తగ్గిన పసుపు ఎగుమతులు - జనవరి లో కొత్త పసుపు రాబడులు

 

05-12-2021

విశ్లేషకుల కథనం ప్రకారం పసుపు ఉత్పాదక ప్రాంతాలలో మంచి వర్షాలు కురవడంతో, 2022 లో ఉత్పత్తి ముందు సంవత్సరంతో పోలిస్తే 10 శాతం అధికంగా ఉండే అంచనా కలదు. అయితే, కొందరు వ్యాపారులు పంటకు నష్టం వాటిల్లినట్లు ఇప్పటినుండే ప్రచారం చేస్తున్నటికీ, ధరలు పెరిగే అవకాశం కనిపించడంలేదు. ఇందుకు ముఖ్య కారణమేమనగా, దేశంలోని అన్ని ఉత్పాదక మరియు వినియోగ రాష్ట్రా లలో పాత సరుకు నిల్వలు ఉన్నాయి. మరియు మర ఆడించే మసాలా యూనిట్లు అవసరానికి అనుగు ణంగానే సరుకు కొనుగోలు చేస్తు న్నాయి. అన్ సీజన్ లో రూ. 400-500 హెచ్చుతగ్గుల ప్రభావం అధిక ధరలు గల సరుకులపై ఉండదు.


ఎందుకనగా, వార్షిక వడ్డీ మరియు గిడ్డంగుల అద్దెకూడా గిట్టుబాటు కాదు. లభించిన సమాచారం ప్రకారం నిజామాబాద్ ప్రాంతంలో ఆర్మూరు ప్రాంతం నుండి డిసెంబర్ చివరివరకు కొత్త సరుకు రాబడి ప్రారంభమయ్యే అవకాశం కలదు. సాధారణంగా జన వరి నుండి సరుకు రాబడి అవుతుంది. ప్రస్తుత సీజన్ కోసం నిజామాబాద్ ప్రాంతంలో పసుపు ఉత్పత్తి 22 లక్షల బస్తాలు, ఈరోడ్, సేలం మరియు కర్నాటకలలో కలిసి 13 లక్షలు, మరార్వాడా లో 34 లక్షలను దాటే అవకాశం కలదు. ఇందులో 5-10 శాతం పంటకు నష్టం వాటిల్లినప్పటికీ, ధరలపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఎందుకనగా, దేశంలోని అన్ని ఉత్పాదక మరియు వినియోగ రాష్ట్రాలలో కలిసి 40 లక్షల బస్తాలకు పైగా పాత సరుకు నిల్వలు ఉన్నాయి.

డిసెంబర్ లో మనదేశం నుండి పసుపు ఎగుమతులు 26 శాతం తగ్గి 77,245 టన్నులకు చేరాయి మరియు ప్రస్తుతం కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తున్నది. 

గతవారం ఎన్సిడిఇఎక్స్లో సోమవారం పసుపు డిసెంబర్ వాయిదా రూ.7662 తో ప్రారంభమైన తరువాత శుక్రవారం వరకు 7610 మరియు ఏప్రిల్ వాయిదా రూ. 8550తో ముగిసింది.


నిజామాబాద్లో గతవారం 7-8 వేల బస్తాల రాబడిపై అన్పాలిష్ కొమ్ము రూ.6800-7400, గట్టా రూ. 6600-7000, పాలిష్ కొమ్ము రూ. 8200-8300, గట్టా రూ. 7700-7800 మరియు

 వరంగల్ లో కొమ్ము రూ. 5700-6100, గట్టా రూ. 5000-5500,

 దుగ్గిరాలలో 250-300 బస్తాల రాబ డిపై నాణ్యమైన కొమ్ము మరియు గట్టా రూ.6000-6500, పుచ్చు రకం రూ. 5000-5300, కడప ప్రాంతం నుండి 2 లారీల రాబడిపై కొమ్ము మరియు గట్టా రూ.6000-600 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపారమయింది.


మహారాష్ట్రలోని హింగోలి లో సోమ, బుధ మరియు శుక్రవారాలలో కలిసి 6-7 వేల బస్తాల రాబడిపై కొమ్ము రూ. 6700-8100, గట్టా రూ. 6500-7200 మరియు 

నాందేడ్ లో 5-6 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన కొమ్ము రూ. 8200-8500, మీడియం రూ. 7000-8000, గట్టా రూ.6700-7200 మరియు

 బస్మత్నగర్ లో 3-4 వేల బస్తాల అమ్మకంపై నాణ్యమైన కొమ్ము మరియు గట్టా రూ. 7500-7800, మీడియం రూ. 6500-6800, 

సాంగ్లీలో 3-4 వేల బస్తాల అమ్మకంపై నాణ్యమైన రాజాపురి రూ. 9000-10500, మీడియం రూ. 7500-8000, దేశీ కడప రూ. 6500-7400 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపార మయింది. 

తమిళనాడులోని ఈరోడ్లో గతవారం దాదాపు 24-25 వేల బస్తాలు మరియు 

రాసీపురంలో 2500 బస్తాల రాబడిపై నాణ్యమైన కొమ్ము రూ. 9000-9100, మీడియం రూ. 8000-8200, నాణ్యమైన గట్టా రూ. 7000-7500, మీడియం రూ. 6000-6500, పుచ్చురకం కొమ్ము మరియు గట్టా రూ. 4500-5500, 

పెరుందరైలో 3-4 వేల బస్తాల రాబడిపై కొమ్ము రూ. 7099-8599, గట్టా రూ. 6389-7559 మరియు 

గోబిచెట్టిపాలయంలో కొమ్ము రూ. 6402-8233, గట్టా రూ. 5710-7569 ధరతో వ్యాపారమయింది.

Comments

Popular posts from this blog