రబీ సీజన్లో విస్తృతంగా "ఆవాల" సాగు

 

18-10-2021

ఆవాలకు గిట్టుబాటవుతున్న లాభసాటి ధరలు, సానుకూల వాతావరణం వలన రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రముఖ ఆవాల ఉత్పాదక రాష్ట్రాలలో రైతులు రబీ సీజన్ కోసం ఆవాల సేద్యం విస్తృతంగా చేపట్టే అవకాశం కనిపిస్తున్నది. ఎందుకనగా, గోధుమ మరియు శనగ స్థానంలో ఆవాల సేద్యం చేట్టడానికి అత్యంత అనుకూలంగా ఉండడమే ఇందుకు నిదర్శనం. 


గత ఏడాది దేశంలో 86-88 ల.ట. ఆవాలు ఉత్పత్తి రాణించింది. ప్రస్తుతం రైతులు మరియు నూనె మిల్లర్ల వద్ద కలిసి 14-15 ల.ట. సరుకు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త సీజన్ ప్రారంభం వరకు నెలవారీ వినియోగం 7-8 ల.ట. చొప్పున కేవలం రెండు నెలలకు సరిపడ సరుకు నిల్వలు ఉన్నాయి. తద్వారా ధరలకు మందగమనం పొడసూపే అవకాశం లేదు.

 రాజస్తాన్, హర్యాణా మరియు మధ్య ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో ఆవాల సేద్యం ప్రారంభమైంది. అయితే, ఆశాజనకంగా లేదు. మరో 15 రోజులలో ఊపందుకునే అవకాశం ఉంది. అక్టోబర్ 15 వరకు దేశంలో ఆవాల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 55 శాతం వృద్ధి చెంది 2.80 ల.హె.కు విస్తరించింది. ఇందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో విస్తరించింది. విరామం లేకుండా సేద్యం ప్రక్రియ చేపట్టబడుతున్నది. ఎందుకనగా, ఈ ఏడాది ఉత్పాదకులకు 35-40 శాతం అధిక ధరలు లభ్యం కావడమే ఇందుకు నిదర్శనం. 

ప్రస్తుత పంటకాలం 2021-22 కోసం ఆవాల కనీస మద్దతు ధర ముందు సంవత్సరంతో పోలిస్తే ప్రతి క్వింటాలుకు రూ.4650 నుండి రూ.400 పెంచి రూ.5050 నిర్ధారించబడింది. కావున రైతులు అత్యంత ఉత్సాహంతో గత ఏడాది ఆవాల సేద్యం 61.55 ల.హె.కు గాను 70 ల.హె.కు విస్తృతపరిచి ఉత్పత్తి 94-95 ల.ట. సరుకు దిగుబడి సాధించే అవకాశం ఉందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. ప్రస్తుత పంట కాలం (2021 జూన్ 2022 మే లో ఆవాల ఉత్పత్తి 101.20 ల.ట. ఉండగలదని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తమ నాల్గవ ముందస్తు అంచనాలో పేర్కొనగా 86 ల.ట.కు పరిమితం కాగలదని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాజస్తాన్, హర్యాణా మరియు మధ్య ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో ఆవాల సేద్యం ప్రారంభమైంది. అయితే, సేద్యం నత్తనడకన కొనసాగుతున్నది. అయితే, రైతులు ఈ ఏడాది ఆవాల సేద్యం విస్తృతంగా చేపట్టే అవకాశం కనిపిస్తున్నది. అక్టోబర్ చివరి నాటికి సేద్యం గత ఏడాదితో పోలిస్తే 25 శాతం వృద్ధి చెందవచ్చని భావిస్తున్నారు. 

కావున రాజస్తాన్లో ఆవాల ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 35 ల.ట.కు గాను 40 ల.ట., ఉత్తరప్రదేశ్లో 13 ల.ట.కు గాను 15 ల.ట. పంజాబ్, హర్యాణాలో 9.50 ల.ట.కు గాను 11.50 ల.ట., మధ్యప్రదేశ్ లో 8.50 ల.ట.కు గాను 10 ల.ట., గుజరాత్ లో 4 ల.ట. కు గాను 4.50 ల.ట., పశ్చిమ బెంగాల్ మరియు తూర్పు ప్రాంత రాష్ట్రాలతో పాటు దేశం లోని అన్ని రాష్ట్రాలలో కలిసి 14.50 ల.ట.కు గాను 17 ల.ట. సరుకు దిగుబడి రాణించగలదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు