సన్ ఫ్లవర్ నూనె ధరలు తగ్గే అవకాశం లేనట్లే




మనదేశంలో వంటనూనెల వినియోగంలో సన్ఫ్లవర్ నూనె భాగస్వామ్యం 10 శాతం ఉంది. అయితే, ధరలను అదుపు చేయడం ప్రభుత్వ నియంత్రణలో లేదు. ఎందుకనగా, వినియోగం కోసం విదేశాల నుండి సరుకు దిగుమతి చేసుకోవలసి వస్తున్నది. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సరఫరా ప్రభావితమైన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు హెచ్చుముఖంలో ఉన్నాయి. ఇండోనేషియా పామాయిల్ అసోసియేషన్ వర్గాల కథనం ప్రకారం ప్రస్తుత సంవత్సరం ప్రథమార్ధంలో అనగా జనవరి నుండి జూన్ వరకు అంతర్జాతీయ స్థాయిలో వంటనూనెల కొరతకు అవకాశం కలదు. ఇందుకు ముఖ్య కారణమేమనగా, ప్రముఖ సన్ఫ్లవర్ మరియు ఆవాల ఉత్పాదక దేశమైన ఉక్రెయిన్ మరియు రష్యాల మధ్య యుద్ధం కారణంగా సరఫరా తగ్గడంతో మరియు ఇండోనేషియా జనవరి చివరలో పాయాయల్ ఎగుమతులపై కొన్ని ఆంక్షలు విధించింది.


మనదేశం నెలసరి 1.5-2 లక్షల టన్నుల సన్ఫ్లవర్ నూనె దిగుమతి చేసుకుంటున్నది. నవంబర్ నుండి ఏప్రిల్ వరకు సాధారణంగా దిగుమతులు తక్కువగా ఉంటాయి. మార్చి చివరి వరకు దాదాపు 1.50 లక్షల టన్నుల సన్ఫ్లవర్ నూనె మనదేశానికి చేరే అంచనా కలదు. అయితే, ధరలు తగ్గే పరిస్థితి దాదాపు కనిపించడంలేదు. ఎందుకనగా, ప్రపంచంలో సన్ఫ్లవర్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే రష్యా మరియు ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కారణంగా వసంతకాల సీజన్ తగ్గే అవకాశంలేదు కోసం ఉక్రెయిన్లో ఇంతవరకు విస్తీర్ణం 12 శాతం మాత్రమే ఉంది మరియు మనదేశం ఇండోనేషియా నుండి పామాయిల్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నది. అయితే, ఇండోనేషియా స్థానిక మార్కెట్లో పామాయిల్ అమ్మకాలకు ప్రాధాన్యతనిస్తున్నది. లభించిన సమాచారం ప్రకారం రాబోవు రోజులలో డిమాండ్ పూరించడంకోసం వంటనూనెల సరఫరా తగ్గే అవకాశంలేదు. ఎందుకనగా, ఆవాల ఉత్పత్తి 110 లక్షల టన్నులు ఉండే అంచనా కలదు. అయితే, రైతుల వద్ద సోయాబీన్ నిల్వలు ఉన్నాయి.


భారీగా పెరిగిన సనఫ్లవర్ నూనె ధరలు


 అమెరికా వ్యవసాయ శాఖ ( యుఎసిఎ) వర్గాల కథనం ప్రకారం ప్రపంచంలో ప్రముఖ సోయాబీన్ సరఫరా దేశాలైన రష్యా మరియు ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కారణంగా సరఫరాకు అవరోధం ఏర్పడడంతో 23, జనవరి నుండి 8, మార్చి వరకు అర్జెంటీనాలో సన్ఫ్లవర్ నూనె ధర 23 శాతం పెరిగి 8, మార్చిన 2250 డాలర్లు ప్రతిటన్నుకు చేరింది. ఉక్రెయిన్లో ఓడరేవులు మరియు క్రషింగ్ పనులు ఆగిపోవడంతో ప్రపంచ స్థాయిలో సన్ఫ్లవర్ ఎగుమతులు 57 శాతం, నూనె 14 శాతం మరియు పిండి ఎగుమతులు 13 శాతం తగ్గాయి. దీనితో మార్చి చివరలో ఏడు రెట్లు పెరిగి 19 లక్షల టన్నులకు చేరే అంచనా కలదు. సన్ఫ్లవర్ నిల్వలు రష్యా ఎగుమతిదారులు బ్లాక్ సీ షిప్పింగ్ రూట్లో అనిశ్చిత పరిస్థితి మరియు ఆంక్షల కారణంగా రష్యా సన్ఫ్లవర్ ఎగుమతులు 33 శాతం, సన్ఫ్లవర్ నూనె ఎగుమతులు 4 శాతం మరియు సన్ఫ్లవర్ పిండి ఎగుమతులు 3 శాతం తగ్గడంతో అర్జెంటీనాలో డిమాండ్ పెరగడంతో అర్జెంటీనా సన్ఫ్లవర్ నూనె 47 శాతం, సన్ఫ్లవర్ పిండి 27 శాతం పెరుగుదల నమోదయింది. ఎందుకనగా, ఉక్రెయిన్ మరియు రష్యాల మధ్య యుద్ధం కారణంగా సన్ఫ్లవర్ నూనె ఎగుమతులు ప్రభావితం కావడంతో మరియు యూరప్ యూనియన్, టర్కీ, ఇరాన్ మరియు ఈజిప్టు లాంటి ఇతర దిగుమతి దేశాలు కూడా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నాయి.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు