ఆంధ్ర్రప్రదేశ్ లో తగ్గిన మిర్చి సేద్యం

 


ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జూన్ 1 - ఆగస్టు 10 మధ్య కాలంలో రుతుపవనాల వర్షాలు సాధారణంతో పోలిస్తే 304 మి.మీ.కు గాను 355.8 మి.మీ. వర్షపాతం నమోదైనందున ఆగస్టు 10 నాటికి మిర్చి సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 84,762 హెక్టార్ల నుండి తగ్గి కేవలం 24,443 హెక్టార్లకు పరిమితమైంది. సీజన్ పర్యంతం మిర్చి సేద్యం 12-13 శాతం తగ్గగలదని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మార్కెట్లో గత వారం నిర్వహించిన 4 రోజుల లావాదేవీలలో 1.25 లక్షల బస్తాల సరుకు రాబడి అయింది. గుంటూరు శీతల గిడ్డంగుల నుండి 1 లక్ష బస్తాలు మరియు పరిసర ప్రాంతాల నుండి 25 వేల బస్తాలు కలిసి మొత్తం 1.25 లక్షల బస్తాల సరుకు అమ్మకం అయింది. 


ఇందులో డీలక్స్ రకాలకు డిమాండ్ నెలకొన్నందున ధర ప్రతి క్వింటాలుకు రూ. 200-500 వృద్ధి చెందగా, తాలు కాయల శ్రేణిలో సీడ్ రకాలతో పాటు ఇతర రకాల ధరలు చెక్కుచెదరకపోగా నాణ్యతానుసారం వ్యాపారమవుతున్నది. పొరుగు రాష్ట్రాల నుండి

 గుంటూరు మార్కెట్లో గత వారం ఎసి తేజ నాణ్యమైన సరుకు రూ. 17,000-23,500, బడిగ-355 రూ. 23,000-30,000, డీలక్స్ రూ. 30,200–30,500, సింజెంట బడిగ రూ. 22,000-29,000, డిడి రూ. 22,000-30,000, 341 రూ.22,000-30,000, నంబర్-5 రూ. 20,000-28,000, 273 రూ.22,000-28,000, సూపర్-10, 334. రూ. 17,000-25,500, డీలక్స్ రూ. 25,600-26,000, ఆర్మూర్ రకం రూ. 17,000-23,000, 4884 రూ. 17,500-22,000, రొమి రూ. 17,000-21,500, 577 రకం రూ. 22,000-27,500, బుల్లెట్ రూ. 18,000-24,500, బంగారం రకం రూ. 20,000-26,000, 2043 రూ. 23,000–38,500, తాలు కాయలు తేజ రూ. 12,500-14,000, ఇతర రకాలు రూ. 8500–14,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


తెలంగాణలోని వరంగల్ మార్కెట్లో 12 వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు రాబడిపై తేజ రూ. 23,000, మీడియం రూ. 19,000–22,000, 341 నాణ్యమైన సరుకు రూ. 30,000, మీడియం రూ. 25,000-27,000, డిడి నాణ్యమైన సరుకు రూ. 28,000, మీడియం రూ.23,000-27,000, వండర్ హాట్ నాణ్యమైన సరుకు రూ. 34,500, మీడియం రూ. 28,000–32,000, డీలక్స్ రూ. 35,000, నాణ్యమైన సరుకు 1048 రూ. 26,300, మీడియం రూ. 23,000-26,000, దీపిక నాణ్యమైన సరుకు రూ. 32,000, 334 నాణ్యమైన సరుకు 20,000, టమాట నాణ్యమైన సరుకు రూ. 67,500, సింగిల్ పట్టి రూ.60,000, మీడియం రూ.45,000-55,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యారమైంది. 

ఖమ్మంలో 25-26 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై తేజ నాణ్యమైన సరుకు రూ. 23,400, మీడియం రూ. 21,000-22,000, తాలు కాయలు తేజ రూ. 12,500 మరియు 3-4 వేల బస్తాల రైతుల సరుకు రాబడిపై నాణ్యమైన తేజ రూ. 17,000, తాలు కాయలు రూ. 8500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


హైదరాబాద్లో 1500 బస్తాల ఎసి సరుకు రాబడిపై డబ్బి బడిగా రూ. 30,000–40,000, 341 నాణ్యమైన సరుకు రూ. 29,000, మీడియం రూ. 20,000-28,000, సి-5 రూ. 20,000-27,000, సింజెంట బడిగ, డిడి రూ. 20,000-29,000, తేజ రూ. 16,000-24,000, సూపర్-10 నాణ్యమైన సరుకు రూ. 25,000-26,000, మీడియం రూ.20,000-22,000, 273 నాణ్యమైన సరుకు రూ. 27,000-27,500, మీడియం బెస్ట్ రూ. 20,000-25,000, మీడియం రూ. 17,000–19,000, తాలు కాయలు తేజ నాణ్యమైన సరుకు రూ. 14,000, మీడియం రూ. 9000–13,000, హైబ్రిడ్ సరుకు రూ. 8000-10,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


కర్ణాటకలోని బ్యాడ్గిలో  గత సోమ మరియు గురువారాలలో కలిసి 30 వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు రాబడి కాగా, కొనుగోళ్లు క్షీణించినందున 16 వేల బస్తాల సరుకు అమ్మకమెంది. ఇందులో డబ్బి నాణ్యమైన సరుకు రూ. 44,000-47,000, మీడియం రూ. 28,500-31,000, కెడిఎల్ డీలక్స్ రూ. 42,000-46,000, నాణ్యమైన సరుకు రూ. 37,000-42,000, మీడియం రూ. 18,000-23,500, 2043 డీలక్స్ రూ. 38,500-44,500. నాణ్యమైన సరుకు రూ. 34,000-37,000, 5531 రూ. 24,500-31,500, డిడి రూ. 29,500- 31,000, సూపర్-10, 334 రూ. 23,000-25.000, 5531 రూ. 9500-15,000, కెడిఎల్ తాలు కాయలు రూ. 5000-6000, సింధనూర్ మంగళవారం 500 బస్తాల శీతల గిడ్డంగుల సరుకు రాబడిపై సింజెంట బడిగా రూ. 41,000-44,000, సూపర్ -10 రూ. 24,000-28,500, 5531 రూ. 31,000-32,000, తేజ రూ. 25,000,తాలు కాయలు నాణ్యమైన సరుకు రూ. 14,000-15,000, హైబ్రిడ్ రూ. 6000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


తమిళనాడులోని రామనాథపురం మార్కెట్లో గత వారం 200 బస్తాల మిర్చి రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 25,000-27,000, మీడియం రూ. 22,000-22,500, యావరేజ్ సరుకు రూ. 18,000-20,000, తాలు కాయలు రూ. 6000-6500, పరమకుడిలో 200 బస్తాలు రూ. 24,000-26,000, మీడియం రూ. 20,000-22,000, యావరేజ్ సరుకు రూ. 17,000-20,000, తాలు కాయలు రూ. 6000-6500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


తమిళనాడులోని పరమకుడి శీతల గిడ్డంగులలో నిల్వ అయిన గుండు మిర్చి నాణ్యమైన సరుకు రూ. 32,000–33,000, మీడియం బెస్ట్ రూ. 28,000 29,000, మీడియం రూ. 24,000-25,000, తొడిమ తీసిన సరుకు రూ. 31,000–35,000, తాలు కాయలు రూ. 7000, గిడ్డంగులలో నిల్వ అయిన రైతుల సరుకు నాణ్యమైన గుండు మిర్చి రూ. 23,000–24,000, మీడియం రూ. 20,000-21,000, తొడిమ తీసిన సరుకు రూ. 25,000–30,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు