ఇతర రాష్ట్రాలలో పెరిగిన మిర్చి స్టాకిస్టుల అమ్మకాలు
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
-
లభించిన సమాచారం ప్రకారం పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ లాంటి రాష్ట్రాలలో ఈ ఏడాది మిరప వ్యాపారులకు మంచి లాభాలు చేకూరుతున్నాయి. తద్వారా స్టాకిస్టుల అమ్మకాలు పెర గడం వలన మిరప ఉత్పాదక రాష్ట్రాలలో మందకొడి గమనించబడింది మరియు వ్యాపారుల అంచనా ప్రకారం సరుకు కొరత ఉంది. ఇతర రాష్ట్రాలలో నిల్వ అయిన 50 శాతం సరుకు నెల రోజులలో అమ్మకం అయిన తరువాత తిరిగి కొనుగోళ్లు ప్రారంభం కాగలవు. ఎందుకనగా కొత్త సీజన్ కోసం మరో 6 నెలల సమయం ఉంది. మధ్య ప్రదేశ్లో నవంబర్ వరకు కొత్త సరుకు నిమ్ముతో ఉండగలదు. అయితే మర ఆడించే యూనిట్లకు ఎండు సరుకు అవసరం ఉంటుంది.
గుంటూరు మార్కెట్లో గతవారం 5 రోజుల వ్యాపారంలో గుంటూరు మరియు పరిసర ప్రాంతాల కోల్డుస్టోరేజీల నుండి 2.30 లక్షల బస్తాల రాబడిపై గుంటూరు ఎసి సరుకు 1 లక్షల బస్తాలు మరియు పరిసర కోల్డుస్టోరేజీల 30 వేల బస్తాలు కలిసి 1.30 లక్షల బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో డీలక్స్ సీడ్ రకాల ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అంచనాతో డిమాండ్ ఉన్నప్పటికీ, సరుకు విక్రయించడానికి ఆసక్తి చూపడం లేదు. బంగ్లాదేశ్, శ్రీలంక, చైనా లాంటి దేశా లకు ఎగుమతి ఆర్డర్స్ లేనందున వ్యాపారుల కొనుగోల్లు మందగించాయి. కాగా మరో 15 రోజులలో ఎగుమతి ఆర్డర్స్ లభించే అవకాశం ఉంది.
గుంటూరులో డీలక్స్ తేజ రూ. 700, ఆర్మూర్, రోమి, తేజ తాలు కాయల ధరలు రూ. 500 ప్రతి క్వింటాలుకు తగ్గాయి. కాగా మీడియం, మీడియం బెస్ట్ రకాల ధరలు సాధారణంగా ఉండగా, ఇతర అన్ని రకాల ధరలు స్థిరంగా ఉండ డంతో క్వాలిటీ ప్రకారం వ్యాపారం అవుతోంది.
గుంటూరు మార్కెట్లో గత వారం ఎసి తేజ నాణ్యమైన సరుకు రూ. 17,000 - 23,500, బడిగ-355 రూ. 23,000 -30,000, సింజెంటా బడిగ రూ. 22,000-29,000, డిడి రూ. 22,000-29,000, 341 రకం రూ. 23,000-30,000, నంబర్-5 రూ.22,000-28,500, 273 రూ. 22,500-28,500, సూపర్-10, 334 రకాలు రూ. 17,000-25,500, డీలక్స్ రూ. 25,600-26,000, ఆర్మూర్ రకం రూ. 17,000 - 23,000,4884 రకం రూ. 17,500-22,000, రోమి రకం రూ. 17,000-21,500, 577 రకం రూ. 22,000–27,500, బుల్లెట్ రూ. 18,000-24,000, బంగారం రకం రూ. 20,000-25, 500, 2043 రూ. 27,000-38,000, తాలు కాయలు తేజు. రూ. 12,500– 14,000 మరియు తాలు రూ. 8500-14,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమయింది.
తెలంగాణలోని వరంగల్ మార్కెట్లో గత వారం 30-32 వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు రాబడిపై తేజ రూ.23,500, మీడియం రూ. 19,000-20,000, నాణ్యమైన 341 రూ.27,600, మీడియం రూ. 25,000-27,000, డీలక్స్ రూ. 30,000, నాణ్యమైన డిడి రూ. 28,000, మీడియం రూ. 23,000-27,000, వండర్ హాట్ రూ. 34,500, మీడియం 28,000-33,000, నాణ్యమైన 1048 రకం రూ. 27,000, మీడియం రూ. 23,000–26,000, నాణ్యమెన దీపిక రూ. 32,500, నాణ్యమెన 334 రకం రూ. 21,000, నాణ్యమైన టమాట రకం సరుకు రూ. 67,500, నాణ్య మన సింగిల్పట్టి రూ.60,000, మీడియం రూ. 45,000-55,000 మరియు 150-200 బస్తాల రైతుల సరుకు రాబడిపై తేజ రూ. 14,000-16,500,
ఖమ్మంలో కోల్డ్ స్టోరేజీలలో 10 లక్షల 99 వేల బస్తాల మిరప నిల్వలు ఉన్నట్లు సమాచారం మరియు గత వారం 45-50 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై తేజ నాణ్యమైన సరుకు రూ. 23,200, మీడియం రూ. 20,000-21,000, తాలు కాయలు తేజ రూ. 13,000 మరియు 8-9 వేల బస్తాల రైతుల సరుకు రాబడిపై నాణ్యమైన తేజ రూ. 17,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు