భారీ వర్షాల వలన హెచ్చుముఖంలో మిరప ధరలు




 కర్నాటకలోని బ్యాడ్గి లో గురువారం 100 బస్తాలు, సింధనూరులో 25 బస్తాల కొత్త మిరప రాబడి ప్రారంభమయింది. అయితే, రాబడులు పెరగడానికి ఒక నెల సమయం ఉంది. దక్షిణ భారత కోల్డు స్టోరేజీలలో నిల్వలు వేగంగా తగ్గుచున్నాయి. అయితే, మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ ప్రాంతంలో రాబడులు ప్రారంభమైనప్పటికీ, ప్రస్తుతం మార్కెట్లలో రాబడులు గత ఏడాదితో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తుల అంచనా ప్రకారం ప్రస్తుతం వర్షాల కారణంగా కర్నూలు, గుంతకల్, అనంతపురం ప్రాంతాలలో పంటకు నష్టం వాటిల్లుతున్నది. గుంటూరు, ప్రకాశం జిల్లాలలో వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాలలో నాట్లు వాలిపోయాయి. ఇక ముందు కూడా వర్షాలు కురిసే పరిస్థితి ఉంది. దీనితో అక్టోబర్ -నవంబర్ వరకు నాణ్యమైన రకాల ధర రూ. 1000-1500 వరకు పెరగవచ్చు.


 ఎందుకనగా, మధ్య ప్రదేశ్ లోని అన్ని మార్కెటలలో కలిసి గతవారం కేవలం 20-22 వేల బస్తాల సరుకు రాబడి అయింది. అనగా, గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే రాబడులు తగ్గాయి. ఇతర రాష్ట్రాల వ్యాపారులు సరుకు కొనుగోలు కోసం మధ్య ప్రదేశ్ పై దృష్టి సారిస్తున్నారు. దీనితో ప్రస్తుతానికి ధరలు తగ్గే పరిస్థితి లేదు మరియు రైతులకు మెరుగైన ధరలు లభించగలవు. లభించిన సమాచారం ప్రకారం వరంగల్ లో టమాటా సూపర్ డీలక్స్ రకం మిరప ధర పెరిగి రూ. 70000-90000 ప్రతి క్వింటాలుకు చేరడంతో అన్ని రాష్ట్రాలలో పెద్ద వ్యాపారులు అన్ని రకాల మిరపను నెమ్మదిగా విక్రయిస్తున్నారు. ఈ ఏడాది మిరప వ్యాపారంలో పెట్టుబడి రెట్టింపు కావడంతో మర ఆడించే చిన్న యూనిట్లు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేయవలసి వస్తున్నది. దేశంలో పెద్ద యూనిట్లతో పోలిస్తే చిన్న యూనిట్ల సంఖ్య అధికంగా ఉంది. దీనితో డిసెంబర్ చివరి వరకు మార్కెట్లలో రాబడి అయిన సరుకు చేతులమీదనే అమ్మకం అవుతూ ఉండగలదు. కర్నాటకలోని బ్యాడీలో కొత్త 5531 నిమ్ము రకం సరుకు రూ. 26000-32200, తాలు రూ. 13000-17000, సింధనూరులో ఆంధ్ర ప్రాంతం నుండి 25 బస్తాల కొత్త మిరప రాబడిపె 5531 నిమ్ము రకం సరుకు రూ.27000 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది. 

బ్యాడ్గి లో సోమ మరియు గురువారాలలో కలిసి 27 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపె కేవలం 11 వేల బస్తాల సరుకు అమ్మకం కాగా, డబ్బీ రూ. 44000-49500, నాణ్య మైన కెడి ఎల్ రూ. 41000-44000, మీడియం రూ. 15000-19000, 2043 డీలక్స్ రూ. 40000-43500, నాణ్యమైన 2043 రకం రూ. 34000-37000, 5531 రకం రూ. 24500-29500, 5531 రకం రూ. 24500-29500, 5531 తాలు రూ. 9000-12000, కెడిఎల్ తాలు రూ. 4000-5000 మరియు సింధనూరులో కోర్టు స్టోరేజీల నుండి 300-400 బస్తాల అమ్మకంపై సింజెంటా బ్యాడ్లీ రూ. 38000-40000, జిటి, సూపర్-10 రకాలు రూ. 24000-26000, తేజ రూ. 24000, నాణ్యమైన తాలు రూ. 13000-14000, మీడియం రూ. 8000-8500 ధరతో వ్యాపారమయింది. 

గుంటూరు మారెట్లో గతవారం కోల్డు స్టోరేజీల నుండి దాదాపు 2.75 లక్షల బస్తాల రాబడిపె గుంటూరు ఎసి 1.50 లక్షల బస్తాలు మరియు పరిసర ఎసి 35 వేల బస్తాలు కలిసి 1.85 లక్షల బస్తాల సరుకు అమ్మకమయింది. ఇందులో గత ఏడాది సరుకులో మీడియం, మీడియం బెస్ట్, తేజా రకాల అమ్మకాలు అధికంగా ఉన్నాయి. ఎందుకనగా, ప్రస్తుత వర్షాల వలన ధరలు పెరిగే అవకాశం ఉండడంతో స్టాకిస్టులు డీలక్స్ రకాలను చాలా తక్కువగా విక్రయిస్తున్నారు. దీనితో తేజ డీలక్స్ రూ. 500, తేజమీడియం, మీడియం బెస్ట్ రకాలు రూ. 1000 క్వాలిటీ ప్రకారం మరియు అన్ని రకాలు రూ. 500 పెరగగా, తాలు, తేజ తాలు రకాల ధరలు స్థిరంగా ఉన్నాయి.

 గుంటూరు కోల్డు స్టోరేజీలలో నిల్వ అయిన నాణ్యమైన తేజ రూ. 18000-22500, డీలక్స్ ఎక్స్ ట్రార్డినరీ రూ. 22600-23000, ఎక్కువగా సరుకు రూ. 20000-22000, 355 బ్యా డ్లీ రూ. 22000-29500, సింజెంటా బ్యా డ్జీ రూ. 20000-28000, డిడి రూ. 20000-28500, 341 రకం రూ. 20000-29500, నెం.5 రకం రూ. 20000-28000, 273 రకం రూ. 20000-27000, 334 మరియు సూపర్-10 రకాలు రూ. 17000-25500, డీలక్స్ రూ. 25600-26000, ఆర్మూరు రూ. 17000-22000, డీలక్స్ రూ. 22200-22500, 4884 రకం రూ. 17000-21500, రోమి రూ. 17000-21000, 577 రకం రూ. 20000-27000, బులెట్ రూ. 18000-24000, బంగారం రూ. 18000-25500, 2043 రకం రూ. 29000-40000, తేజ తాలు రూ. 11500-13000, తాలు రూ. 6000-14000 ధరతో వ్యాపారమయింది.

వరంగల్ లో వారంలో దాదాపు 30-35 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపె నాణ్యమైన తేజ రూ. 22000, మీడియం రూ.19000-20000, నాణ్యమైన 341 రకం రూ. 29100,మీడియం రూ. 20000-25000, నాణ్యమైన వండర్ హాట్ రూ. 35000, మీడియం రూ. 30000-33000, 1048 రకం రూ. 23000, నాణ్యమైన దీపికా రూ. 34000, మీడియం రూ. 30000, నాణ్యమైన టమాటా రూ. 90000, మీడియం బెస్ట్ రూ. 80000, మీడియం రూ. 65000-75000, నాణ్యమైన సింగల్ పట్టి రూ. 50000, మీడియం రూ. 20000-38000, తేజ తాలు రూ. 11000-13500 మరియు ఖమ్మంలో గతవారం 45-47 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపె నాణ్యమైన తేజ రూ. 22600, మీడియం రూ. 20000-21000, తేజ తాలు రూ. 12000 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపారమయింది.

హైదరాబాద్ లో గతవారం కోల్డు స్టోరేజీల నుండి 4 వేల బస్తాల సరుకు అమ్మకంపె డబ్బీ బ్యా డ్జీ రూ. 30000-45000, నాణ్య మైన 341 రకం రూ. 28000 -28500, మీడియం రూ. 26000-27000, నాణ్యమైన సి-5 రకం రూ. 28000-28500, మీడియం రూ. 20000-26000, తేజ రూ. 16000-23000, నాణ్యమైన సూపర్-10 రకం రూ. 23500-25000,మీడియం రూ. 20000-22000, 273 రకం రూ. 24000-26500, నాణ్యమైన తేజ తాలు రూ. 13000, మీడియం రూ. 9000-10000, హైబ్రిడ్ తాలు రూ. 8000-8500 ధరతో వ్యాపారమయింది.

మధ్యప్రదేశ్ లోని బేడియాలో ఆది మరియు గురువారాలలో కలిసి 10-12 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై మహీ ఫూలకు రూ. 16000-20000, తొడిమతో రూ. 15000-18000, లాల్ కట్ రూ. 14000-16000, ఫూల్ కట్ తాలు రూ. 10000-12000, తొడిమతో తాలు రూ. 8000 -10000, ధామనోలో శుక్రవారం 3-4 వేల బస్తాల రాబడిపై 720 మహీ తొడిమ లేకుండా రూ. 30000 -32000, తొడిమతో ఎండు సరుకు రూ. 25000 - 27000, మహీ తొడిమతో రూ. 17000-19000, మీడియం రూ. 14000-16000, తొడిమ లేకుండా రూ. 21000-23000, తాలు రూ. 10500 -11500 మరియు జగదల్పూర్ లో 5-6 వేల బస్తాల ఎసి సరుకు అమ్మ కంపె తేజ రూ. 17000-21200, 4884 రకం రూ. 17000-19000, తేజ తాలు రూ. 11000-13000 ధరతో వ్యాపారమయింది.

తమిళనాడులోని రామనాథపురం, పరమకుడి ప్రాంతా లలో నాణ్య మైన మిరప రూ. 22,000-24,000,మీడియం రూ. 20,000-21,000, యావరేజ్ రూ. 18,000-20,000, తాలు కాయలు రూ. 6400-6500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమెంది.

Comments

Popular posts from this blog