సన్ ఫ్లవర్

 


హెదరాబాద్ - కర్ణాటకలోని చిత్రదుర్గ్, బళ్లారి ప్రాంతాలలో దినసరి 1000 వేల బస్తాల సన్ఫ్లవర్ రాబడి కాగా, రూ.500-7500 మరియు గుజరాత్లోని రాజ్కోట్లో వారంలో 2 -3 వేల బస్తాల రాబడి కాగా, మీడియం రూ. 4000-6000, నాణ్యమైన సరుకు రూ.6500-7500 మరియు వెల్లకోవిల్లో సంతరోజు 1300 బస్తాల రాబడి కాగా, రూ.5275-7655 ధరతో వ్యాపారమైంది.


రష్యా నుండి సన్ఫ్లవర్ నూనె కొనుగోళ్లు


ముంబై - పరిశ్రమ వర్గాల కథనం ప్రకారం యుద్ధం కారణంగా ఉక్రెయిన్ 8 నుండి దిగుమతులు ఆగిపోవడంతో మరియు ఇండోనేషియా నుండి పామాయిల్ - సరఫరా పరిమితంగా ఉన్నందున అలాగే దక్షిణ అమెరికా దేశాలలో సోయా పంట ఉత్పత్తి తగ్గడంతో మనదేశం రష్యా నుండి ఏప్రిల్ షిప్మెంట్ కోసం సరుకు దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. యుద్ధానికి ముందు సన్ఫ్లవర్ నూనె = ధర 1630 డాలర్లు ప్రతి టన్ను ఉండగా, ప్రస్తుతం దిగుమతిదారులు 2150 డాలర్లు సి అండ్ ఎఫ్ ధరతో 45,000 టన్నుల సరుకు దిగుమతికి వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీని వలన దేశంలో వంటనూనెల లోటును కొంతమేర పూరించడానికి సహాయం లభించగలదు. ప్రస్తుతం రష్యాలోని రెండు ఓడరేవుల నుండి సన్ఫ్లవర్ నూనె రవాణాకు సిద్ధంగా ఉంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు