ఆం.ప్ర.లో శరవేగంతో దూసుకుపోతున్న మూడో విడత మిర్చి కోతలు

 


 గుంటూరు మరియు పరిసర ప్రాంతాలలో మూడోవిడత మిర్చి కోతల ప్రక్రియ జోరందుకున్నది. కావున మరో వారం రోజులలో రాబడులు పోటెత్తగలవని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. మే నెల మూడో వారం వరకు రాబడులు కొనసాగే అవకాశం కనిపిస్తున్నది. అయితే, డీలక్స్ సరుకుకు కొరత ఏర్పడగలదని నిపుణులు భావిస్తున్నారు. చైనా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, యుఎఇ కోసం నాణ్యమైన రకాలకు డిమాండ్ నెలకొన్నందున ధరలకు మద్దతు లభిస్తున్నది. దక్షిణాది రాష్ట్రాలలోని అన్ని మార్కెట్లలో కలిసి గత వారం 15 లక్షల బస్తాల సరుకు రాబడి అయింది. నాణ్యమైన రకాల సరుకు శీతల గిడ్డంగులకు తరలించబడింది. ఖమ్మం శీతల గిడ్డంగులలో శనివారం నాటికి మిర్చి నిల్వలు 8,97,500 బస్తాలకు చేరాయి.



గుంటూరు మార్కెట్లో గత వారం రాబడి అయిన 5.60 లక్షల బసాలు మరియు మిగులు నిల్వలు కలిసి మొత్తం 6.25 లక్షల బస్తాల మిర్చి అమ్మకమైంది. ఇందులో 75-80 శాతం మీడియం, మీడియం బెస్ట్, నిమ్ము సరుకు మరియు 20 శాతం డీలక్స్ రకాల మిర్చి డిమాండ్ నెలకొన్నది. అయితే, అందుకు అనుగుణంగా సరుకు సరుకు అందుబాటులో లేదు. తేజకు ఒలియోరెజిన్ సరుకు కోసం మసాలా గ్రైండింగ్ యూనిట్ల నుండి డిమాండ్ కొనసాగుతున్నంది. తాలుకాయలు సీడ్ రూ. 3000, తేజ తాలు రూ. 2000 మరియు 2043 దాదాపు రూ. 6000 పతనమైంది. కర్ణాటక నుండి గుంటూరుకు మిర్చి అమ్మకం కోసం తరలించినప్పటికీ వినియోగదారులు తమ అవసరానికి అనుగుణంగా కొనుగోలు చేస్తున్నందున అత్యధిక సరుకు శీతల గిడ్డంగులకే పరిమితమైంది.

గుంటూరులో కొత్త తేజ మిర్చి రూ. 18,000 – 21,500, డీలక్స్ రూ. 21,600-22,000, ఎక్స్ ట్రా ఆర్డినరి రూ.22,500, ఎక్కువగా సరుకు రూ. 19,000-21,000, బడిగ-355 మీడియం రూ. 17,000-27,000, సింజెంట బడిగ రూ. 14,000 - 20,000, స్వర్ణ బడిగ రూ. 17,000-21,500, 2043 రకం రూ. 28,000-35,000, డిడి రూ.17,000–19,000, డీలక్స్ రూ. 19,500-20,000, దేశవాలి 341 క్వాలిటీ రూ. 17,500-20,000, డీలక్స్ రూ. 20,500-21,000, బీసిఎమ్ రకం రూ. 17,500-20,000, నంబర్-5 రూ. 17,500-22,000, డీలక్స్ రూ. 22,500-23,000, 273, కుబేరా రకాలు రూ. 17,000-20,000, ఆర్మూరు రకం రూ. 15,000-18,000, బంగారం రూ. 17,500-20,000 మరియు 334, సూపర్-10 రూ. 15,000-21,500, డీలక్స్ సుపీరియర్ రూ. 22,000-22,500, రోమి రూ. 16,000–18,500, బుల్లెట్ రూ. 17,500-20,000, పసుపు వర్ణం మిర్చి రూ.19,000-23,000, క్లాసిక్ రూ. 14,000-18,000, తాలు కాయలు తేజ రూ. 11,500 -13,000, తాలు కాయలు రూ. 7000-11,000, అన్ని సీడ్ మీడియం రకాలు రూ. 14,000-17,000 ధరతో వ్యాపారమయింది. 

తెలంగాణలోని వరంగల్ మార్కెట్ లో గతవారం 1.65 లక్షల బస్తాల రాబడిపై తేజ నాణ్యమైన సరుకు రూ. 21,600, మీడియం రూ. 19,000-21,000, పాలా క్వాలిటీ రూ. 17,000-19,000, 341 నాణ్యమైన “సెరుకు రూ. 19,200, మీడియం రూ. 16,000-18,000, వండర్ హాట్ మీడియం సరుకు రూ. 35,000, పౌడర్ రకం సరుకు రూ.25,000-30,000, 5531 మరియు 1048 మీడియం బెస్ట్ రకాలు రూ. 19,500, టమాట రూ. 61,000, కోల్డు స్టోరేజీలలో నిల్వ అయిన డీలక్స్ టమాట రూ. 80,000, నాణ్యమెన దీపిక రకం రూ.26,000, మీడియం రూ. 20,000-25,000, సింగల్పట్టి మీడియం రూ. 50,000 మరియు కేసముద్రంలో ప్రతిరోజు 1500-2000 బస్తాల రాబడి కాగా, తేజ రూ. 15,029-21,551, తాలు కాయలు రూ. 10,329-15,011 మరియు

ఖమ్మం మార్కెట్లో గత వారం సుమారు 2.45 లక్షల బస్తాల మిర్చి రాబడిపై నాణ్యమైన తేజ రూ. 22,900, మీడియం రూ. 20,000 -21,000, తాలు కాయలు రూ. 14,000-15,000 ధరతో వ్యాపారమైంది.

హైదరాబాద్ మార్కెట్లో గత వారం జోగులాంబ, గద్వాల ప్రాంతాల నుండి 25-30 వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై 2043 బడిగ రకం మిర్చి రూ. 33,000-47,000, డిడి, 273 మరియు 341, సి-5 రకాలు రూ. 16,000-21,000, తేజ రూ. 16,000 – 21,500, సింజెంట బ్యాడిగా రూ. 16,000-21,000, ఆర్మూరు రకం రూ. 16,000-20,000, సూపర్-10 సరుకు రూ. 16,000-22,000, తేజ తాలు కాయలు రూ. 7000–14,000, సీడ్ తాలు కాయలు రూ. 8000–13,000, తాలు కాయలు రూ. 5000-8000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 మహారాష్ట్రలోని నాగపూర్లో 20-25 వేల బస్తాల రాబడి పై తేజ రూ. 21,000-21,500, తాలు కాయలు రూ. 13,000–14,000, నందూర్ బార్ 400-500 బస్తాలు నిమ్ము రకం రూ. 5200-5800 ధరతో వ్యాపారమెంది.

కర్ణాటకలోని బ్యాడిగి లో సోమవారం నాడు 2.87 లక్షల బస్తాల కొత్త సరుకు రాబడి పై రూ. 2000 - 3000 తగ్గి డబ్బి రూ. 45,000-55,000, కెడిఎల్ డీలక్స్ రూ.43,000-50,000, బెస్ట్ రూ. 36,000-42,000, మీడియం రూ. 18,000-20,000, 2043 డీలక్స్ రూ. 36,000-42,000, మీడియం బెస్ట్ రూ. 33,000-36,000, డిడి రూ.17,000-20,000, నాణ్యమెన 5531 రూ. 16,000-19,000, 334, సూపర్ - 10 రకాలు రూ. 19,000-21,000, లాల్-కట్ మిర్చి రూ. 12,000–14,000, కెడిఎల్ లాల్ కట్ రూ. 23,000 - 28,000, 5531 తాలు 11,000-13,000, కేడిఎల్ తాలు కాయలు రూ. 9000-11,000 మరియు సింధనూరులో మంగళవారం 22-25 వేల బస్తాల రాబడిపై సింజెంట బడిగా రూ.25,000-40,000, 2043 రకం రూ. 45,000-50,000, 5531 రకం రూ. 15,000-21,000, జిటి రకం రూ. 15,000-20,000, తేజ రకం రూ. 20,000, నాణ్యమెన తాలు రూ. 8000–14,000 ధరతో వ్యాపారమైంది.

ఛత్తీస్గడ్ లోని జగదల్పూర్లో వారంలో 8-10 వేల బస్తాల రాబడిపై తేజ రూ. 19,000-22,000, 4884 రకం రూ. 17,500-19,000, తేజ తాలు కాయలు రూ. 12,000 - 14,000 ధరతో వ్యాపారమెంది.

తమిళనాడులోని రామనాథపురంలో సోమవారం 5 వేల బస్తాలు రాబడి కాగా, నాణ్యమైన సరుకు రూ. 23,000-26,000, మీడియం రూ. 20,000-22,000, యావరేజ్ రూ. 17,000-20,000, తాలు కాయలు రూ. 9600 మరియు పరమకుడిలో 3-4 వేల బస్తాల రాబ డిపె నాణ్యమైన సరుకు రూ. 24,000-26,000, మీడియం రూ. 20,000-23,000, యావరేజ్ రూ. 17,000-20,000, తాలు కాయలు రూ. 9100-9300 ధరతో వ్యాపారమైన్ది.

Comments

Popular posts from this blog