చివరి విడత మిర్చి కోతలపై వర్షాల ప్రకోపం
గతవారం ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తెలంగాణా, గుజరాత్లలోని అన్ని మార్కెట్లలలో కలిసి దాదాపు 12-13 లక్షల బస్తాల సరుకు రాబడి అయింది. అంతేకాకుండా, ఉత్పాదక ప్రాంతాలలోని కోల్డుస్టోరేజీలలో సుమారు 3-4 లక్షల బస్తాల రైతుల సరుకు నేరుగా రవాణా అయింది.వ్యాపారస్తుల అంచనా ప్రకారం ప్రస్తుతం గుంటూరులో ని సుమారు 84 కోల్డు స్టోరేజీలలో కేవలం 74 కోల్డుస్టోరేజీలలో 49-50 లక్షల బస్తాలు, పలనాడు ప్రాంతంలోని మాచర్ల నుండి పిడుగురాళ్ల వరకు 21 కోల్డు స్టోరేజీలలో 13-14 లక్షల బస్తాలు, ఖమ్మం కోల్డ్ స్టోరేజీలలో 9.77 లక్షల బస్తాల సరుకు నిల్వ అయినట్లు అంచనా.
వ్యాపారస్తుల కథనం ప్రకారం చివరి విడత కోతల సమయంలో భారీ వర్షాలు కురవడంతో సరుకు నాణ్యత ప్రభావితమయింది. కొన్ని ప్రాంతాలలో పంట దిగుబడి5-10 క్వింటాళ్ల వరకు పెరగడం కూడా జరిగింది. అయితే, నాణ్యమైన రకాల రాబడులు తక్కువగా ఉన్నందున మరియు డీలక్స్ రకాలకు మంచి డిమాండ్ ఉండడంతో ధరలు పటిష్టంగా ఉన్నాయి మరియు మీడియం, మీడియం బెస్ట్ రకాల ధర రూ. 1000-1500, కర్నాటక ప్రాంతపు 2043 బ్యాడ్లీ రకం ధర సుమారు రూ. 3000 తగ్గి రూ.55,500 ధరతో అమ్మకమయ్యే సరుకు రూ.30,000-32,000 వరకు చేరింది. ఇందుకు ముఖ్యకారణమేమనగా, కర్నాటకలో ఎన్నికల కారణంగా రెతులు సరుకును గుంటూరుకు తరలిస్తున్నారు మరియు గిరాకీ తక్కువగా ఉన్నందున ధరలు తగ్గుముఖంలో ఉన్నాయి. తాలు రకం ధరలు రూ. 2000-3000 వరకు తగ్గాయి. అయితే, తేజ తాలుకు డిమాండ్ ఉండడంతో రూ. 12,000–13,500 ధరతో వ్యాపారమయింది. ప్రకాశం జిల్లాలోని అద్దంకి, కందుకూరు, పొదిలి, దర్షి ప్రాంతాల నుండి మొదటి విడత కోతల సరుకు రాబడి అవుతున్నది. ఇందులో తేజ మరియు 341 రకాలు అధికంగా ఉండడంతో పాటు సరుకు నాణ్యంగా ఉన్నందున రూ. 22,500-23,000 ధరతో వ్యాపారమయింది. కర్నూలు ప్రాంతంలో పంట కోతలు దాదాపు సమాప్తమయ్యాయి. గుంటూరు మార్కెట్లో కేవలం రెండు వారాల వరకు సరుకు రాబడి అయ్యే అవకాశం కలదు. గతవారం గుంటూరులో 5.70 లక్షల బస్తాల సరుకు రాబడి కాగా 6 లక్షల బస్తాల సరుకు అమ్మకమయింది. ఇందులో భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతాల నుండి నాణ్యమైన 341 రకం సరుకు రాబడి అవుతున్నది. ప్రస్తుతం నాణ్యమైన తేజ రకాలకు మంచి డిమాండ్ ఉంది. అయితే, మీడియం, మీడియం బెస్ట్ రకాలు అధికంగా రాబడి కావడంతో పాటు డిమాండ్ తక్కువగా ఉంది.
గుంటూరులో కొత్త తేజ మిర్చి రూ. 18,000 - 22,000, డీలక్స్ రూ. 22,200–22,500, ఎక్స్ ట్రా ఆర్డినరి రూ. 23,000, ఎక్కువగా సరుకు రూ. 19,500-21,500, బడిగ-355 మీడియం రూ. 15,000-24,000,సింజెంట బడిగ రూ. 14,000 – 19,000, డీలక్స్ రూ. 19,500-20,000, స్వర్ణ బడిగ రూ. 17,500-21,000, 2043 రకం రూ. 25,000-32,000, డిడి రూ. 17,500-19,500, డీలక్స్ రూ. 20,000, దేశవాలి 341 క్వాలిటీ రూ.17,500-21,500, బీసిఎమ్ రకం రూ. 17,500-21,000, నంబర్-5 రూ. 17,500-22,000, 273, కుబేరా రకాలు రూ. 17,000-20,000, ఆర్మూరు రకం రూ. 13,000–18,000, బంగారం రూ. 15,000–19,000 మరియు 334, సూపర్-10 రూ. 14,000- 21,000, డీలక్స్ సుపీరియర్ రూ. 21,500-22,000, రోమి రూ. 15,000-19,000,డీలక్స్ రూ.19,500, బుల్లెట్ రూ. 16,000-20,000, క్లాసిక్ రూ. 13,000-17,000, పసుపు వర్ణం మిర్చి రూ. 15,000-20,000, అన్ని సీడ్ మీడియం రకాలు రూ. 14,000–17,000, తాలు కాయలు తేజ రూ. 12,000-13,500, తాలు కాయలు రూ. 6000-11,000 మరియు శీతలగిడ్డంగులలో నిల్వ అయిన నాణ్యమైన తేజ డీలక్స్ రూ. 23,500-24,000 మరియు 334, సూపర్-10 రకాలు రూ. 22,000-23,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమెంది.
తెలంగాణలోని ఖమ్మం మార్కెట్లో గత వారం సుమారు 1.95 లక్షల బస్తాల మిర్చి రాబడిపై ధరలు రూ. 500-1000 తగ్గి నాణ్యమైన తేజ రూ. 22,300, మీడియం రూ. 19,000 -20,000, తాలు కాయలు రూ. 12,000మరియు
వరంగల్ మార్కెట్లో సోమ, గురు, శుక్రవారాలలో కలిసి సుమారు 1.10 లక్షల బస్తాల రాబడిపై తేజ నాణ్యమైన సరుకు రూ. 21,200, మీడియం రూ. 19,000-21,000, పాలా క్వాలిటీ రూ. 17,000-18,000, 341 నాణ్యమైన సరుకు రూ. 20,500, మీడియం రూ. 17,000–19,000, వండర్ట్ మీడియం సరుకు రూ. 34,000, మీడియం రూ. 25,000–30,000 మరియు 5531 మరియు 1048 మీడియం బెస్ట్ రకాలు రూ. 19,000, డిడి మీడియం రూ. 19,000, టమాట రూ. 51,000, కోల్డు స్టోరేజీలలో నిల్వ అయిన డీలక్స్ టమాట రూ. 80,000, నాణ్యమైన దీపిక రకం రూ. 23,000, మీడియం రూ. 18,000-22,000,
కేసముద్రంలో ప్రతిరోజు 1500–2000 బస్తాల రాబడి కాగా, తేజ రూ. 21,000, తాలు కాయలు రూ.13,000 ధరతో వ్యాపారమెంది.
హైదరాబాద్ మార్కెట్లో గత వారం జోగులాంబ, గద్వాల ప్రాంతాల నుండి 25-30 వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై 2043 బడిగ రకం మిర్చి రూ.29,000-40,000, 273 Ŏšo г. 12,000-18,000, &, 341, 3-5 రకాలు రూ. 16,000-18,000, తేజ రూ. 15,000-21,000, సింజెంట బ్యాడిగ రూ. 14,000–18,000, ఆర్మూరు రకం రూ. 12,000–16,000, సూపర్ -10 సరుకు రూ. 13,000-21,000, తేజ తాలు కాయలు, సీడ్తాలు కాయలు రూ. 8000–11,000, తాలు కాయలు రూ. 5000-7000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
కర్ణాటకలోని బ్యాడిగి లో సోమవారం నాడు 1.75 లక్షల బస్తాల కొత్త సరుకు రాబడిపై రూ. 2000-3000 తగ్గి డబ్బి రూ. 45,000-54,000, కెడిఎల్ డీలక్స్ రూ. 36,000-44,400, బెస్ట్ 2043 రకం రూ. 33,000-36,000, డిడి రూ. 17,000-19,000, నాణ్యమెన 553 రకం రూ. 14,000-17,000, 334, సూపర్-10 రకాలు రూ. 19,000-21,000,లాల్-కట్ మిర్చి రూ. 11,000–14,000, కెడిఎల్ లాల్ కట్ రూ. 17,000-23,000, 5531 తాలు రూ. 8500-10,500, కేడిఎల్ తాలు కాయలు రూ. 9000–11,000 మరియు సింధనూరులో మంగళవారం 10-12 వేల బస్తాల రాబడిపై గిరాకీ తక్కువగా ఉన్నందున సింజెంట బడిగరూ. 25,000-35,000, 5531 రకం రూ. 15,000-22,000, జిటి రకం రూ. 15,000-19,000, తేజ రకం రూ. 19,000, నాణ్యమైన తాలు రూ. 8000-12,000 ధరతో వ్యాపారమైంది.
ఛత్తీస్గడ్ లోని జగదల్పూర్లో వారంలో 7-8 వేల బస్తాల రాబడిపె తేజ రూ. 18,000-21,500, 4884 రకం రూ. 17,000-18,000, తేజ తాలు కాయలు రూ. 10,000-12,000 మరియు గుజరాత్లోని రాజ్కోట్లో దిన సరి 400-500 బస్తాల రాబడిపై రవ్వా రకం రూ. 12,500-17,500, సానియా రకం రూ. 10,000-20,000, దేశవాలి రూ. 10,000-17,500, తాలు కాయలు రూ. 7500-10,000 ధరతో వ్యాపారమెంది. తమిళనాడు లోని రామనాథపురంలో సోమవారం 3-4 వేల బస్తాలు రాబడి కాగా, నాణ్య మెన సరుకు రూ. 21,000-23,000, మీడియం రూ. 20,000-21,000, యావరేజ్ రూ. 17,000-20,000, పరమకుడిలో 2-3 వేల బస్తాల రాబ డిపె రూ. 17,000-23,000 ధరతో వ్యాపారమెంది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు