 20,600, మీడియం రూ. 18,000-20,000, పాలా క్వాలిటీ రూ. 16,000-17,000, 341 నాణ్యమైన సరుకు రూ. 21,000, మీడియం రూ. 17,000-19,000, వండర్ హాట్ మీడియం బెస్ట్ రూ.36,000, మీడియం రూ. 25,000–30,000 మరియు 5531 మరియు 1048 మీడియం బెస్ట్ రకాలు రూ. 18,000, డిడి మీడియం రూ. 20,000, టమాట రూ. 55,000, కోల్డు స్టోరేజీలలో నిల్వ అయిన డీలక్స్ టమాట రూ. 80,000, నాణ్యమెన దీపిక రకం రూ. 21,500, నాన్ ఎసి మీడియం రూ. 32,000ధరతో వ్యాపారమెంది.
హైదరాబాద్ మార్కెట్లో గత వారం జోగులాంబ, గద్వాల ప్రాంతాల నుండి 17–18 వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై 2043 బడిగ రకం మిర్చి రూ. 29,000-38,000, 273 రకం రూ. 12,000-20,000, డిడి, 341, సి-5 రకాలు రూ. 16,000-18,000, తేజ రూ. 15,000-21,000, సింజెంట్ బ్యాడిగ రూ. 14,000-18,000, ఆర్మూరు రకం రూ. 12,000-17,000, సూపర్-10 సరుకు రూ. 13,000 -21,000, తేజ తాలు కాయలు, సీడ్ తాలు కాయలు రూ. 8000–11,000, నాణ్యమైన తాలు కాయలు రూ. 13,000, సీడ్ కాయలు రూ.7000-9000, మీడియం కాయలు రూ.5000-9000 మరియు శీతల గిడ్డంగులలో నిల్వ అయిన 273 రకం రూ.22,000-23,000, తేజ రకం రూ. 23,500, సూపర్-10 రకం రూ. 22,000-24,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
కర్ణాటకలోని బ్యాడిగిలో మంగళవారం నాడు 1.22 లక్షల బస్తాల సరుకు రాబడి కాగా, డబ్బి రూ. 43,000–51,000, కెడిఎల్ డీలక్స్ రూ. 36,000-42,000, బెస్ట్ 2043 రకం రూ. 33,000-36,000, డిడి రూ. 17,000-19,000, నాణ్యమెన 5531 రకం రూ. 14,000–18,000, 334, సూపర్-10 రకాలు రూ. 16,000-18,500, 5531 రకం లాల్ - కట్ మిర్చి రూ. 11,000-14,000, కెడిఎల్ లాల్ కట్ రూ. 17,000-21,000, 5531 తాలు రూ. 8500-10,500, కేడిఎల్ తాలు కాయలు రూ. 9000-10,000 ధరతో వ్యాపారమైంది.
ఛత్తీస్గడ్ లోని జగదల్పూర్లో వారంలో 5-6 వేల బస్తాల రాబడిపై తేజ రూ. 18,000-21,500, 4884 రకం రూ. 15,000-18,000, తేజ తాలు కాయలు రూ. 10,000 -12,000 ధరతో వ్యాపారమెంది.
గుజరాత్లోని రాజ్కోట్లో దినసరి 200-300 బస్తాల రాబడిపై రవ్వా రకం రూ. 10,000-17,500, సానియా రకం రూ. 10,000-20,500, దేశవాలి రూ. 10,000-17,500, తాలు కాయలు రూ. 7500-10,000 ధరతో వ్యాపారమెంది. తమిళనాడులోని రామనాథపురంలో శుక్రవారం 2 వేల బస్తాలు రాబడి కాగా, నాణ్యమైన సరుకు రూ. 22,000-24,000, మీడియం రూ. 20,000-22,000, యావరేజ్ రూ. 16,000-19,000, పరమకుడిలో 2-3 వేల బస్తాల రాబడిపై రూ. 17,500-23,000 ధరతో వ్యాపారమైంది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు