గిరాకీ లేని పసుపు

 

28-09-2021

       దేశీయ గ్రైండింగ్ యూనిట్లతో పాటు ఎగుమతి వ్యాపారులు లావాదేవీలు తగ్గడమే కాకుండా కొందరు స్టాకిస్టులు అమ్మకాలు పెరగడంతో గత వారం పసుపు ధరలు ప్రతి క్వింటాలుకు రూ.200-300 నాణ్యతానుసారం పతనమయ్యాయి.


గత సోమవారం ఎన్ఎడిఇఎక్స్ వద్ద సెప్టెంబర్ వాయిదా రూ. 6632 తో ప్రారంభమైన తర్వాత సాయంకాలం వరకు రూ. 34 వృద్ధి చెంది రూ. 6666 వద్ద ముగిసింది. అక్టోబర్ వాయిదా రూ. 7288 తో ప్రారంభమై శుక్రవారం రూ. 166 కోల్పోయి రూ. 7122 వద్ద ముగిసింది.

  తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో గత వారం 4-5 వేల బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు అన్-పాలిష్ 000, దుంపలు రూ. 6300-6500, కొమ్ములు పాలిష్ సరుకు రూ. 7500-7600, దుంపలు రూ. 71007200 లోకల్ లూజ్ మరియు వరంగల్ 1500-200 వేల బస్తాలు రాబడిపై కొమ్ములు రూ. 5400-5750, దుంపలు రూ.5200-5400, కేసముద్రంలో 700-800 బస్తాలు కొమ్ములు రూ. 5500-6500, దుంపలు రూ. 4500-5500...


ఆంధ్రప్రదేశ్లోని దుగ్గిరాలలో 1500–1600 బస్తాలు కొమ్ములు, దుంపలు రూ. 5600-5700, మీడియం రకం రూ. 5200-5400, పుచ్చు సరుకు రూ. 4200-4400 ప్రతి క్వింటాలు లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది.


మహారాష్ట్రలోని హింగోళిలో గత వారం 14-15 వేల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు రూ. 6000-7000, దుంపలు రూ.6000-6700, నాందేడ్లో 3-4 వేల బస్తాలు కొమ్ములు రూ. 6000-6800, దుంపలు రూ. 6000-6300, సాంగ్లీలో 4-5 వేల బస్తాలు రాజాపురి రూ.7500-7700, దేశీ సరుకు కడప రకం రూ. 6000-6300, బస్మత్నగర్ లో 1500-2000 బస్తాలు - కొమ్ములు రూ. 6000- 7300, దుంపలు రూ. 5500-6200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


తమిళనాడులోని ఈరోడ్ మార్కెట్లో గత వారం 10-12 వేల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు రూ. 5000 - 7500, దుంపలు రూ. 4500-6500, పెరుందురైలో 3-4 వేల బస్తాలు కొమ్ములు రూ. 5902-7209, దుంపలు రూ.5466-6769 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog